Deepika Padukone..సినిమా ఇండస్ట్రీ.. దీని గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ ఇండస్ట్రీలోకి ఎంతోమంది నటీనటులు అడుగు పెడతారు. తెలియని వ్యక్తులతో బంధాలు ఏర్పడతాయి. అదే బంధాలు ముందుకు వెళ్లి.. పెళ్లిగా మారితే, మరి కొంతమంది చిన్న చిన్న కారణాలవల్ల బ్రేకప్ చెప్పుకుంటారు. ఇంకొంతమంది టైం పాస్ కోసం ఇతరులను వాడుకోవడం.. ఇలా ఎన్నో మనం చూస్తూనే ఉంటాం. అందుకే సినీ ఇండస్ట్రీని ఒక సముద్రం అని చెప్తారు. ఇందులో మంచి ఎంత ఉందో.. చెడు కూడా అంతే ఉందని అనుభవించిన వారు ఇప్పటికే ఎన్నోసార్లు తెలిపిన విషయం తెలిసిందే. ఇకపోతే మాసిన గాయాలను కొంతమంది మళ్లీమళ్లీ గుర్తు చేస్తూ దెబ్బతిన్న వారిని దోషులుగా అందరి ముందు నిలబెడుతూ ఉంటారు. మరికొంతమంది తాము చేసిన తప్పును తెలుసుకొని నిజాలు బయట పెడుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటారు.
రణబీర్ తో పెళ్లికి ముందే అతడితో రెండేళ్లు డేటింగ్ చేసిన దీపిక..
ఈ క్రమంలోనే తాజాగా దీపికా పదుకొనే (Deepika Padukone) కి సంబంధించిన ఒక షాకింగ్ విషయం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అయితే సడన్ గా దీపిక గురించి వార్తలు రావడానికి కారణం బాలీవుడ్ హీరో ముజమ్మిల్ ఇబ్రహీం (Muzammil Ibrahim) అని చెప్పాలి. బాలీవుడ్ హీరోగా పేరు తెచ్చుకున్న ఈయన ‘ఢోకా’ సినిమాతో స్టార్ హీరోగా మారారు. ఇప్పుడు ఒక ఇంటర్వ్యూలో పాల్గొని దీపిక పదుకొనే గురించి, ఆమెతో చేసిన డేటింగ్ గురించి చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు..
ఈయన మాట్లాడుతూ..” 2018 వరకు దీపికా పదుకొనేతో నా ప్రేమాయణం సాగింది. మేమిద్దరం దాదాపు రెండు సంవత్సరాలు ప్రేమించుకున్నాము. అయితే మా ప్రేమలో మొదట దీపికా పదుకొనే నాకు ప్రపోజ్ చేసింది. ఆమెతోనే నా మొదటి ప్రేమ కూడా ప్రారంభమైంది.. కానీ కొన్ని కారణాలవల్ల నేనే దీపికాను వదిలేసాను” అంటూ సంచలన కామెంట్లు చేశారు ముజమ్మిల్ ఇబ్రహీం. ఇక ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఈ విషయం తెలిసి అసలు ఎందుకు దీపికాను అతడు వదిలేశాడు? అసలేం జరిగింది? అనే కోణంలో అభిమానులు కూడా ఆరాతీస్తున్నారు.
ALSO READ: RGV: అమితాబ్ వల్లే సాధ్యం.. రజినీ, చిరుపై ఆర్జీవీ అవమానకర కామెంట్స్!
రిక్షాలో తిరిగిన రోజులున్నాయి..
ఇకపోతే దీపికాతో రిలేషన్ గురించి మాట్లాడుతూ.. నేను ఇండియన్ సూపర్ మోడల్ గా గుర్తింపు తెచ్చుకున్నాను. అలా ముంబైకి వచ్చిన కొత్తలో దీపిక పదుకొనే కూడా మోడల్ గా పనిచేస్తోంది. అప్పుడే మా పరిచయం ప్రేమగా మారింది. మా దగ్గర డబ్బులు లేక రిక్షాల్లో కూడా తిరిగే వాళ్ళం. తర్వాత కొన్ని కారణాలతో బ్రేకప్ చెప్పుకున్నాము
అయితే అప్పుడప్పుడు మాట్లాడుకునే వాళ్లం. కానీ ఆమెకు పెళ్లయ్యాక మాట్లాడుకోవడమే మానేశాము అంటూ తెలిపారు. ఇక దీపిక.. రణవీర్ సింగ్ ( Ranveer Singh) ను 2019లో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి గత ఏడాది ‘దువా’ అనే కూతురు కూడా జన్మించింది.