E-Paper
Advertisement

Akshay Kumar in Kannappa: ఇలా కాదు కానీ.. సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని ఒకేసారి దించు విష్ణు మావా..!

Akshay Kumar in Kannappa: ఇలా కాదు కానీ.. సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని ఒకేసారి దించు విష్ణు మావా..!
Advertisement
Akshay kumar in kannappa Movie
Akshay kumar in kannappa Movie

Manchu Vishnu in Kannappa Movie: మంచు వారసుడు మంచు విష్ణు.. ప్రస్తుతం ఒక భారీ హిట్ కోసం కష్టపడుతున్న విషయం తెల్సిందే. ఎన్ని మంచి కథలతో వస్తున్న వారి మీద ఉన్న నెగెటివ్ ట్రోల్స్ వలన ప్రేక్షకులు సినిమాను ప్లాప్ చేస్తున్నారు. మంచి విష్ణు నటించిన జిన్నా సినిమా కూడా అలా ప్లాప్ అయ్యిందే. ఇక ఇప్పుడు కన్నప్ప సినిమాతో ఎలాగైనా ఒక మంచి హిట్ అందుకోవాలని బాగా కష్టపడుతున్నాడు. భక్త కన్నప్ప పేరుతో విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ ను మొదలుపెట్టిన విషయం తెల్సిందే.

బాలీవుడ్ లో స్టార్ ప్లస్ మహాభారతం కు దర్శకత్వం వహించిన ముకేశ్ సింగ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ చిత్రం కోసం విష్ణు.. అన్ని ఇండస్ట్రీలను ఏకం చేస్తున్నాడు. టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, కన్నడ.. ఇలా ప్రతి ఇండస్ట్రీ నుంచి ఒక్కో స్టార్ హీరోను ఇందులో దింపుతున్నాడు. ఇప్పటికే తెలుగు నుంచి ప్రభాస్, తమిళ్ నుంచి శరత్ కుమార్, మలయాళం నుంచి మోహన్ లాల్, కన్నడ నుంచి శివరాజ్ కుమార్.. ఇలా ఏ ఒక్కరిని వదలకుండా మంచు విష్ణు తన సినిమాలో నటించేలా చేస్తున్నాడు. తాజాగా బాలీవుడ్ నుంచి కూడా మరో స్టార్ ను దింపుతున్నాడు.

Advertisement

Also Read: NTR: ఓవర్ గా చెప్పడం లేదు.. దేవర కు మీరందరూ కాలర్ ఎగరేస్తారు

బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ సైతం కన్నప్పలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. మైథలాజికల్ సినిమా కావడంతో పాత్రలకు ఎలాంటి కొదువ లేదు. దీంతో ఉన్న పాత్రలన్నింటిని స్టార్ క్యాస్టింగ్ తో నింపేస్తున్నాడు విష్ణు. ఇక అక్షయ్ కుమార్ కూడా ఈ పాత్రకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే అక్షయ్ కుమార్ పాత్రకు సంబంధించిన షూట్ మొదలుకానుంది. ఈ వార్త వినడంతోనే ప్రేక్షకులు.. ఇలా కాదు కానీ, సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని ఒకేసారి దించు విష్ణు మావా.. అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఇంతమంది స్టార్ క్యాస్టింగ్ తో మంచు విష్ణు ఎలాంటి రికార్డులు బద్దలు కొడతాడో చూడాలి.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×