Big Stories

Prabhas: కల్కి మూవీ ఓటీటీ రైట్స్ ఎంతో తెలుసా.. ఏకంగా రెండు మూడు సినిమాలు తీయొచ్చు..

kalki 2898 ad
kalki 2898 ad

Kalki 2898 Ad Movie: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గతేడాది సలార్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. అభిమానులు ప్రభాస్‌ను ఏ రేంజ్‌లో చూడాలనుకున్నారో అదే రేంజ్‌లో చూసి తృప్తి పడ్డారు. దాదాపు రూ.700 కోట్ల కలెక్షన్స్ రాబట్టిన ఈ చిత్రం అందరినీ విపరీతంగా అలరించింది.

- Advertisement -

ఇక ఈ మూవీ తర్వాత ప్రభాస్ నటిస్తున్న మరికొన్ని సినిమాలపై భారీ హైప్ నెలకొంది. ఇప్పుడు ప్రభాస్ పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో ‘కల్కి 2898 ఏడీ’ మూవీ ఒకటి. దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సినిమాని ఎంతో గ్రాండ్‌గా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు.

- Advertisement -

ఈ మూవీపై ఏకంగా హాలీవుడ్ రేంజ్‌ అంచనాలు ఉన్నాయి. దర్శకుడు ఈ చిత్రాన్ని అవెంజర్స్ రేంజ్‌లో తెరకెక్కిస్తున్నాడు. అందువల్ల ఈ సినిమా కోసం ప్రేక్షకాభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Also Read: హీరోకు ఉండే ఫాలోయింగ్‌తోనే ఏదైనా.. రెమ్యునరేషన్‌పై ఎన్టీఆర్ షాకింగ్ కామెంట్స్

ఈ చిత్రాన్ని ఈ ఏడాది మే 9న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. అంతేకాకుండా ఇదివరకు రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్ సినీ ప్రియుల్లో ఫుల్ హైప్ క్రియేట్ చేసింది. దీంతో అందరిలోనూ ఈ మూవీ చూడాలనే ఉత్కంఠ మొదలైంది.

ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ న్యూస్ నెట్టింట వైరల్‌గా మారింది. ఈ సినిమా ఓటీటీ రైట్స్ కోసం ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్ ఫార్మ్స్ నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ గట్టిగానే ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

కాగా ఈ హక్కుల కోసం మూవీ మేకర్స్ దాదాపు రూ.200 కోట్లకి పైగా డిమాండ్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. కానీ ఓటీటీ సంస్థలు మాత్రం రూ.150 కోట్లు నుంచి రూ.170 కోట్ల వరకు మాత్రమే ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు గుస గుసలు వినిపిస్తున్నాయి.

Also Read:  ఫేమస్ నటుడు పార్థసారథి ఇక లేరు

కానీ మూవీ నిర్మాతలు మాత్రం రూ.200 కోట్లకు తక్కువకు ఈ మూవీ హక్కులను ఇచ్చేది లేదన్నట్లుగా ఉన్నారట. త్వరలోనే ఈ ఓటీటీ డీల్ సెట్ అయ్యే అవకాశముందని టాక్ నడుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇకపోతే ఈ మూవీలో భారీ తారాగణం నటిస్తోంది. కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, రానా, దీపికా పదుకొనే, దిశా పటాని వంటి స్టార్ నటీ నటులు ఇందులో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా ప్రభాస్ తన కెరీర్‌లో తొలిసారిగా సూపర్ హీరో పాత్రలో నటిస్తున్నాడు.

దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రంపై అప్పుడప్పుడు పలు ఇంటర్వ్యూలలో చెప్తూ అంచనాలను పెంచేస్తున్నారు. అంతేకాకుండా ఈ చిత్రంలో వీఎఫ్ఎక్స్‌ వేరే రేంజ్‌లో ఉంటాయని అంటున్నారు. అలాగే ఇటీవల ఈ మూవీ డైలాగ్ రైటర్ సాయి మాధవ్ బుర్రా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ మూవీపై ఫుల్ హైప్ పెంచేశారు. ఇప్పటివరకూ ఇండియన్ సినిమాలో ఇలాంటి చిత్రమే రాలేదంటూ చెప్పడంతో ఫ్యాన్స్ ఉత్సాహానికి అవదులు లేకుండా పోయాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News