BigTV English

OTT Movie : వేశ్యగా మారి ప్రాణాలు తీసే ఫ్యామిలీ లేడి… కేక పెట్టించే క్రైమ్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

OTT Movie : వేశ్యగా మారి ప్రాణాలు తీసే ఫ్యామిలీ లేడి… కేక పెట్టించే క్రైమ్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

OTT Movie : ఓటిటిలో రీసెంట్ గా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీలో ఒక అమ్మాయి వేశ్యగా మారి, కొంతమందిపై ఆమె ప్రతీకారం తీర్చుకుంటుంది. ఆమె ఎందుకు అలా మారాల్సి వచ్చిందనే విషయాలతో మూవీ ఇంట్రెస్టింగ్ గా నడుస్తుంది. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


ఈటీవీ విన్ (etv win) లో

ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ పేరు ‘వైఫ్ ఆఫ్‘ (wife off). ఈ మూవీకి భాను ఎరుబండి దర్శకత్వం వహించాడు. దివ్యశ్రీ, అభినవ్ మణికంఠ, నిఖిల్, సాయి శ్వేత, నటించారు. బొర్రా సాయిదీప్ రెడ్డి నిర్మించగా, ప్రణీత్ నంబూరి సంగీతం అందించారు. ఈ మూవీలో భర్తని బెదిరించి ప్రియురాలిని పొందాలనుకుంటాడు మాజీ బాయ్ ఫ్రెండ్. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ (etv win) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీలోకి వెళితే

హీరోయిన్ రాత్రిపూట ఒక రోడ్డు మీద నిలబడి, డబ్బుల కోసం ఆ పని చేయడానికి సిద్ధంగా ఉంటుంది. అయితే ఆమె డబ్బులు ఎక్కువగా డిమాండ్ చేయడంతో, చాలామంది అందుకు ఒప్పుకోరు. ఆమె ఎందుకు అలా చేస్తుందంటే, హీరోయిన్ తండ్రి హాస్పిటల్ లో చావు బతుకుల మధ్య ఉంటాడు. ఆపరేషన్ కి డబ్బులు తక్కువ పడతాయి. అందుకోసం ఈ పని చేయడానికి సిద్ధపడుతూ ఉంటుంది హీరోయిన్. ఈ క్రమంలో హీరోయిన్ మామయ్య మిగతా డబ్బులు సర్దుతాడు. అలా ఆపరేషన్ సక్సెస్ గా సాగుతుంది. ఆ తర్వాత అతడు తన కొడుకుని, హీరోయిన్ ను పెళ్లి చేసుకోవాల్సిందిగా కోరుతాడు. హీరోయిన్ కి కూడా తన బావ అంటే ఇస్టం ఉండటంతో, అలా వీళ్లిద్దరి పెళ్లి జరిగిపోతుంది. హీరోయిన్ ఇదివరకే అభి అనే వ్యక్తితో క్లోజ్ గా ఉంటుంది. తనకు జరిగిన విషయం అభి కి చెప్పి, తన బావని పెళ్లి చేసుకుంటుంది. అయితే పెళ్లయిన తర్వాత హీరోయిన్ కి భర్త చుక్కలు చూపిస్తాడు. తన ముందరే ఒక అమ్మాయిని తెచ్చుకుని గడుపుతూ ఉంటాడు.

భర్త తన ముందరే అలా చేస్తుంటే హీరోయిన్ చాలా బాధపడుతుంది. ఆ తర్వాత తను కూడా అభిని తీసుకుని గదిలోకి వెళ్తుంది. ఇది చూసిన భర్త కూడా కోపంతో ఊగిపోతూ ఉంటాడు. ఇలా జరుగుతున్న క్రమంలో ఒకరోజు భర్త విషం తాగి చనిపోయి ఉంటాడు. తన భర్త ఎందుకు చనిపోయాడు అనే విషయం తర్వాత తెలుసుకుంటుంది. హీరోయిన్ భర్తని అభి బెదిరించి, తనకు విడాకులు ఇవ్వాలని టార్చర్ చేస్తాడు. విడాకులు ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరిస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే అతనికి అభి బలవంతంగా విషం తాగిస్తాడు. ఇది తెలుసుకున్న హీరోయిన్ అభిని చంపాలనుకుంటుంది. చివరికి హీరోయిన్, అభిని చంపుతుందా? హీరోయిన్ పరిస్థితి చివరకు ఏమవుతుంది? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఓటిటి ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ (etv win) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘వైఫ్ ఆఫ్’ (wife off) అనే ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.

Related News

OTT Movies : ఈ వీకెండ్ ఓటీటీలోకి కొత్త సినిమాలు.. మిస్ అవ్వకుండా చూసేయ్యండి…

OTT Movie : కామాఠిపురంలో కాలుజారే ఒంటరి జీవితాలు … లాక్ డౌన్ మిగిల్చిన జ్ఞాపకాలు … ఒక్కో స్టోరీ ఒక్కో స్టైల్లో

OTT Movie : పక్కింటోడి చేతిలో పాపలు బలి … రివేంజ్ కోసం భూమి మీదకి వచ్చే ఆత్మ … గూస్ బంప్స్ తెప్పించే హారర్ సినిమా

OTT Movie : వందమంది అమ్మాయిలతో ఒక్కమగాడు … యవ్వారం అంతా చీకట్లోనే …

OTT Movie : ప్రెగ్నెంట్ లేడీపై ప్రేతాత్మ కన్ను … బ్రేస్లెట్ చుట్టూ తిరిగే స్టోరీ … చెమటలు పట్టించే సీన్స్

OTT Movie : భర్తపై భార్య అరాచకం … కూతురు అంతకు మించి … ఆత్మని కూడా వదలకుండా …

Big Stories

×