BigTV English

Solar Eclipse 2024: నేడు కనువిందు చేయనున్న సంపూర్ణ సూర్యగ్రహణం.. ఎలా చూడొచ్చంటే?

Solar Eclipse 2024: నేడు కనువిందు చేయనున్న సంపూర్ణ సూర్యగ్రహణం.. ఎలా  చూడొచ్చంటే?
Solar Eclipse 2024
Solar Eclipse 2024

Solar Eclipse 2024: అమెరికా, కెనడా, మెక్సికో దేశాల్లో నేడు సంపూర్ణ సూర్యగ్రహణం కనువిందు చేయనుంది. దీంతో ఆయా దేశాల ప్రజలు ఎంతో ఆసక్తిగా దాన్ని తిలకించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఈ సంపూర్ణ సూర్యగ్రహణం న్యూయార్క్ లో దాదాపు దశాబ్ధ కాలం తర్వాత పూర్తి స్థాయిలో కనిపించనున్నది.


తమ దేశంలో పూర్తి స్థాయిలో చాలా సంవత్సరాలు తర్వాత సంపూర్ణ సూర్యగ్రహణం కనిపించడంతో అమెరికా ప్రత్యేక చర్యలు చేపట్టింది. గ్రహణాన్ని పూర్తి స్థాయిలో పరీక్షించడం కోసం అని నాసా కొన్ని ప్రత్యేక ప్రయోగాలు చేపట్టింది. ఈ అద్భుతాన్ని వీక్షించేందుకు అమెరికా కొన్ని ప్రత్యేక విమానాలను కూడా ఏర్పాటు చేసింది.

యునైటెడ్ స్టేట్స్, కెనడా , మెక్సికోలో నివసిస్తున్న అనేక మంది ప్రజలు సంపూర్ణ సూర్యగ్రహణాన్ని చూడగలుగుతారు. కొలంబియా, స్పెయిన్, వెనిజులా, ఐర్లాండ్, పోర్టల్, ఐస్లాండ్, యునైటెడ్ కింగ్‌డమ్, కొన్ని కరేబియన్ దేశాలలో నివసించే ప్రజలు పాక్షిక గ్రహణం కనువిందు చేయనుంది. కానీ, భారతదేశంలో మాత్రం ఈ గ్రహణం కనిపించలేదు. భారతీయ ప్రజలు సంపూర్ణ సూర్యగ్రహణాన్ని నేరుగా కాకుండా ఆన్ లైన్ ద్వారా వీక్షించవచ్చు.


Also Read: కలరా భయంతో ప్రయాణం.. పడవ బోల్తా పడి 90 మందికి పైగా మృతి

సూర్యుడి అధ్యయనం కోసం ఇస్రో ఆదిత్య ఎల్1ను ఇటీవలే ప్రయోగించింది. అయితే లాంగరిన్ 1 పాయింట్ వద్ద ఉన్న ఆదిత్య ఎల్1 అబ్జర్వేటరీ.. ఇవాళ చోటుచేసుకోనున్న సంపూర్ణ సూర్యగ్రహణాన్ని రికార్డు చేయలేదు. ఆ స్పేస్‌క్రాఫ్ట్ ఉన్న పొజిష‌న్‌లో గ్ర‌హ‌ణం క‌నిపించ‌దు. ఎందుకంటే ఆ పొజిష‌న్ నుంచి సూర్యుడి 365 డేస్ క‌నిపిస్తుంటాడు. భారత కాలమానం ప్రకారం ఏప్రిల్ 8 రాత్రి 9:13 గంటల నుండి ఏప్రిల్ 9 తెల్లవారుజామున 2:22 గంటల మధ్య గ్రహణం ఏర్పడుతుంది.

Tags

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×