BigTV English

Akkineni Nagarjuna: అయ్యయ్యో.. నాగ్ ని ఇంత మోసం చేశావా శేఖర్ మావా ?

Akkineni Nagarjuna: అయ్యయ్యో.. నాగ్ ని ఇంత మోసం చేశావా శేఖర్ మావా ?

Akkineni Nagarjuna: టాలీవడ్ లో ప్రయోగాలకు కేరాఫ్ అడ్రెస్స్ అంటే  అక్కినేని నాగార్జున అనే పేరు వినిపిస్తుంది. తెలుగు ఇండస్ట్రీలో ఆయన చేసినన్ని ప్రయోగాలు ఇంకెవరు చేసి ఉండరు. హీరోగా కమర్షియా హిట్ అందుకుంటున్న సమయంలో భక్తి పాత్రలు చేయడం, డబుల్ రోల్స్ చేయడం.. ఇలా ఒకటి అని చెప్పలేం. అలా ఎన్నో ప్రయోగాలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న కింగ్.. ఇప్పుడు మరో ప్రయోగం చేసి సక్సెస్ అయ్యాడు.


 

టాలీవుడ్ లో సీనియర్ హీరోలు.. ఎంత వయస్సు వచ్చినా హీరోలుగానే చేస్తున్నారు. ఎంత వయస్సు ఉన్నా.. వారికి 20 ఏళ్ల హీరోయిన్ తో రొమాన్స్ కావాలి.  సైడ్ రోల్స్ కానీ, సపోర్టివ్ రోల్స్ లో కానీ నటించము అని తెగేసి చెప్పేస్తారు. అలాంటి మైండ్ సెట్ నుంచి బయటకు వచ్చాడు నాగ్. మొట్ట మొదటిసారి ఒక సీనియర్ హీరో.. హీరో అనే సర్కిల్ నుంచి బయటకు వచ్చి సపోర్టింగ్ రోల్ లో నటించిన ఏకైక హీరో నాగ్. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కుబేర. ఎన్నో అంచనాలతో జూన్ 20 న రిలీజ్ అయిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది.


 

ధనుష్ నటన సినిమాకే హైలైట్. అసలు డబ్బు, ఆస్తులు అనేవి ఏమి తెలియని ఒక బిచ్చగాడు.. వేల కోట్లకు అధిపతి ఎలా అయ్యాడు అనేది కుబేర కథ. నిజం చెప్పాలంటే ఈ సినిమా అనౌన్స్ చేసిన దగ్గరనుంచి ధనుష్ కన్నా ఎక్కువా నాగ్ కోసమే  థియేటర్స్ కు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని చాలామంది చెప్పుకొచ్చారు. శేఖర్.. ధనుష్ కన్నా నాగ్ నే మెయిన్ హీరో అన్నట్లు ట్రైలర్ ఈవెంట్ వరకు చెప్పుకొచ్చాడు. కానీ, సినిమా రిలీజ్ అయ్యాకా.. నాగ్ పాత్ర తేలిపోయింది.

 

దీపక్ పాత్రలో నాగ్ మాత్రమే కాదు.. ఏ సపోర్టివ్ హీరో చేసినా నడిచిపోయేలా అనిపిస్తుంది. అసలు నాగ్ ను ఇలా చూపించాలని శేఖర్ కు ఎందుకు అనిపించింది. ఒక నిజాయితీ గల ఆఫీసర్.. డబ్బు, పవర్ లేకపోతే న్యాయం కూడా లేదని.. ఒక తప్పుడు పనికి ఓకే చెప్పి చేయడం వరకు బాగానే ఉన్నా.. కానీ, అది తప్పు అని తెలుసుకున్నాకా దీపక్ ఏం చేశాడు.. ? ఎంతలా పోరాడాడు అనేది చూపించినా అందులో అంత బలం లేదు అనిపిస్తుంది. తన భార్య, బిడ్డను దుబాయ్ కి పంపి.. తానూ వచ్చేస్తానని మాట ఇచ్చిన దీపక్.. చివరికి మృత్యు ఒడిలోకి జారుకుంటాడు. కానీ, తాను ఎదుర్కొనే విలన్ ముందు నిలబడి సవాలు విసరడం కానీ, దేవాకు తోడుగా నిలబడతాను అని కానీ చెప్పడు. నాగ్ లాంటి ఒక స్టార్ హీరోను దీపక్ పాత్రలో పెట్టిన శేఖర్.. ఆ పాత్రకు అంతగా న్యాయం చేయలేకపోయాడని చెప్పాలి.

 

అయితే శేఖర్.. నాగ్ కు చెప్పింది ఒకటి.. సినిమాలో చూపించింది ఒకటి అని తెలుస్తోంది. తాజాగా నాగ్ మాట్లాడుతూ.. కుబేర సినిమాలో మొదట తన పాత్రనే మెయిన్ లీడ్ అని శేఖర్ చెప్పినట్లు తెలిపాడు. నాగ్ కూడా అదే అనుకోని ఈ పాత్రకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. కానీ, సినిమాలో నాగ్ ఒక డమ్మీ పీస్. అటు హీరోకి సపోర్ట్ చేయలేక.. ఇటు విలన్ ను ఏమి చేయలేక నలిగిపోయే ఒక సాధారణ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్ర అని చెప్పొచ్చు.

 

పోనీ ధనుష్ – నాగ్ మధ్య  ఎమోషనల్ బాండింగ్ పెట్టి.. వారిద్దరి సీన్స్ ఇంకా బలంగా చూపించి ఉంటే ఇంకాస్తా ఇంపాక్ట్ ఉండేదేమో అనిపిస్తుంది. నాగ్ చనిపోయేటప్పుడు తప్ప ధనుష్ తో అంత  ర్యాపో మైంటైన్ చేసినట్లు చూపించలేదు. ఇక చివర్లో.. నాగ్ ఇచ్చిన ఆధారాలతో  ధనుష్ ప్రభుత్వాన్ని కూల్చేసి.. అతని మీద ఉన్న మచ్చను చెరిపేసి.. నిజంగా సొంత అన్న అన్నట్లు ధనుష్ హైలైట్ చేసి ఉంటే అతని పాత్రకు జస్టిఫికేషన్ అయినా దక్కేది. కానీ, అది జరగలేదు.

 

ఇదంతా శేఖర్.. నాగ్ కు కథ చెప్పినప్పుడు చెప్పలేదా.. ? నాగ్ ను శేఖర్ అంత మోసం చేశాడా.. ? అని అంటే.. శేఖర్ మోసం చేయలేదు.. నాగ్ నే మోసపోయాడు అని చెప్పొచ్చు. ఇప్పుడు ధనుష్ పాత్రకు అన్ని అభినందనలు వస్తున్నాయి అంటే.. నాగ్ చేసిన త్యాగం వలనే. అతని క్యారెక్టర్ అంత పేలవంగా ఉంది కాబట్టే ధనుష్ హైలైట్ అయ్యాడు. కింగ్ అయిన నాగ్.. కుబేరలో ఇలా జీవచ్ఛవం లాంటి పాత్రను ఒప్పుకొని నిజంగా మోసపోయాడు అని చెప్పడంలో ఎటువటి అతిశయోక్తి లేదు. ఏదిఏమైనా నాగ్ ను కనుక మరింత బలంగా చూపించి ఉంటే.. కుబేర వేరే రేంజ్ లో ఉండేది.

 

కుబేర.. నాగ్ కు ఒక గుణపాఠం లాంటిది. సపోర్టివ్ రోల్స్ లో నటించడం మంచిదే కానీ, ఆ సినిమాలోని పాత్ర  అందరికన్నా ఎక్కువ హైలైట్ ఉంటేనే చేయాలి. లేకపోతే ఇదుగో ఇలానే సోషల్ మీడియాలో ట్రోల్స్ బారిన పడాల్సి వస్తుంది. నాగ్  పాత్ర హీరోకు తక్కువ, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కి ఎక్కువ అన్నట్లు ఉంది. మరి నాగ్.. కూలీలో కూడా ఇలాంటి పాత్రనే చేయబోతున్నాడా.. ? అది కూడా ఇలానే అవుతుందా .. ? అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఎదురుచూడాల్సిందే.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×