Rishabh Pant: ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} 2025లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు అప్ అండ్ డౌన్స్ తో కొనసాగుతోంది. తొలి మ్యాచ్ లో ఓడిపోయిన లక్నో జట్టు.. రెండవ మ్యాచ్ లో గెలుపొందింది. ఆ తర్వాత మూడవ మ్యాచ్ లో మళ్లీ పరాజయం పాలైంది. ఇక ముంబై ఇండియన్స్ తో జరిగిన నాలుగవ మ్యాచ్ లోని ఉత్కంఠ పోరులో 12 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్ లో 204 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది.
Also Read: Digvesh Singh Rathi: మరోసారి వివాదం… దిగ్వేశ్‌కు మళ్లీ ఫైన్.. ఈసారి ఏకంగా!
అయితే ముంబై ఇండియన్స్ విజయానికి చివరి ఓవర్లో 22 పరుగులు అవసరం అవ్వగా.. 9 పరుగులే వచ్చాయి. ఇందుకు కారణం లక్నో బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడమే. అయితే ఇప్పటివరకు లక్నో ఆడిన 4 మ్యాచ్లలో.. ఈ జట్టు రెండు మ్యాచ్లలో విజయం సాధించింది. కానీ ఆ జట్టు బ్యాటర్ గా, కెప్టెన్గా రిషబ్ పంత్ ప్రదర్శన పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ సీజన్ లో రిషబ్ పంత్ ఇప్పటివరకు భారీ ఇన్నింగ్స్ ఆడలేదు.
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర దక్కించుకున్నాడు రిషబ్ పంత్. 2025 మెగా వేలంలో రిషబ్ పంత్ ని రూ. 27 కోట్ల రికార్డు ప్రైస్ కి కొనుగోలు చేసింది లక్నో సూపర్ జెయింట్స్. అంత ధరపెట్టి కొన్నప్పటికీ కెప్టెన్సీ ఇవ్వకపోతే బాగుంటుందా..? అందుకే కెప్టెన్సీ బాధ్యతలను కూడా అప్పగించింది. కానీ ఈ సీజన్ లో రిషబ్ పంత్ అట్టర్ ప్లాప్ అవుతున్నాడు. బెన్ స్టోక్స్ ఒక్కరు తప్ప.. ఐపీఎల్ లో ఇప్పటివరకు అత్యధిక ధర తగ్గించుకున్న ఏ ప్లేయర్ కూడా ఆ సీజన్ లో బాగా ఆడినట్లు చరిత్రలో లేదు.
ఇప్పుడు ఆ లిస్టు లోకి పంత్ కూడా చేరిపోయాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్ లు ఆడిన రిషబ్ పంత్.. నాలుగు మ్యాచ్లలో చేసింది 19 పరుగులు మాత్రమే. ఇంకా ఈ లీగ్ లో 10 మ్యాచ్ లు మిగిలి ఉన్నాయి. ఈ పది మ్యాచ్లలో కలిపి 250 పరుగులు చేసినా.. రిషబ్ పంత్ చేసిన ప్రతి పది పరుగులకు కోటి రూపాయలు సమర్పించినట్లు అవుతుంది. ఈ క్రమంలో అందరూ రిషబ్ పంత్ ని దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు.
అయితే ముంబైలో జరిగిన మ్యాచ్ అనంతరం మానసిక ఒత్తిడికి గురయ్యానని కూడా చెప్పుకొచ్చాడు పంత్. ప్రైజ్ ట్యాగ్ తో పాటు జట్టు ఓనర్ సంజీవ్ గోయెంక ప్రతి మ్యాచ్ అనంతరం అతిగా ఇన్వాల్వ్ కావడం కూడా రిషబ్ పంత్ ని ఒత్తిడిలోకి నెడుతున్నట్లు క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. ఒత్తిడి కారణంగానే రిషబ్ పంత్ వరుసగా ఫెయిల్ అవుతున్నాడని అంటున్నారు. వరుసగా అతడి ఫెయిల్యూర్ కి కూడా ఇదే కారణమని అంటున్నారు. ఇకనుండి జరగబోయే మ్యాచ్ లలోనైనా ఒత్తిడిని అధిగమించి రిషబ్ పంత్ నుండి భారీ ఇన్నింగ్స్ ని చూడవచ్చా..? అంటే వెయిట్ చేయాల్సిందే.