BigTV English

MahaKali Movie : ప్రశాంత్ వర్మ యూనివర్స్ లోకి బాలీవుడ్ స్టార్.. ఇదెక్కడి ప్లానింగ్ రా మామ

MahaKali Movie : ప్రశాంత్ వర్మ యూనివర్స్ లోకి బాలీవుడ్ స్టార్.. ఇదెక్కడి ప్లానింగ్ రా మామ

MahaKali Movie :హనుమాన్ ఫ్రేమ్ ప్రశాంత్ వర్మ తెలుగులో ఫిమేల్ సూపర్ హీరో మూవీని పరిచయం చేయనున్నాడు. ఫస్ట్ టైం ఫిమేల్ సూపర్ హీరో మూవీ గా మహాకాళి పేరుతో ఈ సినిమా ప్రేక్షకులకు పరిచయం చేశాడు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్సలో మూడో సినిమాగా రాబోతున్న మహాకాళి. ఈ సినిమా నుండి లేటెస్ట్ అప్డేట్ అనౌన్స్మెంట్ అయింది. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం..


ప్రశాంత్ వర్మ మూవీలో స్టార్ హీరో ..

మహాకాళి మూవీలో అక్షయ్ కన్నా జాయిన్ అవుతున్నట్టుగా ఎక్స్ వేదికగా మూవీ మేకర్స్ ప్రకటించారు. ఒక పవర్ఫుల్ రోల్ లో అక్షయ్ కన్నా ఈ సినిమాలో నటించబోతున్నట్లు సమాచారం. ప్రశాంత్ వర్మ సినిమా అంటేనే ఆడియన్స్ లో ఒక క్రేజ్ ఉంది. ఇప్పుడు మహాకాళి సినిమాలో సీనియర్ నటుడు బాలీవుడ్ స్టార్ అక్షయ్ కన్నా కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. అక్షయ్ కన్నా రీసెంట్ గా చావా సినిమా లో నటించి సూపర్ హిట్ మూవీని తన ఖాతాలో వేసుకున్నారు.ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది.


మహాకాళి న్యూ అప్డేట్..

హనుమాన్ మూవీ తర్వాత ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి రాబోతున్న సినిమా మహాకాళి. ఈ సినిమాలో కీలక పాత్రలో ఒక లేడీ హీరోయిన్ నటించబోతున్నట్లు సమాచారం.ఈ సినిమాకు ప్రశాంత్ వర్మ కథ స్క్రీన్ ప్లేను సమకూరుస్తున్నారు.2024 లో విడుదలైన హనుమాన్ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది తేజ సజ్జ అమృత అయ్యర్ , వరలక్ష్మీ ప్రధాన పాత్రలు పోషించిన హనుమాన్ సినిమా దర్శకుడిగా ప్రశాంత్ వర్మ కు మంచి సక్సెస్ అందించింది. 2003 డిసెంబర్ 19న ఈ సినిమాను రిలీజ్ చేసి, తెలుగులోనే కాక పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాని విడుదల చేసి మంచి విజయం అందుకున్నారు.ఇప్పుడు ప్రశాంత్ వర్మ సినిమా మహాకాళి పై భారీ అంచనాలే ఉన్నాయి, పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా రూపొందుతుంది ఓ స్టార్ హీరోయిన్ కూడా కనిపించబోతున్నట్లు సమాచారం.మహాకాళి పోస్టర్ లో పులి తలకు తల వుంచిన చిన్నారి కనిపిస్తుంది. ఆమె ఎవరైనా దానిపై ప్రశాంత్ వర్మ ఇంకా రివీల్ చేయలేదు. ప్రస్తుతం అక్షయ కన్నా ఒక కీలక పాత్ర పోషిస్తున్నట్లు ఎక్స్ వేదికగా అనౌన్స్మెంట్ చేశారు..ప్రశాంత్ వర్మ ప్లానింగ్ ని చూసి నెటిజన్స్ ఇదెక్కడి సూపర్ ప్లాన్ రా మామ అని అంటున్నారు.

ప్రశాంత్ వర్మ యూనివర్స్ లో ఫస్ట్ మూవీ గా హనుమాన్ రాగా సెకండ్ మూవీ గా బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ మూవీ ని కన్ఫామ్ చేశారు మూడో సినిమా మహాకాళి నాలుగో సినిమాగా డివివి దానయ్య తనయుడు హీరోగా నటిస్తున్న అధీర రాబోతున్నట్లు సమాచారం.ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమా సీక్వెల్ కూడా జై హనుమాన్ పేరుతో రూపొందుతుంది. శ్రీరాముడికి హనుమంతుడు ఇచ్చిన మాటేమిటి అనే ప్రశ్నకి సమాధానంగా జై హనుమాన్ సినిమా రూపొందుతుంది. హనుమాన్ సినిమా కి మించి వంద రెట్లు భారీ స్థాయిలో జై హనుమాన్ సినిమా ఉంటుందని ప్రశాంత్ వర్మ ఇప్పటికే ప్రకటించారు సీక్వెల్ తేజ హీరో కాదని సీక్వెల్ లోను అతడు హనుమంతుడు పాత్రలోనే కనిపిస్తాడని సమాచారం.జై హనుమాన్ మూవీ తరువాత ఈ సినిమా రానున్నది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×