E-Paper
Advertisement

Allu Arjun @ Road Side Dhaba: చిన్న ధాబాలో భార్యతో కలిసి బన్నీ ఏం చేస్తున్నాడో చూడండి..?

Allu Arjun @ Road Side Dhaba: చిన్న ధాబాలో భార్యతో కలిసి బన్నీ ఏం చేస్తున్నాడో చూడండి..?
Advertisement

Allu Arjun Eating Food in Road Side Dhaba: కోట్ల సంపాదన..స్టార్ హీరో.. తలుచుకుంటే ఏదైనా కాళ్ల వద్దకు తీసుకొచ్చే పనివాళ్ళు.. లేదు అంటే ఎక్కడికైనా తీసుకెళ్లే కార్లు.. ఇన్ని ఉన్నా ఒక స్టార్ హీరో.. ఒక సామాన్యుడిగా రోడ్డుపక్కన ధాబాలో ఫుడ్ తింటూ కనిపించాడు. అది కూడా భార్యతో.. ఇది మేము అంటున్న మాట కాదు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ చెప్తున్న మాట. ఇంతకు అంత సింపుల్ గా ఉన్న ఆ హీరో ఎవరు అనుకుంటున్నారా.. ? ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.

బన్నీకి ఇదేమి కొత్త కాదు. ఆకలి వేస్తే ఎక్కడైనా తినేస్తాడు. గతంలో ఒక చిన్న పూరి గుడిసె లో ఉన్న హోటల్ లో కూడా ఇడ్లీ తిని షాక్ ఇచ్చాడు. ఇక ఇప్పుడు మరోసారి తన సింప్లిసిటీ చూపించాడు. ఇటీవలే బన్నీ, తన భార్య స్నేహతో కలిసి నంద్యాల వెళ్లిన విషయం తెల్సిందే. వైసీపీ నేత శిల్పా రవిచంద్రరెడ్డి ఆతిధ్యం స్వీకరించి తిరిగి ఇంటికి ప్రయాణిస్తుండగా.. మార్గమధ్యంలో ఇదుగో ఈ జంట ఇలా దర్శనమిచ్చినట్లు తెలుస్తోంది. ఎలాంటి ఫెసిలిటీస్ లేని ఒక ధాబాలో బన్నీ,స్నేహ ఆగి లంచ్ చేస్తున్నట్లు కనిపిస్తుంది.

Advertisement

అదేంటి శిల్పా రవిచంద్రరెడ్డి ఆతిధ్యంకు వెళ్లి ఇక్కడ తినడమేంటి అని అందరికి అనుమానం వస్తున్న నేపథ్యంలో.. బన్నీ కేవలం ఫ్రెండ్ కు బెస్ట్ విషెస్ చెప్పడానికి మాత్రమే వెళ్లాడని, వాళ్ళింట్లో ఫుడ్ కూడా తినకుండా వచ్చాడని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. అందుకే ఇలా తింటున్నట్లు చెప్తున్నారు. ఇందులో నిజమెంత అనేది తెలియదు కానీ, ఎంతో సింపుల్ గా ఎలాంటి హంగు ఆర్బాటాలు లేకుండా వీరు ఇలా తినడం చూస్తుంటే చూడడానికి కూడా ఎంతో అద్భుతంగా ఉందని బన్నీ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. అది మా పుష్ప గాడి రేంజ్ అని కాలర్ ఎగురవేస్తున్నారు.

Also Read: NTR: తారక్.. ఇది పద్ధతి కాదు.. పవన్ ఫ్యాన్స్ ఫైర్

Advertisement

ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఇకపోతే ప్రస్తుతం బన్నీ పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఆగస్టు 15 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. మరి ఈ సినిమాతో బన్నీ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×