Allu Arjun..ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) సినిమాల ద్వారా ఎంత పాపులారిటీ సొంతం చేసుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే అలా వచ్చిన క్రేజ్ ను ఆయన సద్వినియోగం చేసుకోకపోగా.. ఎప్పుడైతే ఈగో చూపించారో ఇక చిక్కుల్లో పడక తప్పలేదు అని నెటిజన్స్ సైతం కామెంట్స్ చేశారు. ఇక అసలు విషయంలోకి వెళ్తే.. అల్లు అర్జున్ అనగానే మొదటగా ఆయన సినిమాల కంటే కూడా గత ఏడాది జరిగిన సంధ్యా థియేటర్ ఘటనే అందరికీ గుర్తుకొస్తుంది. సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన చిత్రం ‘పుష్ప’.ఈ సినిమా సీక్వెల్ గా వచ్చిన ‘పుష్ప 2’ సినిమా గత ఏడాది డిసెంబర్ 5న విడుదలైన విషయం తెలిసిందే. కానీ డిసెంబర్ 4వ తేదీన హైదరాబాద్ సంధ్య థియేటర్లో బెనిఫిట్ షో వేయగా.. అక్కడికి పోలీసులు అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించుకుంటూ వచ్చి తొక్కిసలాటకు కారణమయ్యారు అల్లు అర్జున్. ఆ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించగా.. ఆమె కొడుకు ఇప్పటికీ ప్రాణాలతో పోరాడుతున్నారు. ఈ విషయంపై ఒకరోజు జైలు జీవితాన్ని కూడా గడిపి వచ్చారు అల్లు అర్జున్.
అడ్డంగా దొరికిపోయిన అల్లు అర్జున్..
ఇక ఆ సమస్య ఇంకా సమిసిపోకనే అప్పుడే మళ్లీ ఇంకోసారి చిక్కుల్లో పడ్డారు అల్లు అర్జున్ అని చెప్పవచ్చు.
అసలు విషయంలోకి వెళ్తే..బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయడం నేరం అంటూ తెలంగాణ ప్రభుత్వం ఎంత చెబుతున్నా.. కొంతమంది బాగా పేరు మోసిన సెలెబ్రిటీలు మాత్రం సొంత లాభం కోసం బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తూ స్వలాభం పొందుతున్నారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ను మొదలుకొని టాప్ సినీ సెలబ్రిటీల వరకు చాలామంది ఒకవైపు సినిమాల ద్వారా భారీగా సంపాదిస్తూనే… మరొకవైపు ఈ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తూ ఇంకాస్త ఆదాయాన్ని పెంచుకుంటున్నారని చెప్పవచ్చు. ఇక ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్నారో వారిపై కేసు నమోదు చేస్తుండగా.. ఐఏఎస్ వీసీ సజ్జనార్ కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నట్టు గుర్తిస్తే స్క్రీన్ షాట్ తీసి మరీ తనకు డైరెక్ట్ గా మెసేజ్ పెట్టమని కూడా కోరారు. దీంతో యువత అందరూ అలర్ట్ అయిపోయి.. ఎవరెవరు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్నారో.. వారందరిపై నేరుగా వీసీ సజ్జానార్ కు కంప్లైంట్ చేస్తున్న విషయం తెలిసిందే.
బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న ఆహా ఓటీటీ ఫ్లాట్ ఫారం..
ఈ నేపథ్యంలోనే ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫారం గా గుర్తింపు తెచ్చుకున్న ఆహా ఓటీటీ కూడా.. ఈ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తూ అడ్డంగా దొరికిపోయింది. అసలు విషయంలోకి వెళ్తే.. ఈ ఓటీటీ ప్లాట్ఫారం వేదికగా ప్రసారమవుతున్న కొన్ని షోలలో MostBet, 9winZ వంటి బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తూ ఇప్పుడు అడ్డంగా దొరికిపోయారు. ఇక ఈ విషయాన్ని ఒక ట్విట్టర్ యూజర్ స్క్రీన్ షాట్ తీసి మరీ నేరుగా వీసీ సజ్జనార్ ను ట్యాగ్ చేస్తూ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఈ విషయం కాస్త వైరల్ అవ్వడంతో అసలే సంధ్యా థియేటర్ ఘటనలో జైలుకెళ్ళి వచ్చిన అల్లు అర్జున్.. ఇప్పుడు మళ్ళీ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ అడ్డంగా దొరికిపోయారే.. ఇక మళ్ళీ అరెస్టు తప్పదా..? జైలుకు వెళ్లాల్సిందేనా..? అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు. మరి దీనిపై అల్లు అర్జున్, ఆయన తండ్రి, ప్రముఖ నిర్మాత ఆహా ఓటీటీ సంస్థ అధినేత అల్లు అరవింద్ (Allu Aravindh) ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.