E-Paper
Advertisement

Allu Arjun – Trivikram Combo: మరోసారి అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబో ఫిక్స్.. ఈ సారి కూడా అమ్మ, అత్త క్యారెక్టర్లేనా..?

Allu Arjun – Trivikram Combo: మరోసారి అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబో ఫిక్స్.. ఈ సారి కూడా అమ్మ, అత్త క్యారెక్టర్లేనా..?
Advertisement
Allu Arjun – Trivikram
Allu Arjun – Trivikram

Allu Arjun – Trivikram Combo Movie Announced: నేడు అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఆయన నటిస్తున్న.. నటించబోతున్న సినిమాల అనౌన్స్‌మెంట్‌ల కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా పుష్ప 2 టీజర్‌తో మేకర్స్ సర్ప్రైజ్ అందించారు. అయితే ఇప్పుడు మరో అప్డేట్‌ వచ్చింది. బన్నీ నటించబోయే మరో కొత్త సినిమా అనౌన్స్ అయింది. అయితే ఆ సినిమాకి దర్శకత్వం, ప్రొడక్షన్ హౌస్‌కి సంబంధించిన విషయానికొస్తే..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప2 తో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ మూవీ కోసం ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ సినిమాపై ఓ రేంజ్‌లో అంచనాలు పెంచేశాయి.

Advertisement

ఇవాళ బన్నీ బర్త్ డే కావడంతో మూవీ మేకర్స్ పుష్ప 2 టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ టీజర్‌లో బన్నీని జాతర గెటప్‌లో చూసి ఫిదా అయిపోయారు. టీజర్ మొత్తం ఒక్క డైలాగ్ కూడా లేకుండా.. ఓన్లీ మాస్ యాక్షన్‌తో అదరగొట్టేశారు. జాతర గెటప్, జాతర సీన్లు, జాతర యాక్షన్.. ఇలా మొత్తం జాతరలోనే సాగింది.

Also Read: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఆ మూవీలోని మూడు సాంగ్స్ కంప్లీట్!

Advertisement

ఇకపోతే ఈ మూవీ అప్డేట్‌తో పాటు మరెమైనా అప్డేట్లు వస్తాయా అని అభిమానులు ఎదురుచూస్తున్న సమయంలో అదిరిపోయే సర్ప్రైజ్ వచ్చింది. అల్లు అర్జున్ పుష్పతో పాటు మరో సినిమాను లైన్‌లో పెట్టాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఈ చిత్రానికి హారికా హాసిని క్రియేషన్స్ నిర్మాణంలో చినబాబు నిర్మాతగా వ్యవహరించబోతున్నారు.

గతంలో అల్లు అర్జున్, త్రివిక్రమ్, హారికా హాసిని కాంబోలో ఇప్పటికే మూడు సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అలవైకుంఠపురంలో వంటి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ డూపర్ హిట్‌ను అందుకున్నాయి. అయితే ఇప్పుడు ఈ కాంబో మరోసారి సెట్ అయింది. వీరి ముగ్గురి కాంబోలో నాలుగో సినిమా ఫిక్స్ అయింది.

దీంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఇదివరకే బన్నీ – త్రివిక్రమ్ కాంబో సెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినిపించాయి. ఇప్పుడు ఆ వార్తలు నిజమయ్యాయి. ఇవాళ బన్నీ బర్త్ డే కావడంతో అందుకు సంబంధించిన సినిమా అనౌన్స్‌మెంట్ చేశారు. ఇందులో భాగంగానే ఓ కొత్త పోస్టర్‌ కూడా రిలీజ్ చేశారు.

Also Read: జాతర గెటప్.. జాతర సీన్లు.. జాతర యాక్షన్.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న టీజర్

అయితే ఈ కాంబోపై బన్నీ అభిమానులు కాస్త కంగారు పడుతున్నారు. ప్రస్తుతం ఉన్న జెనరేషన్‌కి తగ్గట్టుగా త్రివిక్రమ్ సినిమాలు తీయటం లేదని.. అంతా రొటీన్ స్టోరీలతోనే వస్తున్నాడని అంటున్నారు. ఈ ఏడాది మొదట్లో మహేశ్ బాబుతో ‘గుంటూరు కారం’ మూవీ తెరకెక్కించిన త్రివిక్రమ్.. అందులో పాత క్యారెక్టర్లతో.. రొటీన్ స్టోరీని తెరకెక్కించాడని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. మరి ఆ సినిమా పర్వాలేదనిపించినా.. త్రివిక్రమ్‌పై ఓ రేంజ్‌లో విమర్శలు వెల్లువెత్తాయి. మరి దాంతో ఏమైనా రియలైజ్ అయ్యాడా? లేక బన్నీతో కూడా అమ్మ, అత్త, మామయ్య వంటి క్యారెక్టర్లతో సినిమా తీస్తాడా? అని చర్చించుకుంటున్నారు. ఈ సారి ఎలాంటి స్టోరీతో వస్తున్నాడో చూడాలి.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×