Anant Ambani Viral Video: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. చూడ్డానికి మనిషి కాస్త లావుగా ఉన్నా, తన మనసు చాలా మంచిది. మూగ జీవాలు, పక్షుల మీద అమితమైన ప్రేమను చూపిస్తారు. తాజాగా అనంత్ తన 30 వ పుట్టిన రోజు సందర్భంగా ద్వారకలో శ్రీకృష్ణుడిని దర్శించుకోవాలని నిర్ణయం తీసకున్నారు. ఇందుకోసం ఆయన గుజరాత్ లోని జామ్ నగర్ నుంచి ద్వారకకు పాదయాత్రగా బయల్దేరారు. ఈ రెండు నగరాల మధ్య దూరం 140 కిలోమీటర్లు ఉంటుంది. అనంత్ రోజూ 10 నుంచి 12 కిలో మీటర్లకు పైగా నడకను కొనసాగిస్తున్నారు. ట్రాఫిక్ కు ఇబ్బంది కలగకుండా రాత్రివేళ యాత్ర కొనసాగిస్తున్నారు. అనంత్ వెంట స్నేహితులు, బ్రాహ్మణులు, భక్తులు కూడా పాదయాత్రలో పాల్గొంటున్నారు. జై ద్వారకాధీష్ నినాదాలు, భజనలతో పాదయాత్ర ఉత్సాహంగా ముందుకుసాగుతోంది. ఏప్రిల్ 10న తన పుట్టిన రోజు నాటికి అనంత్ ద్వారకకు చేరుకొని ప్రత్యేక పూజలు చేయనున్నారు.
మూగజీవాలపై ప్రేమను చాట్టుకున్న అనంత్
ఇక అనంత్ పాదయాత్ర సందర్భంగా మరోసారి వార్తల్లో నిలిచారు. పక్షలు మీద తనకు ఉన్న ప్రేమను చాటుకునే ప్రయత్నం చేశారు. జామ్ నగర్ నుంచి ద్వారకకు పాదయాత్రగా బయల్దేరిన కాసేపటికి వందలాది కోళ్లను రక్షించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే? అనంత్ పాదయాత్రగా కంభాలియా ప్రాంతానికి చేరుకున్నారు. ఇదే సమయంలో ఓ కోళ్ల వ్యాన్ అటుగా వచ్చింది. అందులో వందలాది కోళ్లు ఉన్నాయి. ఆ వ్యాన్ ను ఆపి, ఈ కోళ్లను ఎక్కడికి తీసుకెళ్తున్నారని డ్రైవర్ ను అడిగారు. చికెన్ సెంటర్లకు సరఫరా చేస్తున్నామని సదరు డ్రైవర్ చెప్పాడు. వెంటనే, ఆయన ఆ కోళ్లు అన్నీ తనకు ఇవ్వాలని కోరాడు. వాటిని అమ్మితే వచ్చే డబ్బు కంటే ఎక్కువే ఇస్తానని చెప్పాడు. వెంటనే, తన టీమ్ కు డబ్బులు ఇవ్వాలని చెప్పాడు. ఆ కోళ్లను తన పక్షుల సంరక్షణ కేంద్రానికి తరలించాలన్నారు. ఈ సందర్భంగా ఓ కోడిని పట్టుకుని దానితో సరదాగా గడిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
This is Anant Ambani, Son of Mukesh Ambani.
During his Padyatra from Jamnagar to Dwarka, he saw a truck full of chicken being transported, his heart melted, he quickly stopped the truck and bought the whole truck load of chickens for double the price to rescue them from being… pic.twitter.com/r30JZuQtiY
— Roshan Rai (@RoshanKrRaii) April 1, 2025
అనంత్ పై నెటిజన్ల ప్రశంసలు
ఇక ఈ వీడియోను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అనంత్ అంబానీకి మూగ జీవాలు, పక్షలు మీద ఉన్న ప్రేమను కొనియాడుతున్నారు. ‘వన్ తార’ పేరుతో అనంత్ అంబానీ ఓ జంతు సంరక్షణ కేంద్రాన్ని నడుపుతున్నారు. ఇందులో ఎన్నో రకాల జంతువులు, పక్షులు జీవిస్తున్నాయి. ఆనారోగ్యంతో బాధపడే జంతువులను అక్కడికి తీసుకొచ్చి, వాటి బాగోగులు చూసుకుంటున్నారు అనంత్. రీసెంట్ గా ప్రధాని మోడీ ఈ జంతు సంరక్షణ కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ ఉన్న జంతువులతో కాసేపు సరదాగా గడిపారు. అనంత్ మూగ జీవులకు చేస్తున్న సేవను ప్రధాని మోడీ అభినందించారు.
Read Also: విద్యార్థి తండ్రితో టీచర్ ఎఫైర్, అవి చూపిస్తూ.. మనీ డిమాండ్, చివరికి..