BigTV English

Peddi Glimpse: విజువల్స్ ని రెహమాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బిస్కెట్ చేసిందా?

Peddi Glimpse: విజువల్స్ ని రెహమాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బిస్కెట్ చేసిందా?

Peddi Glimpse: రామ్ చరణ్ – బుచ్చిబాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘పెద్ది’ సినిమా పాన్-ఇండియా రేంజ్‌లో భారీ అంచనాలు సృష్టించింది. టైటిల్ అనౌన్స్‌మెంట్‌తోనే సినిమా మీద అటెన్షన్ పెరిగిపోయింది. ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన రోజునుంచే, బజ్ జనరేట్ చేసిన ఈ మూవీ గ్లింప్స్ తో ఆడియన్స్ అంచనాలని ఆకాశం తాకేలా చేయడానికి బుచ్చిబాబు అండ్ టీమ్ రెడీ అయ్యారు. మెగా ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పెద్ది గ్లింప్స్… శ్రీరామనవమి రోజున 20 సెకన్ల నిడివితో విడుదల కానుంది. ఇదే సినిమా మీద మాస్ మరియు క్లాస్ ఆడియన్స్‌లో బజ్ క్రియేట్ చేయబోతోంది. అయితే, ఇప్పుడు అందరి దృష్టి విజువల్స్ కంటే మ్యూజిక్ పైనే ఉంది. పెద్ది సినిమాకి మ్యూజిక్ అందిస్తున్న ఏఆర్ రహ్మాన్ గ్లింప్స్ కోసం ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అసలు అంతవరకు పండిందా? లేక అంచనాలను మిస్ అయ్యిందా? అనే చర్చ మొదలైంది.


ఏఆర్ రహ్మాన్ నుంచి మళ్లీ మ్యాజిక్ మిస్ అవుతుందా?

ఏఆర్ రహ్మాన్ అంటేనే లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్. 90s నుంచి నిన్న మొన్నటి వరకూ ఆయన వావ్ అనిపించే ఆల్బమ్స్ ఇచ్చారు. కానీ, గత కొన్నేళ్లుగా రహ్మాన్ మ్యూజిక్ మీద మిక్స్‌డ్ స్పందనలు వస్తున్నాయి. చావా  సినిమాలోనూ రహ్మాన్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పెద్దగా ఇంప్రెస్ చేయలేకపోయింది.


అలాగే, గత కొంతకాలంగా ఆయన ఆల్బమ్స్ కూడా అంతగా ఇంప్రెస్ చెయ్యట్లేదు. PS-1, PS-2 వంటి సినిమాలకు పనిచేసినప్పటికీ, మునుపటి రోజుల రహ్మాన్ రేంజ్ మిస్ అయ్యిందనే అభిప్రాయాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో, పెద్ది గ్లింప్స్ కోసం రహ్మాన్ ఇచ్చిన మ్యూజిక్ కూడా అంతగా కనెక్ట్ అవుతుందా? లేక విజువల్స్ బాగున్నా, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంది? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

విజువల్స్ కి తగ్గ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చారా?

ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, పెద్ది గ్లింప్స్ నిజానికి ఉగాది రోజున విడుదల కావాల్సింది. కానీ, రహ్మాన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆలస్యంగా రావడంతో, శ్రీరామనవమికి వాయిదా వేశారట.మేకర్స్ చెబుతున్నట్టు, ఈ 20 సెకన్ల గ్లింప్స్  లో ఉన్న ఒక్క షాట్ కోసం వెయ్యి సార్లు వీడియోని చూస్తారట ఫ్యాన్స్. అద్భుతమైన విజువల్స్‌ని రహ్మాన్ ఇచ్చిన మ్యూజిక్ మరింత ఎలివేట్ చేసేలా ఉంటే బాగుంటుంది.

పెద్ది గ్లింప్స్ సక్సెస్ అవుతుందా?

ఈ సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. రాంచరణ్ కెరీర్‌లో అత్యంత స్ట్రాంగ్ సబ్జెక్ట్ అని ఇండస్ట్రీ టాక్. అందుకే, ఈ సినిమా గ్లింప్స్ తో పాన్ ఇండియా సౌండ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అది జరగాలి అంటే రెహమాన్ స్కోర్ పైన ఆధారపడి ఉంది. పెద్ది గ్లింప్స్ కి సూపర్బ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చి రహ్మాన్ తన లెజెండరీ టచ్ ని ఆడియన్స్ కి గుర్తు చేస్తే చాలు పెద్ది బజ్ ఆకాశాన్ని తాకడం గ్యారెంటీ.

Related News

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

TFCC Elections : ముగిసిన వివాదం… త్వరలోనే ఛాంబర్‌కి ఎలక్షన్లు

Big Stories

×