BigTV English

Allu Aravind: అల్లు అరవింద్‌కి ప‌ర‌శురాం షాకిచ్చాడా?

Allu Aravind: అల్లు అరవింద్‌కి ప‌ర‌శురాం షాకిచ్చాడా?

Allu Aravind:టాలీవుడ్ పరిశ్ర‌మ‌లోని స్టార్ ప్రొడ్యూస‌ర్స్‌లో అల్లు అర‌వింద్ ఒక‌రు. గీతా ఆర్ట్స్ అధినేత‌గా ఆయ‌న భారీ చిత్రాల‌ను నిర్మించ‌టంతో పాటు గీతా ఆర్ట్స్ 2 అనే మ‌రో బ్యాన‌ర్‌ను స్టార్ట్ చేసి చిన్న చిత్రాల‌ను నిర్మిస్తుంటారు. ఈ రెండో బ్యాన‌ర్ వ్య‌వ‌హారాల‌ను బ‌న్నీ వాస్ చూస్తుంటారు. అయితే అల్లు అర‌వింద్‌కి తెలియ‌కుండా వ్య‌వ‌హారాలు జ‌రుగుతాయ‌ని అనుకోకూడ‌దు. అలాంటి అగ్ర నిర్మాత‌కు ఓ డైరెక్ట‌ర్ అనుకోని షాక్ ఇచ్చాడ‌ట‌. అస‌లు ఈ ప‌రిణామాన్ని అల్లు అర‌వింద్ ఊహించ‌లేక‌పోయాడ‌ని స‌మాచారం. ఇంత‌కీ ఆ డైరెక్ట‌ర్ ఎవ‌రో కాదంట‌.. ప‌ర‌శురాం పెట్ల‌.


ప‌ర‌శురాం పెట్ల దర్శ‌క‌త్వంలో గీతా ఆర్ట్స్ 2 బ్యాన‌ర్‌లో వ‌చ్చిన గీత గోవిందం చాలా పెద్ద హిట్ అయ్యింది. వంద కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌ను సాధించిన చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది. అదే స‌మ‌యంలో అదే బ్యాన‌ర్‌లో మ‌రో సినిమా చేస్తాన‌నే అగ్రిమెంట్‌కి ఓకే చెప్పాడు ప‌ర‌శురాం. వెంట‌నే స్టార్ట్ చేయ‌లేక‌పోయారు. మ‌ధ్య‌లో మ‌హేష్‌తో సర్కారువారి పాట సినిమాను డైరెక్ట్ చేశాడు ప‌ర‌శురాం. ఆ త‌ర్వాత నాగ చైత‌న్య‌తో సినిమా అనుకున్నాడు. చివ‌ర‌కు ఆ సినిమా అట‌కెక్కింది. దీంతో ప‌ర‌శురాం మ‌ళ్లీ గీతా ఆర్ట్స్ త‌లుపులు త‌ట్టాడు. స‌రే! ఎలాగూ సినిమా చేయాల్సి ఉంది క‌దా.. అని చెప్పి ఆయ‌న కూడా స్టోరి రెడీ చేయ‌మ‌ని అన్నాడు. అది కూడా గీత గోవిందం 2 క‌థ‌నే సిద్ధం చేయాల‌ని చెప్పాడు. దానికి సంబంధించిన చర్చ‌లు జ‌రుగుతున్నాయి.

ఈ నేప‌థ్యంలో ఉన్న‌ట్లుండి విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ప‌ర‌శురాం కాంబినేష‌న్‌లో దిల్ రాజు మూవీ చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. ఇది అర‌వింద్‌కి ఉహించిన షాక్ అనే చెప్పాలి. అప్ప‌టికే ప‌ర‌శురాంకి అర‌వింద్ అడ్వాన్స్ కూడా ఇచ్చేశాడు. త‌న సినిమా గురించి అడుగుతామ‌ని ప‌ర‌శురాంకి ఫోన్ చేస్తే త‌ను ఫోన్ ఎత్త‌లేదు.. నిర్మాత దిల్‌రాజుకి ఫోన్ చేసినా ఆయ‌న కూడా ఫోన్ లిఫ్ట్ చేయ‌లేద‌ని సినీ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోన్న స‌మాచారం. ఈ విష‌యంపై అల్లు అర‌వింద్ మ‌న‌సు నొచ్చుకుంద‌ట‌. ఆయ‌న వెంట‌నే ప్రెస్ మీట్ కూడా పెట్టి ఈ విష‌యంపై నిల‌దీయాల‌ని అనుకున్నాడు. అయితే త‌ర్వాత ఏం జ‌రిగిందో ఏమో కానీ అర‌వింద్ ప్రెస్ మీట్ క్యాన్సిల్ అయ్యింది.


For More Live Updates Follow Us :-

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×