Akhil Akkineni: తెలుగు ఇండస్ట్రీలోనే కాదు.. ప్రపంచంలోనే ఏ ఇండస్ట్రీలో కూడా ఒక కొడుకును.. ఒక తండ్రి ఇన్ని రీ.. రీ.. రీ లాంచ్ లు చేయలేదు. ఆ రికార్డ్ ను అందుకున్న ఏకైన హీరో అఖిల్ అక్కినేని మాత్రమే. అక్కినేని నటవారసుడిగా అఖిల్ సినిమాతో అఖిల్ ఎంట్రీ ఇచ్చాడు. అక్కినేని వారసుడు ఎంట్రీ ఇస్తున్నాడు అంటే ఏ రేంజ్ లో ఉండాలో వాటికి తగ్గట్టే అఖిల్ ఎంట్రీ ఉంది. భారీ బడ్జెట్, విజువల్స్, ఒక సాంగ్ లో నాగ్ ఎంట్రీ.. ఇలా అఖిల్ సినిమాను ఓ రేంజ్ లో రిలీజ్ చేశారు. కానీ ఆ సినిమా. ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఇక ఈ సినిమా తరువాత కొడుకు ఇండస్ట్రీలో నిలబెట్టడానికి నాగార్జున చేయని ప్రయత్నం లేదు. స్టార్ డైరెక్టర్స్, స్టార్ బ్యానర్స్.. మంచి మంచి కథలు ఇలా అన్నింటిని ట్రై చేశాడు. కానీ ఫలితం మాత్రం దక్కలేదు.
గుడ్డిలో మెల్ల అన్నట్లు మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా తరువాత అయ్యగారి లక్ మారుతుంది అని అనుకున్నారు. కానీ, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో నటించి పూజా హెగ్డే లక్ మాత్రం పూర్తిగా మారిపోయింది. ఈ సినిమా తరువాత అమ్మడు నటించిన ఏ సినిమా కూడా హిట్ ను అందుకోలేదు. అయ్యగారికి హిట్ ఇచ్చి.. అమ్మాయి గారు మాత్రం ఐరెన్ లెగ్ అనే ముద్రను వేసుకుంది. సరే హిట్ సినిమా తరువాత పాన్ ఇండియా లెవెల్లో ఏజెంట్ ను అనౌన్స్ చేసిన అఖిల్.. ఈ సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొడతాడు అనుకుంటే.. కెరీర్ లో బిగెస్ట్ డిజాస్టర్ ను ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కాకుండా తెలుగులో మాత్రం రిలీజ్ అయ్యి ప్లాప్ ను మూటకట్టుకుంది. ఆ వివాదాలు.. ఈ వివాదాలు అంటూ ఓటీటీకి కూడా ఏజెంట్ నోచుకోలేకపోయింది.
ఇక దాదాపు రెండేళ్ల తరువాత ఏజెంట్ సోనీలివ్ లో ప్రత్యేక్షమయ్యింది. ఇక్కడ కు ఏజెంట్ అంతగా మెప్పించలేదు. ఇదంతా పక్కన పెడితే.. అయ్యగారికి లైఫ్ లో సక్సెస్ అవ్వాలంటే పెళ్లి చేస్తే సరిపోతుందేమో అనుకోని ఆ కార్యక్రమాన్ని కూడా నాగ్ ఫినిష్ చేశాడు. ఈమధ్యనే అఖిల్.. జైనబ్ ను పెళ్లి చేసుకొని ఒక ఇంటివాడయ్యాడు. ప్రస్తుతం అఖిల్.. లెనిన్ సినిమాతో బిజీగా ఉన్నాడు. మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమానుసితార ఎంటర్ టైన్మెంట్స్ తో కలిసి నాగార్జున నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో అఖిల్ సరసన శ్రీలీల నటిస్తోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
లెనిన్ సినిమా పరువు హత్యల నేపథ్యంలో తెరెక్కుతున్నదట. దీనికి తోడు ఒక ఆలయ సమస్యను కూడా యాడ్ చేసినట్లు సమాచారం. ఇక ఈ టైటిల్ టీజర్ లో అఖిల్ ఒక పవర్ ఫుల్ డైలాగ్ చెప్తాడు. “గతాన్ని తవ్వేటందుకు పోతా మా నాయన ఒక మాట చెప్పినాడు ” అని.. ఆఈ సినిమాలో అఖిల్ నాన్నగా నటిస్తుంది ఎవరో కాదు నాగార్జునే అని వార్తలు వినిపిస్తున్నాయి. సినిమాలో తండ్రి పాత్ర చాలా కీలకమని, ఎక్కువసేపు కనిపించకపోయినా.. ఆయన పాత్ర చుట్టూనే సినిమా నడుస్తుందని అంటున్నారు.
ఒక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో నాగ్ కనిపిస్తాడని, అఖిల్, నాగ్ మధ్య సీన్స్ కూడా ఉంటాయని చెప్పుకొస్తున్నారు. ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. అఖిల్ సినిమా సమయంలో కూడా నాగ్.. కొడుకు కోసం రిస్క్ చేసి సాంగ్ లో డ్యాన్స్ వేశాడు. ఇప్పుడు ఏకంగా క్యామియో రోల్ లోనే నటిస్తున్నాడు. ఈ తండ్రీకొడుకుల కాంబో అన్న ప్రతిసారి అభిమానుల గుండెల్లో గిత్తలు పరిగెడుతూ ఉంటాయి. మరి ఇంత రిస్క్ చేయడం వలన అయ్యగారు ఏమైనా హిట్ అందుకుంటారేమో చూడాలి.