BigTV English

Alia Bhatt Dress Cost: హీరామండీ ప్రీమియర్.. అలియా ధరించిన డ్రెస్ రేటు తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే..?

Alia Bhatt Dress Cost: హీరామండీ ప్రీమియర్.. అలియా ధరించిన డ్రెస్ రేటు తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే..?

Alia Bhatt Wears ₹ 1-32 Lakh Sharara set for Heeramandi Premiere: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ ప్రస్తుతం హీరోయిన్ గా, నిర్మాతగా వరుస సినిమాలతో బిజీగా మారింది.ఇంకోపక్క తల్లిగా కూడా తన బాధ్యతలను నిర్వర్తిస్తుంది. అలియా ఫ్యాషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సింపుల్ గా మేకప్ లేకుండా మీడియా ముందుకు వచ్చినా.. స్టార్ సెలబ్రిటీ హోదాలో రిచ్ లుక్ లో వచ్చినా ఆమె సెంట్రాఫ్ ఎట్రాక్షన్. ప్రస్తుతం హీరామండీ సినిమా ప్రీమియర్ షో ఈవెంట్ లో కూడా అందరి అటెన్షన్ ను గ్రాబ్ చేసింది అలియా.


స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితి రావ్ హైదరీ, రిచా చద్దా, సంజీదా షేక్ మరియు షర్మిన్ సెగల్ లాంటి స్టార్ బ్యూటీస్ నటించిన సిరీస్ హీరామండీ. నెట్ ఫ్లిక్స్ ఈ సిరీస్ ను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. ఇప్పటికే ఈ సిరీస్ నుంచి రిలీజైన ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సిరీస్ మే 1 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈలోపు బాలీవుడ్ ప్రముఖులకు హీరామండీ ప్రీమియర్స్ వేసి చూపించారు. రేఖ, నీతూ కపూర్, సోనీ రజ్దాన్ లాంటి వారితో పాటు అలియా కూడా ఈ ఈవెంట్ కు విచ్చేసింది.

ఇక ఎంతమంది స్టార్లు ఉన్నా అందరి చూపు అలియా వేసుకున్న డ్రెస్ మీదనే ఉంది. అలియా ఎంతో హుందాగా వచ్చింది. సీమా గుజ్రాల్ డిజైన్ చేసిన పింక్ పెర్ల్ షరారా సెట్‌ ధరించింది. దాని మీద తుళ్లు దుపట్టా ఆమె అందాన్ని ఇంకా పెంచింది. ఇక డ్రెస్ చాలా గ్రాండ్ గా ఉండడంతో ఎక్కువ ఆభరణాలను ధరించకుండా ఎంతో సింపుల్ గా కనిపించింది. ఇక ఈ డ్రెస్ ధర అక్షరాలా.. రూ. 1.32 లక్షలు అని సమాచారం. దీంతో అలియా డ్రెస్ ధర తెలిసి అందరూ నోర్లు వెళ్లబెడుతున్నారు. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో అలియా గంగుభాయి కతీయవాడి సినిమా చేసిన విషయం తెల్సిందే. ప్రస్తుతం అలియా ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.


Also Read: Kalki 2898 Ad: ‘కల్కి 2898’ లో విజయ్ దేవరకొండ కన్ఫర్మ్.. సాక్ష్యం ఇదిగో..

https://twitter.com/hassankadiri111/status/1783394692690026500

Tags

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×