ICC tournaments Till 2031: ప్రపంచ క్రికెట్ ని శాసిస్తున్న టీమిండియా మరో చరిత్ర సృష్టించింది. వన్డే క్రికెట్ లో మినీ విశ్వ కప్పుగా ప్రఖ్యాతిగాంచిన ఛాంపియన్స్ ట్రోఫీని దక్కించుకుంది. ఫైనల్ లో న్యూజిలాండ్ ని ఓడించి.. మూడవసారి ఛాంపియన్స్ ట్రోపీని ముద్దాడింది. పొట్టి ఫార్మాట్ లో ప్రపంచ కప్ ని గెలిచి ఏడాది కూడా తిరగకముందే మరో ప్రతిష్టాత్మక ఈవెంట్ లో విజేతగా నిలిచింది.
Also Read: Champions Trophy 2025: ఒక్క టీమిండియా వెళ్లకుంటేనే… పాక్ కు ఇన్ని కోట్ల నష్టమా..?
పాకిస్తాన్ ఆతిధ్యం ఇచ్చిన ఈ టోర్నీలో భారత జట్టు తటస్థ వేదిక దుబాయిలో తన మ్యాచ్లను ఆడింది. ఆడిన ఒక్క మ్యాచ్ లో కూడా ఓటమి ఎరుగకుండా అజయంగా మ్యాచ్ లను ముగించింది. 12 సంవత్సరాల తర్వాత భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. ఇక ప్రస్తుతం అందరి చూపు రానున్న ఐసీసీ టోర్నమెంట్ల పై పడింది. దీంతో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ {ఐసీసీ} 2025 నుండి 2031 వరకు ఆసక్తికరమైన టోర్నమెంట్ల షెడ్యూల్ ని విడుదల చేసింది.
2026 లో జరగబోయే టి-20 ప్రపంచ కప్ లో మొత్తం 12 జట్లు పాల్గొనబోతున్నాయి. ఇక 2027, 2031 సంవత్సరాల లో జరిగే వన్డే ప్రపంచ కప్ లో 14 జట్లు పాల్గొనబోతున్నాయి. 2026 టీ-20 ప్రపంచ కప్ లో అతిథ్య జట్ల హోదాలో భారత్, శ్రీలంకతో పాటు రన్నరప్ హోదాలో సౌత్ ఆఫ్రికా కి నేరుగా అవకాశం దక్కింది. 2024 టీ-20 ప్రపంచ కప్ లో సూపర్ 8 కి అర్హత సాధించిన ఆఫ్గనిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, బంగ్లాదేశ్, వెస్టిండీస్, అమెరికా వచ్చే ప్రపంచ కప్ కి నేరుగా క్వాలిఫై అయ్యాయి.
అయితే ఈసారి సూపర్ 8 కి చేరుకోలేనిప్పటికీ జూన్ 30 నాటికి టి-20ర్యాంకింగ్స్ ఆధారంగా న్యూజిలాండ్, పాకిస్తాన్, ఐర్లాండ్ ఈ టి-20 వరల్డ్ కప్ కి అర్హత సాధించాయి. మరో 8 జట్ల ఎంపిక కోసం ప్రపంచవ్యాప్తంగా క్వాలిఫైయింగ్ టోర్నీలు జరుగుతాయి. 2026, 2028, 2030 సంవత్సరాలలో జరిగే టి-20 ప్రపంచ కప్ లో 20 జట్లు తలపడతాయి. ఇక 2027 అక్టోబర్ – నవంబర్ నెలలలో జరిగే వన్డే ప్రపంచ కప్ కి దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా ఈ టోర్నీకి ఆతిథ్యం ఇస్తాయి. ఆ తర్వాత 2031 అక్టోబర్ – నవంబర్ నెలలో జరిగే వన్డే ప్రపంచ కప్ కి భారత్, బంగ్లాదేశ్ ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఈ టోర్నీలో 10 జట్లు పాల్గొంటాయి.
Also Read: Mayank Yadav Injury: లక్నోకు ఊహించని షాక్.. స్టార్ ప్లేయర్ ఐపీఎల్ కు దూరం ?
ఇక 2025 లో ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ కి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. 2013 తర్వాత ఈ టోర్నమెంట్ ని భారత నిర్వహించడం ఇదే తొలిసారి. అలాగే ఇప్పటివరకు మహిళల వన్డే ప్రపంచ కప్ కి భారత్ ఆతిథ్యం ఇవ్వడం ఇది 5వసారి. 2025 మహిళల వన్డే ప్రపంచ కప్ లో మొత్తం 8 జట్లు పాల్గొంటాయి. ఇందులో మొత్తం 31 మ్యాచ్లు జరుగుతాయి.