HE TEAMS :గత కొన్ని రోజులుగా సినీ ఇండస్ట్రీలో ఉండే చాలామంది సెలబ్రిటీలు.. మహిళా సెలబ్రిటీల వల్ల ఇబ్బందులు పడుతున్నారు అంటూ కొంతమంది సెలబ్రిటీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా వారికి వచ్చిన గుర్తింపును తట్టుకోలేక కొంతమంది వీరిని అడ్డం పెట్టుకొని పగ ప్రతీకారాలు తీర్చుకుంటున్నారు అనే రేంజ్ లో కూడా కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు లైంగిక వేధింపుల దాడుల్లో ఇరుక్కొని ఇప్పటికీ ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే వారు నిజంగానే లైంగిక వేధింపులకు పాల్పడ్డారా లేక కావాలనే వీరిని ఇరికించడానికి మహిళలు ఇలాంటి వికృత చేష్టలకు పాల్పడుతున్నారా అనేది తెలియదు కానీ మగవారి నుండి ఆడవారిని కాదు ఇప్పుడు ఆడవాళ్ళ నుండి మగవారిని కాపాడండి అంటూ అడ్వకేట్లతో కలిసి రోడ్ ఎక్కారు బిగ్ బాస్ కంటెస్టెంట్ శేఖర్ భాష (Sekhar Basha).
హీ టీమ్స్ ఏర్పాటు చేయాలి – శేఖర్ భాష
ఆడవారు నిస్సహాయులు అని, వారికి ఏదైనా కష్టం వస్తే ఆదుకోవడానికి ప్రభుత్వాలు సిద్ధంగా ఉంటాయని, వారి కోసం షీ టీమ్స్ కూడా ఏర్పాటు చేశారని,అయితే ఇప్పుడు వీటన్నింటి అండ చూసుకొని ఆడవారు మగవారిని టార్గెట్ చేస్తూ.. వారిని చిత్రవధకు గురి చేస్తున్నారని.. దయచేసి షీ టీం కాదు హీ టీమ్స్ ఏర్పాటు చేసి మగవారిని కూడా కాపాడండి అంటూ రోడ్డెక్కారు. అనవసరంగా మగవారిని అనేక కేసుల్లో ఇరికిస్తున్నారు. అనేకమంది మహిళల చేతుల్లో మగవారు దారుణంగా మోసపోతున్నారు. మగవారికి జరుగుతున్న అన్యాయాలను అరికట్టేందుకు హీ టీమ్స్ ఏర్పాటు చేయాలి. మగవారికి న్యాయం చేకూర్చాలి అంటూ ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహించగా.. అందులో బిగ్ బాస్ కంటెస్టెంట్ శేఖర్ భాషతో పాటు పలువురు అడ్వకేట్లు కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి మగవారి వల్ల ఆడవారికి ఎంత హాని అయితే ఉందో ఆడవారి వల్ల మగవారికి కూడా అంతే హాని ఉందని దయచేసి మగవారిని కూడా కాపాడండి అంటూ శేఖర్ భాష నినాదాలు చేస్తున్నారు.
Alekhya Chitti Pickles: మీరెక్కడ తయారయ్యార్రా.. ఈ గొడవని కూడా ప్రమోషన్స్‌కి వాడుకుంటున్నారుగా..!
శేఖర్ భాష పై మండిపడుతున్న నెటిజన్స్..
అయితే ఈ విషయంపై తాజాగా శేఖర్ భాష పై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొన్నేమో బిగ్ బాస్ కి వెళ్ళకముందు లావణ్య – రాజ్ తరుణ్ కేసులో యాక్టివ్గా ఉంటూ తెగ పాపులర్ అయిపోయావు. ఇప్పుడేమో మగవాళ్ళు నష్టపోతున్నారు అందుకే వచ్చాను అంటూ చెబుతున్నావు. ఒక గుర్తింపు రావాలి.. అందుకే బిగ్ బాస్ కి వెళ్లొచ్చాడు. ఇప్పుడు గుర్తింపు కోసం మళ్లీ మగవాళ్ళ హక్కులు అంటూ రోడ్డు ఎక్కుతున్నాడు అంటూ శేఖర్ భాష పై నెటిజన్స్ మండిపడుతున్నారు. ఇన్ని రోజులు ఎక్కడ కనిపించని శేఖర్ భాష రాజ్ తరుణ్ – లావణ్య కేసులో బయటకు వచ్చి, ఇక అప్పటినుంచి ప్రతి విషయంపై కూడా స్పందిస్తూ ఇలా పాపులారిటీ దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారని నెటిజన్స్ మండిపడుతున్నారు. మరి దీనిపై శేఖర్ భాష ఎలాంటి వివరణ ఇస్తారో చూడాలి.
HE టీమ్స్ ఏర్పాటు చేయాలని ఇందిరా చౌక్ వద్ద ధర్నా
మగవారికి జరుగుతున్న అన్యాయాలను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
పాల్గొన్న బిగ్ బాస్ ఫేమ్ శేఖర్ బాషా, అడ్వకేట్లు
SHE టీమ్స్ తరహాలో HE టీమ్స్ ఏర్పాటు చేయాలని డిమాండ్ pic.twitter.com/KbJhRZjjBP
— BIG TV Breaking News (@bigtvtelugu) April 5, 2025