Nayanatara : సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లలో అత్యంత ఎక్కువ క్రేజ్ ఉన్న హీరోయిన్ అంటే నయనతార పేరే ఎక్కువ వినిపిస్తుంది. స్టార్ ఇమేజ్ తో పాటు అందరికన్నా ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకొనే నయనతార. ప్రస్తుతం భారీ ప్రాజెక్టులో నటిస్తూ బిజీగా ఉంది. గ్లామర్ హీరోయిన్ పాత్రలే కాకుండా హీరోయిన్ ఓరియెంటెడ్ కథలతో పవర్‌ఫుల్‌గా లేడీ సూపర్ స్టార్‌గా ఆమె మారింది.. సౌత్ ఇండస్ట్రీ లేడీ బాస్ గా స్టార్ హీరోలు అందరూ సరసన నటించిన నయనతార జీవితంలో ఎన్నో కష్టాలు ఉన్నాయని తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. నయనతార జర్నీలో చెప్పుకోలేని కష్టాలు ఉన్నాయని నెట్టింట ఓ పెద్ద చర్చ జరుగుతుంది. నయనతార ఎదుర్కొన్న ఓ కీలక వివాదం గురించి హీరో నాగార్జున స్వయంగా వెల్లడించారు. నయన్ ఎదుర్కొన్న ఆ ఇబ్బందికరమైన ఆ సన్నివేశం ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
తమిళ స్టార్ హీరోయిన్ నయనతార అటు ప్రొఫెషనల్ లైఫ్ ను ఇటు పర్సనల్ లైఫ్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చారు. సినీ రంగంలో కూడా తనకు ఎదురైన సమస్యలను అధిగమించిన ఆమె.. వ్యక్తిగత జీవితంలో కూడా ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంటూ వచ్చారనేది అందరికి తెలిసిందే.. తన జీవితాన్ని తలక్రిందులు చేసింది ఎఫైర్లు, డేటింగులు.. గతంలో కొందరు స్టార్ హీరోలతో ఎఫైర్ పెట్టుకుందని వార్తలు వినిపించాయి. అంతేకాదు ఓ స్టార్ హీరోతో పెళ్లి పీటలు ఎక్కడ పోతుంది అని కూడా వినిపించింది. ఆ వార్తలే ఇబ్బందుల్లో పడేసాయి..
తమిళ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా బిజీగా ఉన్న టైంలోనే శింబుతో ప్రేమలో పడింది. వారిద్దరి అఫైర్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయి బోలెడంత రొమాన్స్ చేశారనేది వారి ఫోటోలు చెప్పకనే చెప్పాయి.. ఇక ఏమైందో తెలియదు గానీ సడన్గా వాళ్ళిద్దరూ బ్రేకప్ అయినట్లు సోషల్ మీడియాలో ఓ వార్త హాట్ టాపిక్ గా మారింది. శింబుతో బ్రేకప్ తర్వాత నయనతార పూర్తిగా కెరీర్‌పైనే దృష్టి పెట్టింది. బలమైన పాత్రలను ఎంచుకొంటూ తన కెరీర్‌ను చక్కదిద్దుకనే ప్రయత్నంలో పడ్డారు. ఒక వైపు వరుస సినిమాలో ఉన్నా కూడా మరోవైపు నయనతార హీరో ప్రభుదేవాతో ప్రేమలో పడింది.. ఈ ఇద్దరి ప్రేమాయణం పెళ్లి వరకు వెళ్ళింది. మరి కొద్ది రోజుల్లో పెళ్లి చేసుకుంటారనంగా సడన్గా బ్రేకప్ చెప్పేసుకొని ఎవరి దారి వారు చూసుకున్నారు. తర్వాత మళ్లీ నయనతార కెరియర్ పై ఫోకస్ పెట్టింది.
స్టార్ హీరోల సరసన అవకాశాలు అందుకుంటూ ఇండస్ట్రీ షేక్ అయ్యేలా రెమ్యూనిరేషన్ ని డిమాండ్ చేసింది. నయనతార బ్రేకప్ గురించి అక్కినేని నాగార్జున ఇటీవల ఇంటర్వ్యూలో బయట పెట్టిన విషయం తెలిసిందే. ఆయన మాట్లాడుతూ.. సినిమా షూట్ విదేశాల్లో జరిగింది. ఆ సమయంలో తన లవర్ నుంచి వచ్చిన వేధింపులను నేను స్వయంగా చూశాను. ఆ పాట షూటింగు టైమ్‌లో ఆమె చాలా టెన్షన్‌ను చూశాను. అయితే వాటిన్నింటిని పక్కన పెట్టి షాట్‌కు రెడీ అయ్యారు. షూటింగుకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆమె చాలా ప్రొఫెషనల్‌గా వ్యహరించారు.. ఆ టెన్షన్ నుంచి బయటపడడం నిజంగా గ్రేట్ అని చెప్పాలని నాగార్జున నయనతార విషయాలను బయటకి చెప్పాడు. ఇదిలా ఉండగా నయనతార లైఫ్ స్టోరీ గురించి నెట్ ఫ్లిక్స్ లో నయనతార: బియాండ్ ది ఫెయిరీటేల్ అనే టైటిల్‌తో ఆమె డాక్యుమెంటరీ రిలీజ్ అయింది.. ఒకవైపు వివాదాలు చుట్టుముట్టిన మరోవైపు ఆ డాక్యుమెంటరీకి మంచి స్పందన వచ్చింది. ఇక ప్రస్తుతం నయనతార వరుస సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ బిజీగా ఉంది.