BigTV English

Fruits: ఈ ఫ్రూట్స్.. రాత్రి పూట అస్సలు తినకూడదు తెలుసా ?

Fruits: ఈ ఫ్రూట్స్.. రాత్రి పూట అస్సలు తినకూడదు తెలుసా ?

Fruits: పండ్లు మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కానీ రాత్రిపూట వాటిని తినడం వల్ల ప్రయోజనం కంటే హాని కలుగుతుంది. మీకు రాత్రిపూట పండ్లు తినే అలవాటు ఉంటే మాత్రం మీ జీవక్రియ మందగించే ప్రమాదం ఉంది. రాత్రిపూట పండ్లను జీర్ణం చేసుకోవడంలో సమస్యలు ఏర్పడతాయి. అధిక చక్కెర కంటెంట్ ఉన్న పండ్లు రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతాయి. పుల్లటి పండ్లు యాసిడ్ రిఫ్లక్స్‌కు కారణమవుతాయి.


అదేవిధంగా.. రాత్రిపూట పండ్లు తినడం వల్ల బరువు కూడా పెరిగే ప్రమాదం కూడా ఉంటుంది. నిద్రలేమి, దంత క్షయం వచ్చే ప్రమాదం పెరుగుతుంది. పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వీటిలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. కానీ వీటిని తినడానికి ముందు సమయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. లేకపోతే.. బాధపడే అవకాశాలు కూడా ఉన్నాయి. రాత్రిపూట పండ్లు తినడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

జీర్ణ సమస్యలు:
రాత్రిపూట శరీరంలో జీవక్రియ రేటు నెమ్మదిస్తుంది. ఇలాంటి పరిస్థితిలో.. ఆపిల్, పియర్ లేదా అరటిపండు వంటి ఫైబర్ అధికంగా ఉండే పండ్లను రాత్రిపూట తినకూడదు. ఇది అజీర్ణం, గ్యాస్ వంటి సమస్యలను కలిగిస్తుంది. జీర్ణక్రియ బలహీనంగా ఉన్నవారు రాత్రిపూట పండ్లు తినడం మానుకోవాలి.


రక్తంలో చక్కెర స్థాయి:
పండ్లలో సహజ చక్కెర ఉండటం వల్ల, అది రోజంతా మనల్ని శక్తివంతంగా ఉంచుతుంది. రాత్రిపూట పండ్లు తినడం వల్ల శరీరం శక్తిని సరిగ్గా ఉపయోగించుకునే సమయం ఉండదు. దీని కారణంగా రక్తంలో చక్కెర అకస్మాత్తుగా పెరుగుతుంది. అందుకే డయాబెటిక్ రోగులు ముఖ్యంగా రాత్రిపూట చాలా తీపిగా ఉండే పండ్లను తినకుండా ఉండాలి.

అసిడిటీ, రిఫ్లక్స్ ప్రమాదం:
నారింజ, పైనాపిల్, ద్రాక్షలు ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయి. రాత్రిపూట వీటిని తినడం వల్ల కడుపులో ఆమ్లం పెరుగుతుంది. ఇది యాసిడ్ రిఫ్లక్స్ , గుండెల్లో మంటకు కారణమవుతుంది. మీరు ఇప్పటికే ఆమ్లత్వంతో బాధపడుతుంటే.. రాత్రిపూట సిట్రస్ పండ్లను అస్సలు తినకూడదు.

బరువు పెరిగే ప్రమాదం:
రాత్రిపూట శరీరం యొక్క శక్తి వినియోగం తగ్గుతుంది. దీని కారణంగా అదనపు కేలరీలు కొవ్వుగా నిల్వ కావడం ప్రారంభమవుతుంది. ముఖ్యంగా రాత్రిపూట అరటిపండ్లు, మామిడి పండ్లు , సపోటా వంటి అధిక కేలరీల పండ్లను తినడం వల్ల బరువు పెరుగుతుంది. మీరు మీ బరువును అదుపులో ఉంచుకోవాలనుకుంటే.. రాత్రిపూట పండ్లు తినడం మానేయండి.

Also Read: డైలీ ఇలా చేస్తే.. జుట్టు ఊడమన్నా ఊడదు తెలుసా ?

నిద్ర సమస్యలు:
రాత్రిపూట ఫైబర్ లేదా చక్కెర అధికంగా ఉండే పండ్లు తినడం వల్ల నిద్రపై ప్రభావం చూపుతుంది. తీపి పండ్లు రక్తంలో చక్కెరను పెంచుతాయి. ఇది మెదడును మరింత చురుగ్గా చేస్తుంది. అంతే కాకుండా నిద్రపోవడంలో ఇబ్బందిని కలిగిస్తుంది. మీరు రాత్రి బాగా నిద్రపోకపోతే.. పడుకునే ముందు పండ్లు తినడం మానేయండి.

దంత సమస్యలు:
పండ్లలో సహజ చక్కెరలు ఉంటాయి. ఇవి దంతాలకు అంటుకుని బ్యాక్టీరియాను ప్రోత్సహిస్తాయి. రాత్రిపూట పండ్లు తిన్న తర్వాత మీరు సరిగ్గా బ్రష్ చేయకపోతే.. అది కావిటీస్ , చిగుళ్ల సమస్యలను కలిగిస్తుంది. ముఖ్యంగా సిట్రస్ పండ్లలో ఉండే ఆమ్లం దంతాల ఎనామిల్‌ను దెబ్బతీస్తుంది.

Related News

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Big Stories

×