BigTV English

Kasthuri Shankar: కాళ్ళ బేరానికి వచ్చిన కస్తూరి.. నోటి దూలకు గట్టి దెబ్బే..!

Kasthuri Shankar: కాళ్ళ బేరానికి వచ్చిన కస్తూరి.. నోటి దూలకు గట్టి దెబ్బే..!

Kasthuri Shankar: ప్రముఖ నటి కస్తూరి శంకర్ (Kasthuri Shankar) ఇటీవల పొలిటికల్ ఈవెంట్ లో భాగంగా తెలుగువారిపై చేసిన కామెంట్లు తెలుగు తమ్ముళ్లను ఆగ్రహానికి గురిచేస్తున్నాయి. ” 300 ఏళ్ల క్రితం ఒక తమిళ రాజు అంతఃపురంలో రాణులకు సేవ చేయడానికి వెళ్లారు.అలాగే తెలుగు వారు కూడా తమిళనాడుకు వచ్చారు” అంటూ హేయమైన వ్యాఖ్యలు చేసింది కస్తూరి శంకర్. దీంతో తెలుగు సంఘాలు , తెలుగు ప్రజలు కస్తూరిని విమర్శిస్తున్నారు. ఈమె ఒక చరిత్ర హీనురాలు అని, ప్రతి విషయాన్ని వివాదంగా మార్చి వార్తల్లో నిలవాలని చూస్తోంది అని , వెంటనే తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని, క్షమాపణలు చెప్పకపోతే లీగల్ గా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటూ డిమాండ్ చేశారు.


తెలుగు వారిపై అనుచిత వ్యాఖ్యలు.. స్పందించిన కస్తూరి..

అయితే వెంటనే స్పందించిన కస్తూరి శంకర్..” తెలుగు వారు నా కుటుంబంతో సమానం. ఎవరిని కూడా నేను తప్పుగా ఉద్దేశించి మాట్లాడలేదు. దయచేసి నెగటివ్ గా నన్ను చూపించాలనుకోవద్దు. తెలుగు వారిపై నేను వ్యతిరేకంగా మాట్లాడాను అని విష ప్రచారం చేయడం సరైన పద్ధతి కాదు” అంటూ కూడా కామెంట్లు చేసింది. అయినా సరే ఒక తెలుగు వారిని బానిసలుగా చేసి మాట్లాడడం కరెక్ట్ కాదు అంటూ ఆమెపై నెటిజన్స్ మండిపడుతున్న నేపథ్యంలో.. తాజాగా తన ఎక్స్ ఖాతా ద్వారా మరో పోస్ట్ షేర్ చేసింది కస్తూరి శంకర్.


తెలుగువారికి క్షమాపణలు చెబుతూ పోస్ట్ షేర్ చేసిన కస్తూరి..

ఇక ఆమె ఒక లాంగ్ నోట్ వదులుతూ అందులో తెలుగువారికి క్షమాపణలు చెప్పింది. ఇక అందులో ఏముంది అనే విషయానికొస్తే.. ” గత రెండు రోజులుగా నేను బెదిరింపులతో పాటు దాడులు కూడా ఎదుర్కొంటున్నాను. అవి నా సంకల్ప బలాన్ని మరింత కఠినతరం చేస్తున్నాయి.. అయితే ఈరోజు నా అత్యంత గౌరవనీయమైన తెలుగు సోదరులు , తమిళనాడులో ఉన్న తెలుగు సోదరులు అలాగే తమిళనాడు బయట ఉన్న తెలుగు ప్రజలకు నేను మాట్లాడిన మాటలు ఆగ్రహాన్ని తెప్పించాయి. అయితే నేను చెప్పిన మాటలను కాస్త ఓపికగా ఆలోచిస్తే అందులో మీకు తప్పు అనిపించదు. నేను నిజమైన జాతీయవాదిని. నా భరతమాత ఏకత్వంలో భిన్నత్వం పట్ల అపారమైన గర్వం తో ఉన్నాను. ఎప్పుడూ కూడా కుల ప్రాంతీయ భేదాలకు అతీతంగానే జీవించాను. ముఖ్యంగా తెలుగువారితో ప్రత్యేక అనుబంధం వుండడం నా అదృష్టం. నేను నాయకరాజులు, కట్టుబొమ్మ నాయక, త్యాగరాజ కృతులు గానం చేసిన అద్భుతమైన రోజులను తలుచుకుంటూ ఉంటాను. తెలుగు ప్రజలే నాకు పేరు, కీర్తి, ప్రేమతో పాటు కుటుంబాన్ని కూడా అందించారు. అయితే నేను వ్యక్తపరిచిన అభిప్రాయాలు సందర్భానుసారంగా నిర్దిష్ట వ్యక్తులను మాత్రమే ఉద్దేశించినవి.. తెలుగు సమాజాన్ని ఉద్దేశించి నేను వ్యాఖ్యలు చేయలేదు. నా తెలుగు పెద్ద కుటుంబాన్ని బాధపెట్టడం లేదా కించపరచడం నా ఉద్దేశం కాదుm అన్ని రకాల స్నేహబంధాలను దృష్టిలో పెట్టుకొని మీరు నన్ను క్షమిస్తారని కోరుకుంటున్నాను. 2024 నవంబర్ 3 వ తేదీన ఒక మీటింగ్ లో నేను మాట్లాడిన మాటలు అన్నింటిని కూడా వెనక్కి తీసుకుంటున్నాను. దయచేసి తెలుగు ప్రజలు నన్ను క్షమిస్తారని కోరుకుంటున్నాను.. తమిళనాడులోని తెలుగు సోదరులు తమ పరువు కోసం జరిగే పోరాటంలో తమిళనాడు బ్రాహ్మణులకు అండగా నిలవాలని కూడా నేను కోరుతున్నాను.. జైహింద్”.. అంటూ తన పోస్ట్ ముగించింది కస్తూరి. ప్రస్తుతం ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది ఇది చూసిన కొంతమంది నెటిజెన్స్ ఫస్ట్ నోటి దూల తగ్గించుకో.. మాటలన్నీ మాట్లాడి ఇప్పుడు కాళ్ళ బేరానికి వచ్చావా అంటూ కామెంట్ చేసినట్టు తెలుస్తోంది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×