E-Paper
Advertisement

Telangana:తెలంగాణకు కొత్త గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ నియామకం

Telangana:తెలంగాణకు కొత్త గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ నియామకం
Advertisement

Jishnudev varma appointed as Telangana New Governor: తెలంగాణకు పూర్తి స్థాయి గవర్నర్ నియామకం జరిగింది. ఇప్పటిదాకా ఇన్ ఛార్జీ గవర్నర్ గా సీపీ రాధాకృష్ణన్ స్థానంలో జిష్ణుదేవ్ వర్మ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి ముర్ము శనివారం అర్థరాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. జిష్ణుదేవ్ వర్మ గతంలో త్రిపుర రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. త్రిపుర రాష్ట్రంలో జన్మించిన జిష్ణుదేవ్ వర్మ 2018 సంవత్సరం నుంచి 2023 సంవత్సరం దాకా త్రిపుర ఉప ముఖ్యమంత్రిగా చేశారు. 1990 సంవత్సరం నుంచి బీజేపీ పార్టీ కార్యకలాపాలలో చురుకుగా ఉంటూ వచ్చారు.

బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడిగా..

Advertisement

కొంత కాలం ఇండియన్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా సేవలు అందించారు. కాగా సీపీ రాధాకృష్ణన్ ను కేంద్రం మహారాష్ట్ర గవర్నర్ గా బదిలీ చేసింది. ఛత్తీస్ ఘడ్ రాష్ట్రానికి గవర్నర్ గా రామన్ దేకా, అస్సాం, మణిపూర్ లకు గవర్నర్ గా లక్ష్మణ్ ప్రసాద్, సిక్కిం రాష్ట్రానికి ఓం ప్రకాష్ మాథుర్, రాజస్థాన్ రాష్ట్రానికి గవర్నర్ గా హరిభౌ కిషన్ రావు, పంజాబ్, ఛండీగడ్ ప్రాంతాలకు గవర్నర్ గా ఎల్జీ గులాబ్ చంద్ లు నూతన గవర్నర్ లుకా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు.

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×