Tollywood:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎన్నో జంటలు ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ సెలబ్రిటీలు ఎప్పుడు ప్రేమలో పడతారో తెలియదు.. ఎప్పుడు వివాహం చేసుకుంటారో తెలియదు. అలా వివాహం చేసుకున్నవారు అన్యోన్యంగా ఉంటారా అంటే? అదీ లేదు. అనూహ్యంగా విడాకులు తీసుకొని అభిమానులను ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. అయితే ఇక ఈ విడాకుల తర్వాత తమ భర్తల నుండి వీరు తీసుకునే భరణం మాత్రం అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు తమ భర్తల నుండి విడిపోయేటప్పుడు కోట్ల రూపాయలను భరణంగా తీసుకొని అందర్నీ ఆశ్చర్యపరచగా.. ఇక్కడ ఒక టాలీవుడ్ హీరోయిన్ మాత్రం సుమారుగా రూ.3వేల కోట్ల ఆస్తులు ఉన్న కుటుంబానికి కోడలిగా వెళ్లి.. ఆపై మనస్పర్ధలు రావడంతో భర్త నుంచి విడాకులు తీసుకున్న తర్వాత.. వారి నుంచి ఒక్క రూపాయి కూడా భరణం ఆశించకుండా ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది. ముఖ్యంగా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఒక్క రూపాయి కూడా భరణం తీసుకోని హీరోయిన్గా రికార్డు సృష్టించింది సమంత (Samantha).
నాగచైతన్య తో పెళ్లి, విడాకులు..
టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న సమంతా గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ‘ఏ మాయ చేసావే’ అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు.. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో నాగచైతన్య (Naga Chaitanya) హీరోగా నటించాడు . అతడిని ఏడేళ్లపాటు ప్రేమించి, 2017లో పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత నాలుగేళ్ల పాటు స్టార్ కపుల్ గా ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపిన వీరు.. సడన్గా విడిపోయారు. 2021 అక్టోబర్ 2న ఊహించని విధంగా విడాకులు ప్రకటించి, అభిమానులను ఆశ్చర్యపరిచారు. వీరి విడాకుల వార్త సినిమా ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. ఇకపోతే వీరు విడిపోయి నాలుగేళ్లు పూర్తి కావస్తున్నా.. ఇప్పటివరకు అసలు కారణం ఏంటి అనేది మాత్రం బయటకు రాలేదు.
Allu Arjun:అల్లు అర్జున్ మళ్లీ అరెస్ట్…? ఈ సారి అడ్డంగా దొరికిపోయాడు
భరణం తీసుకోని నటిగా సమంత రికార్డ్..
ఇకపోతే సాధారణంగా సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లు తమ భర్తల నుండి విడిపోయేటప్పుడు భారీగా డిమాండ్ చేస్తూ ఉండడం మనం చూస్తూనే ఉంటాం. కానీ సమంత మాత్రం ఒక్క రూపాయి కూడా భరణం ఆశించలేదు. అటు ఇండియాలోనే కాకుండా ప్రపంచంలోనే భరణం ఆశించని నటిగా సమంత నిలిచి అందరికీ ఆదర్శంగా నిలిచింది.వాస్తవానికి నాగచైతన్య సమంతతో విడాకులు తీసుకునే సందర్భంలో ఏకంగా రూ. 200 కోట్ల భరణాన్ని ఆఫర్ చేశారట. కానీ నాగచైతన్యను ఎంతగానో ప్రేమించిన సమంత ఆ భరణాన్ని తిరస్కరించిందట. అలా తమ ప్రేమకు విలువనిచ్చిందని ఇప్పటికీ ఆమె సన్నిహితులు చెబుతూ ఉంటారు. ఇక ఆర్థిక సంబంధాలే ఉన్న ఈ రోజుల్లో కూడా సమంత నిజమైన ప్రేమకు కట్టుబడి ఉందని, అందుకే భరణం తీసుకోకుండానే భర్తకు దూరమైంది అని సమాచారం. ఇకపోతే నాగచైతన్య నుండి విడిపోయిన సమంత ఇప్పటికీ ఒంటరిగానే జీవితాన్ని సాగిస్తోంది. కానీ నాగచైతన్య మాత్రం ప్రముఖ నటి శోభిత దూళిపాల (Shobhita dhulipala) ను ఇంకొక వివాహం చేసుకొని ఇప్పుడు సెకండ్ లైఫ్ ను కూడా ప్రారంభించేశారు. ఏది ఏమైనా సమంతకు సంబంధించిన ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.