BigTV English

NTR Speech: ఓవర్ గా చెప్పడం లేదు.. దేవర కు మీరందరూ కాలర్ ఎగరేస్తారు..!

NTR Speech: ఓవర్ గా చెప్పడం లేదు.. దేవర కు మీరందరూ కాలర్ ఎగరేస్తారు..!
NTR Speech in Dillu Square Success meet
NTR Speech in Dillu Square Success meet

NTR Speech in ‘Dillu Square’ Success Meet: స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం టిల్లు స్క్వేర్. సితార ఎంటర్టైన్మెంట్ , ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. మార్చి 29న రిలీజ్ అయిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకొని ముందుకు సాగుతుంది. వారం రోజుల్లోనే ఈ సినిమా వందకోట్ల క్లబ్ లో చేరింది. ఇక ఇంత పెద్ద సక్సెస్ అందుకోవడంతో మేకర్స్.. గ్రాండ్ సక్సెస్ మీట్ ను నిర్వహించారు. ఈ సక్సె మీట్ కు మ్యాన్ ఆఫ్ ది మాసెస్ ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా విచ్చేశాడు.


ఇక ఈ సక్సెస్ మీట్ లో ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ” సిద్దు సినిమాలు చాలా చూశాను కానీ ఎప్పుడూ పర్సనల్ గా ఇంట్రాక్ట్ అవ్వలేదు. ఈ పాండమిక్ తర్వాతే సిద్దుతో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. ఇండస్ట్రీలో సినిమా అంటే ఒక పిచ్చి ఉండే టెక్నీషియన్స్ చాలా తక్కువ మంది ఉంటారు. అందులో మొట్టమొదటి వరుసలో ఉండాల్సింది సిద్ధూ. తనకి సినిమా తప్ప వేరే ఏమీ తెలియదు. డీజే టిల్లు అనే క్యారెక్టర్ ని చూసి.. సిద్దు పర్సనల్ లైఫ్ లో కూడా ఇలాగే ఉంటాడు అని.. కానీ సిద్దు అలా ఉండడు. తనకు ఎంతసేపు సినిమా, తను చేస్తున్నటువంటి క్యారెక్టర్, తను పార్టిసిపేట్ చేసినటువంటి కథ, ఈ కథకు నేను న్యాయం చేస్తున్నానా లేదా అనే తపన. చాలా తక్కువ మంది ఆర్టిస్టులలో లేదా టెక్నీషియన్స్ లో ఈ తపనను చూస్తాం. సిద్దు.. డీజే టిల్లు అనే మూవీతో కేవలం సక్సెస్ ని కాదు.. కానీ, మన జీవితంలో కలకాలం మిగిలిపోయే ఒక క్యారెక్టర్ మనకి ఇచ్చాడు.

చాలా సార్లు అనుకునేవాడిని, నేను చిన్నప్పుడు టామ్ అండ్ జెర్రీ కార్టూన్స్ బాగా చూసేవాడిని. పొపాయ్, హిమాన్ అనే కార్టూన్స్ చూసేవాడిని. ఇలాంటి క్యారెక్టర్లు మన జీవితంలో కేవలం సినిమాల రూపంలో మిగిలిపోతే ఎంత బాగుంటుందో అనుకునేవాడిని, అలాగే ఈరోజు టిల్లు కేవలం ఒక డీజే కాదు. టిల్లు కేవలం ఒక సిద్దు జొన్నలగడ్డ కాదు, టిల్లు మన ఇంట్లో మన చుట్టూ తిరిగే మనిషి అయిపోయాడు. హాట్సాఫ్ సిద్దు జొన్నలగడ్డ, హ్యాట్సాఫ్ టు డిజే టిల్లు టీమ్, అండ్ టిల్లు స్క్వేర్ టీమ్ . మన ఇంట్లో ఉండిపోయి మన చుట్టూ తిరుగుతూ ఉండే ఒక క్యారెక్టర్ ని క్రియేట్ చేసినందుకు చిత్రబృందానికి హాట్సాఫ్.


Also Read: Prabhas: మరో బాహుబలి.. సిద్ధంగా ఉండండి డార్లింగ్స్.. ఈసారి ఊచకోతనే

నవ్వించడం అనేది ఒక వరం.. నవ్వకపోవడం ఒక శాపం. బేసిగ్గా నేను నవ్వడం మొదలు పెడితే దాన్ని ఆపుకోవడం చాలా కష్టం. నేను అదుర్స్ సినిమా చేస్తున్నప్పుడు వినాయక్ చాలా కష్టపడేవాడు. ఎందుకంటే బ్రహ్మానందం గారు డైలాగ్ చెప్పనవసరం లేదు.. ఆయనను చూస్తేనే నవ్వేశాడు. అరవింద సమేత షూటింగ్ జరుగుతున్నప్పుడు ఇదే త్రివిక్రమ్ గారు కూడా ఫేస్ చేశారు. అలాంటిది నేనింకా నవ్వలేను బాబోయ్ అనే అంతలా నవ్వించాడు సిద్దు. నన్నే కాదు చాలామందిని నవ్వించాడు. ఆ బ్లెస్సింగ్స్ అంతా సిద్దుకి దక్కాలి. ఇంకా అద్భుతమైన చిత్రాలు.. ఇంకా చాలా అద్భుతమైన క్యారెక్టర్ లని క్రియేట్ చేయాలి. మనందరికీ అందించాలనిదేవుడిని మనసారా కోరుకుంటున్నాను.

దేవర సినిమాలో ఒక డైలాగ్ ఉంది. దేవరలో కూడా ఇంచుమించు భయం గురించే ఎక్కువ శాతం ఉంటుంది. కలగనే ధైర్యం ఉండాలి.. ఆ ధైర్యాన్ని, ఆ కలని సార్ధకం చేసుకోవడానికి..అంటే నిజం చేయడానికి భయం ఉండాలి.. ఈ చిత్రబృందం మొత్తం ఎంతో భయంతో, శ్రద్ధతో ఈ సినిమా మీకు చూపించాలని కష్టపడింది కాబట్టి ఈరోజు ఇంత సక్సెస్ ను అందుకుంది. సిద్దు.. జీవితంలో ఒకటే గుర్తుంచుకో.. కష్టపడాలి అంతే. కష్టానికి కొలమానం లేదు.. నా కష్టం నీ కష్టం అని లేదు.. అందరి కష్టం ఒకటే. నేను చాలాసార్లు చెప్పాను.

Also Read: Samantha: భర్తను మరిచినా.. మరిదిని మరువని వదిన.. ఏం చేసిందంటే.. ?

విశ్వక్, సిద్దు అంటే నాకు నమ్మకం ఉంది. రేపు ఇండస్ట్రీ ముందుకు వెళ్ళడానికి వీళ్లు చాలా హెల్ప్ అవుతారు. ఇండస్ట్రీకి ఇలాంటి డేర్ డెవిల్స్ కావాలి. ఇక ఇందులో నటించిన హీరోయిన్స్.. వారు లేకపోతే ఈ సినిమానే లేదు. ఇక దేవర గురించి.. కొంచెం ఓవర్ గా లేదు అంటే ఒక విషయం చెప్తాను.. దేవర..రిలీజ్ లేట్ అయినా సరే రేపు మీరందరూ కాలర్ ఎగరేసేలా ఉంటుంది. దానికోసమే కష్టపడుతున్నాం” అంటూ ముగించాడు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×