BigTV English

OTT Movie : ఆత్మహత్య కేసును ఇన్వెస్టిగేషన్ చేసే ఆత్మ… మెంటలెక్కించే సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : ఆత్మహత్య కేసును ఇన్వెస్టిగేషన్ చేసే ఆత్మ… మెంటలెక్కించే సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : మలయాళం నుంచి వస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు థియేటర్లలో మంచి విజయాలు అందుకుంటూ, ఓటిటిలో కూడా దూసుకుపోతున్నాయి. రీసెంట్ గా వచ్చిన ఒక మలయాళం క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఓటిటిలో అదరగొడుతోంది. ఆ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


రెండు ఓటీటీలలో 

ఈ మలయాళం సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు ‘ఆనంద్ శ్రీ బాల‘ (Anand Sree Bala). 2024 వచ్చిన ఈ మూవీకి విష్ణు వినయ్ దర్శకత్వం వహించాడు. ఆత్మహత్యగా చూపించిన ఒక మర్డర్ కేసును, హత్యగా నిరూపించే క్రమంలో మూవీ స్టోరీ నడుస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video), మనోరమ మ్యాక్స్ (Manorama Max) లలో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీలోకి వెళితే

మెరిన్ అనే అమ్మాయి కనిపించకుండా పోవడంతో తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారు. ఆ మరుసటి రోజు ఒక అమ్మాయి నీటిలో శవమై తేలుతూ కనిపిస్తుంది. ఆ అమ్మాయి మెరిన్ అని గుర్తిస్తారు పోలీసులు. తల్లిదండ్రులు మెరిన్ ను చూసి బోరున విలపిస్తారు. ఆ తర్వాత పోలీసులు ఆ అమ్మాయిది ఆత్మహత్యగా చూపించి కేసు క్లోజ్ చేస్తారు. అయితే మెరిన్ తండ్రి తన కూతురిది హత్య అని కోర్టులో కేసు కూడా వేస్తాడు. మరోవైపు హీరోయిన్ క్రైమ్ రిపోర్టర్ గా ఒక ప్రోగ్రాం చేస్తూ ఉంటుంది. ఆ ప్రోగ్రాంలో మెరిన్ కేసును చూపించాలనుకుంటుంది. అలా చేస్తే ఛానల్ టిఆర్పి రేటింగ్ పెరుగుతుందని అనుకుంటుంది. ఈ క్రమంలోనే ఆనంద్ అనే వ్యక్తి హెల్ప్ తీసుకుంటుంది. నిజానికి వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటూ ఉంటారు. అయితే ఆనంద్ పోలీస్ జాబ్ వచ్చాక పెళ్లి చేసుకుంటానని ఆమెకు చెప్తాడు. క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో పోలీసులకు కూడా ఆనంద్ అప్పుడప్పుడు సాయం చేస్తుంటాడు. ఆనంద్ తల్లి ఒకప్పుడు పోలీస్ ఆఫీసర్ గా ఉంటుంది. ఒక పొలిటికల్ లీడర్ కి వ్యతిరేకంగా ఒక కేసు ఫైల్ చేయడంతో ఆమెను దారుణంగా చంపి ఉంటారు.

అప్పటినుంచి ఆనంద్ తన తల్లి పక్కనే ఉన్నట్టు ఊహించుకుంటూ ఉంటాడు. ఇప్పుడు మెరీన్ కేసులో నిజాలు వెలుగులోకి తేవాలనుకుంటాడు. మరోవైపు ఈ కేసును ఆత్మహత్యగా క్లోజ్ చేయాలని ఒక పోలీస్ ఆఫీసర్ శంకర్ ని నియమిస్తారు అధికారులు. శంకర్ కూడా చాలా తెలివైన పోలీస్ ఆఫీసర్. ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెడతాడు. ఆనంద్ కూడా ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. అయితే ఆనంద్ కి చనిపోయిన తన తల్లి ఆత్మ సాయం చేస్తూ ఉంటుంది. చివరికి ఈ కేసును ఆనంద్ వెలుగులోకి తెస్తాడా? పోలీస్ ఆఫీసర్ అవ్వాలనే తన కలని నెరవేర్చుకుంటాడా? పోలీసులు ఈ కేసును ఎలా ముగిస్తారు? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video), మనోరమ మ్యాక్స్ (Manorama Max) లలో స్ట్రీమింగ్ అవుతున్న ‘ఆనంద్ శ్రీ బాల’ (Anand Sri Bala) అనే ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.

Related News

OTT Movie : బాడీ బిల్డర్ తో ఆ పాడు పని… ఈ నలుగురు ఆడవాళ్ళూ అరాచకం మావా… సింగిల్ గా చూడాల్సిన మూవీ

OTT Movie : రియల్ కల్ట్ క్రైమ్‌… మతం పేరుతో మతిపోగోట్టే పనులు… మర్డర్ మిస్టరీతో ఊహించని టర్న్

OTT Movie : గ్యాంగ్ స్టర్ గా సిల్వెస్టర్ స్టాలోన్… అల్టిమేట్ యాక్షన్ సీన్స్… యాక్షన్ ప్రియులకు పంగడే

OTT Movie : సూపర్ హీరోల బిడ్డను బలికోరే బ్రహ్మ రాక్షసి… కడుపులో ఉండగానే బీభత్సం… క్లైమాక్స్ డోంట్ మిస్

Sundarakanda OTT: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన నారా రోహిత్‌ ‘సుందరకాండ’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే!

OTT Movie : పెంచిన పెదనాన్న ఇంటిని తగలబెట్టే లేడీ కిలాడీ… అమ్మాయి కాదు మావా ఆడపులి… పిచ్చెక్కించే ట్విస్టులు

OTT Movie : మరో వ్యక్తితో భర్త దగ్గర అడ్డంగా దొరికిపోయే భార్య… అతనిచ్చే ట్విస్టుకు దిమాక్ కరాబ్ మావా

OTT Movie : కంటికి కన్పించిన అమ్మాయిని వదలకుండా అదే పాడు పని… ఈ సైకో ఇంత కరువులో ఉన్నాడేంటి భయ్యా ?

Big Stories

×