E-Paper
Advertisement

Alanaati Ramachandrudu Trailer: ఆకట్టుకుంటున్న ‘అలనాటి రామచంద్రుడు’ ట్రైలర్‌..మీరూ చూసేయండి!

Alanaati Ramachandrudu Trailer: ఆకట్టుకుంటున్న ‘అలనాటి రామచంద్రుడు’ ట్రైలర్‌..మీరూ చూసేయండి!
Advertisement

Alanaati Ramachandrudu Trailer: టాలీవుడ్ యంగ్ నటుడు కృష్ణవంశీ, మోక్ష లీడ్ రోల్స్ లో నటిస్తున్న లవ్ ఎంటర్ టైనర్ ‘అలనాటి రామచంద్రుడు’. ఈ మూవీకి చిలుకూరి ఆకాష్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా.. హైనివా క్రియేష్స్ బ్యానర్ పై హైమావతి, శ్రీరామ్ జడపోలు నిర్మిస్తున్నారు. ఈ మూవీ ప్రమోషనల్ కంటెంట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా, మేకర్స్ థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేశారు.

కృష్ణ వంశీ హీరోగా పరిచయం అవుతున్న సరికొత్త ప్రేమ కథా చిత్రం ‘అలనాటి రామచంద్రుడు’. అయితే ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా, టీజర్ లాంఛ్ వేడుకకు ప్రముఖ నిర్మాత దిల్ రాజు హాజరై విడుదల చేశారు. ఈ టీజర్ ప్రస్తుతం ఆకట్టుకుంటోంది.

Advertisement

‘ఇది ఒక అమ్మాయిని గాఢంగా ప్రేమించే నిజాయితీ గల యువకుడి కథగా తెలుస్తోంది. ఆ యువకుడు ఆమెతో గడిపిన ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేస్తాడు. దీంతో చుట్టుపక్కల ఉన్న సన్నిహితులు ఎలాగైనా ఆమెకు నీ ప్రేమ విషయం చెప్పాలని బలవంతం చేస్తారు. అయితే తన ప్రేమ విషయం చెప్పాలని అనుకునలోపే వీరిద్దరి మధ్య అనుకోని సంఘటనలు జరుగుతాయి. ఇలా కథలోని డ్రామా, ఎమోషనల్ రిచ్ నెస్ ని ట్రైలర్ అద్భుతంగా క్యాప్చర్ చేశారు.

అయితే ఆ యువకుడు ప్రేమిస్తున్నట్లు ఆమెకు చెప్పాడా? ఈ ఇద్దరు ఎలా కలిశారు అనేది సినిమాలో చూడాల్సిందే. ఆగస్టు 2న విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ ట్రైలర్ అర్థవంతంగా రాసిన డైలాగ్‌లు, హత్తుకునే సన్నివేశాలతో మంచి రొమాంటిక్ డ్రామాతో కంప్లీట్ లవ్ స్టోరీని చూడబోతున్నామనే భరోసా ఇచ్చింది.

Advertisement

Also Read: క్షమించండి.. ‘యానిమల్‌’లో ఆ సీన్ చేసినందుకు.. : రణబీర్ కపూర్

కృష్ణ వంశీ డెబ్యుటెంట్ లా కాకుండా మంచి అనుభవం ఉన్న నటుడిలా ఆకట్టుకునే పెర్ఫార్మెన్స్ తో అలరించాడు. ట్రైలర్ లో బ్రహ్మాజీ, సుధ, ప్రమోధిని, వెంకటేష్ కాకమును, చైతన్య గరికిపాటి వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించారు. సంగీత దర్శకుడు శశాంక్ టి తన లవ్లీ స్కోర్ తో సినిమాటోగ్రాఫర్ ప్రేమ్ సాగర్ క్యాప్చర్ చేసిన విజువల్స్ ని ఎలివేట్ చేశాడు.

 

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×