E-Paper
Advertisement

Good News for Prabhas Fans: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఆ మూవీలోని మూడు సాంగ్స్ కంప్లీట్

Good News for Prabhas Fans: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఆ మూవీలోని మూడు సాంగ్స్ కంప్లీట్
Advertisement
Prabhas
Prabhas

3 Songs Completed in Prabhas – Hanu Raghavapudi Movie: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. గతేడాది సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ మూవీకి ముందు ఎలాంటి హిట్ లేని ప్రభాస్‌కు, ఆయన అభిమానులకు సలార్‌తో ఆకలి తీరింది. ప్రభాస్‌ను ఏ రేంజ్‌లో అయితే ఫ్యాన్స్ చూడాలనుకున్నారో.. అదే రేంజ్‌లో చూసి మురిసిపోయారు. ఈ మూవీ బాక్సాఫీసు వద్ద దాదాపు రూ.700 కోట్లు కలెక్ట్ చేసి అదరగొట్టింది.

ఇక ఈ మూవీ తర్వాత ప్రభాస్ లైనప్‌లో మరో మూడు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి ‘సీతారామం’ ఫేం హనూరాఘవపూడితో ఓ మూవీ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ మూవీపై కూడా అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్‌లు రాకపోవడంతో అంతా నిరాశలో ఉన్నారు. అయితే మరి వారిని ఖుష్ చేసేందుకు దర్శకుడు హను రాఘవపూడి తాజాగా ఓ గుడ్ న్యూస్ అందించినట్లు తెలుస్తోంది.

Advertisement

‘సీతారామం’ మూవీకి సంగీతం అందించిన విశాల్ చంద్రశేఖర్ ఇప్పుడు ప్రభాస్ – హను రాఘవపూడి సినిమాకు కూడా మ్యూజిక్ అందిస్తున్నాడు. దీంతో ఇప్పటికే ఈ మూవీలోని 3 సాంగ్స్‌ను విశాల్ చంద్రశేఖర్ పూర్తి చేశాడని దర్శకుడు తెలిపినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలిసి అంతా షాక్ అవుతున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి అప్డేట్ లేదు.. అప్పుడే 3 సాంగ్స్ కంప్లీట్ అయిపోయినట్లు చెప్తున్నారని చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా ప్రభాస్ లైనప్‌లో ఉన్న ఈ మూవీ షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతున్నట్లు ఈ అప్డేట్‌తోనే అర్థం అవుతోంది.

Also Read: జాతర గెటప్.. జాతర సీన్లు.. జాతర యాక్షన్.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న టీజర్

Advertisement

ఇదిలా ఉంటే ప్రభాస్ లైనప్‌‌లో ఉన్న ‘కల్కి 2898 ఏడీ’ మూవీ షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లింప్స్ సినిమాపై ఫుల్ హైప్ క్రియేట్ చేశాయి. ముఖ్యంగా గ్లింప్స్‌లో చూసినట్లయితే ప్రభాస్ హాలీవుడ్ రేంజ్ హీరోలా కనిపించి అదరగొట్టేశాడని నెట్టింట టాక్ వినిపిస్తోంది. ఇక ఈ మూవీ తర్వాత తన లైనప్‌లో ఉన్న సినిమా ‘రాజా సాబ్’ దర్శకుడు మారుతి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీలో ప్రభాస్ ఫుల్ క్లాస్ లుక్‌లో కనిపించబోతున్నట్లు ఇటీవల రిలీజ్ అయిన పోస్టర్ చూస్తే అర్థమవుతుంది.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×