Tamil Star Hero: డాలర్ డ్రీమ్స్ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు శేఖర్. అయితే ఈ సినిమా వచ్చినట్లు కూడా చాలామందికి తెలియదు అనేది వాస్తవం. కానీ ఈ సినిమాకి నేషనల్ అవార్డు వచ్చింది.ఈ సినిమా తర్వాత శేఖర్ దర్శకత్వం వహించిన సినిమా ఆనంద్. అప్పట్లో ఈ సినిమా డీసెంట్ హిట్ గా నిలిచింది. ఒకవైపు శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమా రిలీజ్ అవ్వటం దానితో పాటుగా ఈ సినిమా రిలీజ్ అవ్వటం యాదృచ్ఛికంగా జరిగింది. శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమా టికెట్లు దొరకని చాలామంది ఆనంద్ సినిమాకు వెళ్లడం మొదలుపెట్టారు. వెళ్లిన తర్వాత అర్థమైంది ఇది ఒక మంచి కాఫీలాంటి సినిమా అని. ఇక కేవలం మౌత్ టాక్ తో ఈ సినిమా సంచలనం సృష్టించింది. ఈ సినిమా తర్వాత ఇండస్ట్రీలో దర్శకుడుగా సెటిల్ అయిపోయాడు శేఖర్.
నమ్మి వస్తే అలా చేశారు
ఒక తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోస్ లో ధనుష్ ఒకరు. ఇదివరకే ప్రేక్షకులకు 3, రఘువరన్ బీటెక్ వంటి సినిమాలతో ధనుష్ కూడా పరిచయం. వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన సార్ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దాదాపు 100 కోట్లకు పైగా కలెక్షన్స్ సోషల్ చేసింది. ఇప్పుడు తెలుగులో కూడా ధనుష్ కు మంచి మార్కెట్ ఉంది. ఇక ధనుష్ ప్రస్తుతం శేఖర్ కమ్ములతో కుబేర సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా జూన్ 20న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ తమిళ్లో జరిగింది. శేఖర్ కమ్ముల చాలా మంచి డైరెక్టర్ అని నమ్మి వస్తే, నన్ను కింద కూర్చొని పెట్టి, నేల పైన పడుకోబెట్టి, వర్షంలో తిరిగేలా చేసి అమ్మ అయ్య అనేలా చేశారు నాతో అని నవ్వుతూ తన పాత్ర గురించి తెలిపాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఫస్ట్ టైం భారీ బడ్జెట్
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఎన్ని సినిమాలు వచ్చినా కూడా హ్యాపీడేస్ సినిమాకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. కాలేజ్ లైఫ్ ఎలా ఉంటుంది అని శేఖర్ కమ్ముల చూపించిన విధానం చాలామందికి విపరీతంగా కనెక్ట్ అయింది. ఇప్పటికీ కూడా చాలామందికి ఫేవరెట్ సినిమా అది. అయితే శేఖర్ కమ్ముల సినిమాలన్నీ కూడా భారీతనంతో కాకుండా మన మధ్య జరిగే కథ లా అనిపిస్తూ ఉంటాయి. కొన్ని లవ్ స్టోరీస్ ని శేఖర్ తీసిన విధానం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇక ప్రస్తుతం శేఖర్ కెరియర్లో భారీ బడ్జెట్ తో కుబేర సినిమాను చేస్తున్నారు.
Also Read: Mahesh Babu as Pushpa : పుష్ప రాజ్‌గా మహేష్ బాబు… మీకు ఇది చూసే ధైర్యం ఉందా ?