Akshay Kumar :ప్రముఖ బాలీవుడ్ స్టార్ నటుడు అక్షయ్ కుమార్ (Akshay Kumar)గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. బాలీవుడ్ లో స్టార్ స్టేటస్ ని సొంతం చేసుకున్న ఈయన ఇప్పుడు మంచు విష్ణు (Manchu Vishnu)ప్రెస్టేజియస్ మూవీ అయిన కన్నప్ప (Kannappa)ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి ఈయన పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా కాస్త విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా అక్షయ్ కుమార్ కి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 3 నెలల్లోనే రెండవసారి కోట్లు విలువ చేసే ఆస్తిని అమ్మేసినట్లు సమాచారం.
రూ.2కోట్ల లాభం.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ముంబైలోని బోరివలి ఈస్ట్ ఏరియాలో ఉన్న తన లగ్జరీ అపార్ట్మెంట్ ను కోట్ల రూపాయలకు విక్రయించారు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆయన తన అపార్ట్మెంట్ ను అమ్మేయడం జరిగింది. ఈ అపార్ట్మెంట్ ‘స్కై సిటీ’ బిల్డింగ్ లో ఉంది. దీనిని ఒబెరాయ్ రియాల్టీ నిర్మించింది. అంతే కాదు 25 ఎకరాలలో ఈ సొసైటీ విస్తరించి ఉంది. అందులో అక్షయ్ కుమార్ యొక్క లగ్జరీ అపార్ట్మెంట్ 1073 చదరపు అడుగులు. అంతేకాదు ఈ అపార్ట్మెంట్లో రెండు కార్ పార్కింగ్ సౌకర్యాలు కూడా ఉన్నాయి. ఇకపోతే 2017 లో ఈ అపార్ట్మెంట్ ను రూ.2.37 కోట్లకు కొనుగోలు చేసిన అక్షయ్ కుమార్.. ఇప్పుడు అనగా 2025లో దానిని రూ.4.35 కోట్లకు విక్రయించారు. మొత్తానికైతే 8 ఏళ్లలో రూ.2కోట్ల లాభం వచ్చిందని చెప్పవచ్చు. ఇకపోతే ఈ లావాదేవీలకి అక్షయ్ కుమార్ రూ.26.1 లక్షల స్టాంపు డ్యూటీ, రూ.30, 000 రిజిస్ట్రేషన్ ఫీజు కూడా చెల్లించారట. ఇకపోతే ఈ విషయాలపై అక్షయ్ కుమార్ ఇంకా స్పందించలేదు.
మొత్తం రూ.4 కోట్లు లాభం..
అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. 2025 జనవరిలో ఇదే సొసైటీలో ఉన్న తన మరో అపార్ట్మెంట్ ను కూడా ఆయన విక్రయించారు. 2017లో ఆ ఫ్లాట్ ను రూ.2.38 కోట్లకు కొనుగోలు చేయగా.. ఈ ఏడాది జనవరిలో దానిని రూ.4.25 కోట్లకు అమ్మేశారు. ఇక దీన్ని బట్టి చూస్తే 2017లో కొనుగోలు చేసిన ఈ రెండు అపార్ట్మెంట్ల ద్వారా సుమారుగా రూ.4కోట్లకు పైగా లాభం వచ్చిందని చెప్పవచ్చు. ఏది ఏమైనా అలా కొనుగోలు చేసి ఇలా ఎనిమిదేళ్లలో రూ.4కోట్ల లాభం అంటే మామూలు విషయమా అంటూ నెటిజన్స్ సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక లాభం సంగతి అటు ఉంచితే ఈయనకు ఏం కష్టం వచ్చిందని ఈ అపార్ట్మెంట్స్ ను అమ్మేశారు అంటూ ఆరా తీస్తున్నారు.
అక్షయ్ కుమార్ సినిమాలు..
ఇక ఈ ఏడాది జనవరిలో ‘స్కై ఫోర్స్’అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. 2025 జనవరి 24న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం ద్వారా వీర్ పహారియా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఇక ఈ చిత్రంలో నిమ్రత్ కౌర్, సారా అలీ ఖాన్ ,శరత్ ఖేల్కర్ వంటి వారు కీలక పాత్రలు పోషించారు. ఇక ఇప్పుడు ఈయన నటించిన ‘హౌస్ ఫుల్ 5’, ‘భూత్ బంగ్లా’, ‘జాలి ఎల్.ఎల్.బి 3’ వంటి చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.