BigTV English

Nindu Noorella Saavasam Serial Today June 6th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరికి షాక్‌ ఇచ్చిన మిస్సమ్మ

Nindu Noorella Saavasam Serial Today June 6th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  మనోహరికి షాక్‌ ఇచ్చిన మిస్సమ్మ

Nindu Noorella Saavasam Serial Today Episode: తన పెళ్లి గురించి. తను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి గురించి మాట్లాడటానికి మిస్సమ్మ ఎవరు అంటూ వినోద్‌ తిట్టడంతో మిస్సమ్మ బాధగా అక్కడి నుంచి లేచి బయటకు వెళ్లిపోతుంది. గార్డెన్‌ లో నిలబడి ఏడుస్తుంది. వెనకాలే వచ్చిన అమర్‌, మిస్సమ్మను ఓదారుస్తాడు. దీంతో నేను వినోద్ మంచి కోసమే చెప్పాను కదండి అంటూ మిస్సమ్మ ఎమోషనల్‌ అవుతుంది. దీంతో అమర్‌ నాకు తెలుసు భాగీ అంటూ ఇవన్నీ మనసులో ఏం పెట్టుకోకు అంటాడు. మరోవైపు శివరాం కోపంగా వినోద్‌ను తిడతాడు. మాట్లాడే హక్కు అధికారం ఈ ఇంటి కోడలుగా భాగీకి పూర్తిగా ఉన్నాయి. నువ్వు చేసుకోబోయే అమ్మాయి మాకు నచ్చితే సరిపోదు.. తనకు కూడా నచ్చాలి. అయినా ఏమైందిరా నీకు వచ్చినప్పటి నుంచి ఎందుకు భాగీని శత్రువులా చూస్తున్నావు. ఎందుకు తన మనసు నొచ్చుకునేలా మాట్లాడుతున్నావు అని నిర్మల అడుగుతుంది.


ఇంతలో అక్కడకు వచ్చిన మిస్సమ్మ పర్వాలేదు అత్తయ్యా వినోద్‌ నాతో నువ్వు ఎలా అయినా మాట్లాడు..  ఎంతైనా కోప్పడు కానీ చిత్ర గురించి ఇంకొక్కసారి ఆలోచించు.. అని చెప్పగానే.. బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నానండి నేను చిత్రను తప్పా ఇంకెవరినీ పెళ్లి చేసుకోను అని కరాకండిగా చెప్తాడు. దీంతో శివరాం కోపంగా రేయ్‌ నువ్వు వచ్చి నెల అయినా కాలేదు.. ఆ అమ్మాయితో పరిచయం అయి పది రోజులైనా కాలేదు. అప్పుడే ప్రేమ అంటున్నావు.. పెళ్లి అంటున్నావు అంటాడు. దీంతో వినోద్‌ నాన్నా వదినతో పెరిగిన అమ్మాయి. వదిన లాగే తను పడిన భాద ఎవ్వరూ పడకూడదని ఆలోచిస్తుంది. ఇంతకన్నా ఏం తెలుసుకోవాలి.. తను నాకు బాగా నచ్చింది. అని చెప్తాడు.

దీంతో మిస్సమ్మ అది కాదు వినోద్‌ అని ఏదో చెప్పబోతుంటే.. మీకు చెప్పాల్సింది చెప్పాను.. మీకు ఇష్టం లేకుంటే చెప్పాను కదా ఎలాగైనా పెళ్లి చేసుకుంటాను అని చెప్పి వెళ్లిపోతాడు. అందరూ షాకింగ్‌ గా చూస్తుంటారు. అక్కడే ఉన్న గుప్తను అనామిక ఏంటి గుప్తగారు ఇంట్లో ఉన్న మనోహరిని వెళ్లగొడదామనుకుంటే బయట ఉన్న చిత్రను ఇంట్లోకి తీసుకొస్తానంటున్నాడేంటి వినోద్‌.. అంటూ బాధపడుతుంది. ఇప్పుడే వెళ్లి దాని చరిత్ర అంతా చెప్పేస్తాను అంటూ వెళ్లబోతుంటే.. గుప్త ఆగుము బాలిక అది అతగాడి నిర్ణయం.. అది నువ్వు మార్చుటకు వీలులేదు అంటూ హెచ్చిరిస్తాడు గుప్త. దీంతో  నా కళ్ల ముందే నా మరిది జీవితం నాశనం అవుతుంటే చూస్తూ ఎలా ఊరుకోమంటారు గుప్త గారు అని అడుగుతుంది. దీతో గుప్త ఊరుకోవాలి. అతగాడికి ఆవిడనే భార్యగా రావాలని రాసి పెట్టి ఉంది అని చెప్పగానే అనామిక బాధపడుతుంది.


తర్వాత అమర్‌ అందరినీ పిలుస్తాడు. అందరూ రాగానే మనోహరిని కూడా రమ్మని పిలుస్తాడు. మనోమరి వచ్చి ఏంటి అమర్‌ పిలిచావు అని అడుగుతుంది. దీంతో అమర్‌ నిన్ను ఒక విషయం డైరెక్టుగా అడుగుతున్నాను..చిత్రకు వినోద్‌కు పెళ్లి చేయాలనుకుంటున్నాము. చిత్ర తరపున ఉన్నది నువ్వే కదా నువ్వేం అంటావు అని అడగ్గానే.. మనోహరి ఏమీ తెలియనట్టు ఏంటి అమర్‌ నువ్వు చెప్తుంది నిజమా..? చిత్ర చాలా మంచి అమ్మాయి.. వినోద్‌కు ఫర్పెక్ట్‌ జోడీ అని చెప్తుంది. అయితే మేమందరం కలిసి చిత్ర ఇంటికి వెళ్లి సంబంధం అడగాలనుకుంటున్నాము ఒకసారి చిత్రకు కాల్ చేసి ఇవ్వు అమర్‌ అడుగుతాడు.

దీంతో అమ్మో చిత్ర ఎదుటివాళ్లు మాట్లాడేవరకు ఆగకు ఇప్పుడు అమర్‌తో ఏదిపడితే అది మాట్లాడితే అని మనసులో అనుకుంటుంటే అమర్‌ ఏమైంది మనోహరి ఫోన్‌ చేసి ఇవ్వు అంటాడు. మనోమరి ఫోన్‌ చేసి ఇస్తుంది. చిత్ర, హలో మను అంటూ ఏదేదో మట్లాడుతుంటే అమర్‌ హలో చిత్ర నేను అమరేంద్రను అంటాడు. దీంతో చిత్ర షాక్‌ అవుతుంది. అమర్‌ విషయం చెప్పి ఫోన్‌ కట్‌ చేస్తాడు. తర్వాత మనోహరి వెళ్లిపోతుంటే మిస్సమ్మ ఆగమని చెప్పి చిత్ర ఎందుకు నీకు థాంక్స్‌ చెప్పింది. నువ్వు ఏం గుడ్‌న్యూస్‌ చెప్పాలనుకున్నావు అంటూ అడుగుతుంది. మనోహరి షాక్‌ అవుతుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: ఫస్ట్‌ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?

 

Related News

Today Movies in TV : సోమవారం సూపర్ సినిమాలు.. వీటిని మిస్ చెయ్యకండి..

Big tv Kissik Talks: అమర్ దీప్ పై రాశి షాకింగ్ కామెంట్స్.. దేవుడు ఇచ్చిన కొడుకు అంటూ!

Big tv Kissik Talks: రంగమ్మత్త పాత్ర పై రాశి కామెంట్స్..అందుకే వద్దనుకున్నా అంటూ!

Big tv Kissik Talks: కళ్ళను డొనేట్ చేసిన నటి రాశి…ఆ సినిమా ప్రభావమేనా?

Big tv Kissik Talks: గోకులంలో సీత 2 మనసులో మాట బయటపెట్టిన రాశి… పవన్ ఛాన్స్ ఇస్తారా?

Big tv Kissik Talks:  కూతురి కోసం శ్రీకాంత్ కొడుకును లైన్ లో పెట్టిన రాశి..పెద్ద ప్లానింగే!

Intinti Ramayanam Today Episode: గుడ్ న్యూస్ చెప్పిన అవని.. ఫిట్టింగ్ పెట్టిన పల్లవి.. నిజం తెలుసుకున్న అవని..?

GudiGantalu Today episode: మీనా పై అక్కసు కక్కేసిన ప్రభావతి.. శృతి మాటతో రోహిణికి షాక్.. మీనాను గెంటేసిన ప్రభావతి..

Big Stories

×