E-Paper
Advertisement

Pushpa 2 Update: పుష్ప 2 నుంచి మైండ్ బ్లాక్ అయ్యే అప్డేట్.. సమంత ఈ సారి సాంగ్‌లో కాదు.. ఏకంగా..!

Pushpa 2 Update: పుష్ప 2 నుంచి మైండ్ బ్లాక్ అయ్యే అప్డేట్.. సమంత ఈ సారి సాంగ్‌లో కాదు.. ఏకంగా..!
Advertisement
samantha
samantha

Samantha Playing Cameo Role in Allu Arjun’s Pushpa 2 Movie: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్‌లో ‘పుష్ప2’ మూవీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. ఈ మూవీపై అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. అంతేకాకుండా ఇందులో చాలా మంది స్టార్ నటీ నటులు భాగం అయ్యారు.

అయితే తాజాగా ఇందులో సమంత పేరు బయటకొచ్చింది. ఫస్ట్ పార్ట్‌లో ఐటెం సాంగ్‌తో రెచ్చిపోయిన సమంత ఈ సారి సెకండ్ పార్ట్‌లో ఓ పాత్రలో నటిస్తోందట. ఆ పాత్ర మరో పార్ట్‌లో కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఆ పాత్ర గురించి.. నెక్స్ట్ పార్ట్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం..

Advertisement

టాలీవుడ్ మోస్ట్ అవైయిటెడ్ సినిమాల్లో ‘పుష్ప2’ మూవీ ఒకటి. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఫస్ట్ పార్ట్ ప్రపంచ వ్యాప్తంగా మంచి రెస్పాన్స్ అందుకోవడంతో దర్శకుడు సుకుమార్ సెకండ్ పార్ట్‌ను చాలా గ్రాండ్ లెవెల్లో తెరకెక్కిస్తున్నాడు.

Also Read: కల్కి మూవీ ఓటీటీ రైట్స్ ఎంతో తెలుసా.. ఏకంగా రెండు మూడు సినిమాలు తీయొచ్చు..

Advertisement

ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ సాలిడ్ అప్డేట్‌ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఎవరూ ఊహించని ఓ పాత్ర ఇందులో అందరినీ సర్ప్రైజ్ చేయనుందని తెలుస్తోంది. ఆ పాత్రలో మరెవరో కాదు.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నటించబోతున్నట్లు తెలుస్తోంది.

సమంత ఈ మూవీలో కామియో రోల్ చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇందులో క్లైమాక్స్‌లో కొన్ని నిమిషాలే ఆమె కనిపిస్తుందట. అదే ‘పుష్ప3’ లో కొనసాగింపు అవుతుందంటూ తాజాగా గుస గుసలు వినిపిస్తున్నాయి.

అయితే సమంత కనిపించిన ఆ కొద్ది నిమిషాలు గూస్‌బంప్స్ వస్తాయని అంటున్నారు. ఈ వార్తలపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఈ మూవీని ఈ ఏడాది ఆగస్టు 15న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు.

Also Read: హీరోకు ఉండే ఫాలోయింగ్‌తోనే ఏదైనా.. రెమ్యునరేషన్‌పై ఎన్టీఆర్ షాకింగ్ కామెంట్స్

ఈ క్రమంలో ఈ మూవీపై ఫుల్ హైప్ పెంచుతూ.. ఎప్పటికప్పుడు ఏదో ఒక అప్డేట్ నెట్టింట వైరల్ అవుతూనే ఉంది. ఇటీవలే 74వ బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప3’ పార్ట్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించి హైప్ పెంచేశాడు.

పుష్ప మూవీని ఫ్రాంచైజీలో తీసుకువచ్చేందుకు తమ మూవీ యూనిట్ ప్లాన్ చేస్తుందని.. కానీ ఇది ఇప్పుడిప్పుడే సాధ్యం కాదని చెప్పాడు. మొత్తానికి పుష్ప3 మూవీ వచ్చే అవకాశముందని హింట్ ఇచ్చేసిన విషయం తెలిసిందే. దీని ప్రకారం చూస్తే సమంత పుష్ప 2లో నటించే అవకాశాలు ఉన్నాయని కొందరు అభిప్రాయపడుతున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×