BigTV English

JR NTR Comments on Remuneration: హీరోకు ఉండే ఫాలోయింగ్‌తోనే ఏదైనా.. రెమ్యునరేషన్‌పై ఎన్టీఆర్ షాకింగ్ కామెంట్స్!

JR NTR Comments on Remuneration: హీరోకు ఉండే ఫాలోయింగ్‌తోనే ఏదైనా.. రెమ్యునరేషన్‌పై ఎన్టీఆర్ షాకింగ్ కామెంట్స్!
JR NTR comments remunaration
JR NTR comments remunaration

JR NTR Shocking Comments om Remuneration: ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా.. తన కంటూ ఓ ఐడెంటీటినీ క్రియేట్ చేసుకున్న హీరో నందమూరి తారకరామారావు(జూ. ఎన్టీఆర్). తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి 23 ఏళ్లు గడిచిన జూ. ఎన్టీఆర్ కు ఇప్పటికీ అంతే ఫాలోయింగ్ ఉంది. తన మొదటి సినిమా నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ.. తన తాత ఎన్టీఆర్ నటన స్ఫూర్తితో యమదొంగ సినిమాలో యముడిగా అదరగొట్టాడు.


తర్వాత వచ్చిన ప్రతీ సినిమాతోను ప్రేక్షకులను అద్భుతంగా అలరించాడు. ముఖ్యంగా ఇటీవల ఎన్టీఆర్, డైరెక్టర్ రాజమౌళి కాంబోలో వచ్చిన ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా హీరోగా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సాధించుకున్నాడు. వివిధ దేశాల్లో అద్భుతంగా ఆడిన ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్ కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చేసింది. ఈ సినిమాలో అద్భుతంగా నటించిన ఎన్టీఆర్ ఉత్తమ నటుడి అవార్డును కూడా అందుకున్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ సినిమా 1000 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ ఒక్క సినిమాతో ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరో అయిపోయాడు. ఇక ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్ జరుగుతోంది. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఎన్టీఆర్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే సినిమా బడ్జెట్ పై, రెమ్యునరేషన్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు.


Also Read: Family Star Moive Pramotions: గల్లీలో ‘ఫ్యామిలీ స్టార్’ హోలీ సెలబ్రేషన్స్.. స్టెప్పులేసిన మృణాల్, విజయ్

ఎన్టీఆర్ తీసే సినిమాలు భారీ బడ్జెట్ తో తెరకెక్కాలంటూ వస్తున్న వార్తలపై ఎన్టీఆర్ స్పందించారు. ‘సినిమా బడ్జెట్ అనేది కథపై ఆధారపడి ఉంటుంది. డైరెక్టర్ అనుకున్న స్క్రిప్ట్ ను సినిమాగా తీయాలంటే దానికి కావాల్సిన సెట్స్ కోసం బడ్జెట్ పెట్టాల్సి ఉంటుంది. సాధారణంగా సినిమాల్లో వేసే సెట్స్ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో చేస్తారు. వాటి కోసం భారీ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కానీ మార్కెట్లో మాత్రం హీరో రెమ్యునరేషన్ గురించి చాలా మాట్లాడుతుంటారు. వందల కోట్లు తీసుకుంటున్నాం అని ఏదేదో అనేస్తుంటారు. కానీ అసలు అక్కడ ఏమి ఉండదు. హీరోకు రెమ్యునరేషన్ ఎంత ఇవ్వాలనేది మార్కెట్లో ఉండే ఫాలోయింగ్ ను బట్టి ఉంటుంది’ అని ఎన్టీఆర్ అన్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Tags

Related News

Dharsha Guptha: ఇంస్టాగ్రామ్ ద్వారా నెలకు లక్షల్లో ఆదాయం..ఈ ముద్దుగుమ్మ పనే బాగుందే!

Vithika sheru: మట్టి వినాయకుడిని చేసిన హీరోయిన్.. వామ్మో ఈ టాలెంట్ కూడా ఉందా?

Dethadi Alekhya Harika: మన క్యారెక్టర్ ని డిసైడ్ చేసేది అదే.. బుల్లి కథతో హారిక పోస్ట్!

Big TV kissik talks : స్టేజ్ పై అమ్మాయిలతో పండు అలా.. అడ్డంగా పరువుతీసేసిన వర్ష…

Big TV kissik talks : శేఖర్ మాస్టర్ అలాంటి వాడే.. షాకింగ్ విషయాలను బయట పెట్టిన పండు..!

The Big Folk Night 2025 : జానపదంతో దద్దరిల్లిన ఎల్బీ స్టేడియం.. ఘనంగా బిగ్ టీవీ ఫోక్ నైట్

Big Stories

×