BigTV English
Advertisement

iQOO Z6 Lite 5G Mobile: ఇది కదా బంపర్ ఆఫరంటే.. రూ.8వేలకే ఐక్యూ 5G స్మార్ట్‌ఫోన్

iQOO Z6 Lite 5G Mobile: ఇది కదా బంపర్ ఆఫరంటే.. రూ.8వేలకే ఐక్యూ 5G స్మార్ట్‌ఫోన్

40% Discount on iQOO Z6 Lite 5G Smartphone: స్మార్ట్‌ఫోన్ మార్కెట్ రోజురోజుకు భారీగా విస్తరిస్తోంది. ఉదయాన్నే నిద్రలేచినప్పటి నుంచి రాత్రి పడుకొనే వరకు చాలా మంది ప్రజలు ఫోన్లతోనే కాలాన్ని గడిపేస్తున్నారు. కొందరైతే ఆఖరికి బాత్రూమ్‌‌లో కూడా ఫోన్‌ను యూజ్ చేస్తున్నారు. ఏ పని చేస్తున్నా స్మార్ట్‌ఫోన్ అనేది కచ్చితంగా చేతిలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే కంపెనీల కొత్తకొత్త ఫోన్లను మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నాయి. కొనుగోలుదారులను ఆకర్షించేందుకు ఆఫర్ల వర్షాన్ని కురిపిస్తున్నాయి.


ఇందులో భాగంగానే ప్రముఖ ఈ కామర్స్ ఫ్లాట్‌ఫామ్ అమెజాన్ డిస్కౌంట్ డే సేల్‌ ప్రారంభించింది. iQOO Z6 లైట్ 5G స్మార్ట్ ఫోన్ 40 శాతం భారీ తగ్గింపు ప్రకటించింది. ఈ భారీ తగ్గింపు తర్వాత స్మార్ట్‌ఫోన్  ధర రూ.19,999 నుండి కేవలం రూ.11,999కి తగ్గింది. ఈ విధంగా మీరు 6GB RAM+128GB స్టోరేజ్ వేరియంట్‌ ఫోన్‌ను రూ. 8,000 వరకు భారీ తగ్గింపుతో నేరుగా కొనుగోలు చేయవచ్చు.

Also Read: వివో నుంచి రెండు స్టన్నింగ్ ఫోన్లు లాంచ్.. కేక పుట్టిస్తున్న ఫీచర్లు!


ఇది iQoo స్నాప్‌డ్రాగన్ 4 Gen 1 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. ఇది 6nm ప్రాసెస్‌లో అద్భుతమైన పనితీరును అందిస్తుంది. 6GB RAM+128GB ఇంటర్నల్ స్టొరేజ్‌తో ఫోన్ వస్తుంది. ఫోన్ 6.58 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. దీని రిఫ్రెష్ రేట్ 120Hz, రిజల్యూషన్ 2400×1080 పిక్సెల్‌లు. ఈ FHD+ డిస్‌ప్లే మీరు అధిక నాణ్యతతో వీడియోలను చూడటానికి వీలుగా ఉంటుంది. మీరు ఈ ఫోన్‌లో గేమింగ్‌ను కూడా ఆస్వాదించవచ్చు.

iQOO Z6 లైట్ 5G స్మార్ట్‌ఫోన్‌లో 5000mAh శక్తివంతమైన బ్యాటరీని ఉంది. ఇది 18W ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే ఈ ఫోన్ 127 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్, 21.6 గంటల సోషల్ మీడియా, 14.5 గంటల OTT స్ట్రీమింగ్, 8.3 గంటల గేమింగ్‌ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది.

Also Read: 3D కర్వ్‌డ్ డిస్‌ప్లే‌తో వివో బడ్జెట్ ఫోన్ లాంచ్.. ఇప్పుడే కొనుగోలు చేస్తే భారీగా డిస్కౌంట్!

iQOO Z6 లైట్ 5G కెమెరా గురించి మాట్లాడితే 50MP మెయిన్ కెమెరా సెన్సార్ ఉంది. దీని సహాయంతో మీరు మంచి ఫోటోలను తీయవచ్చు. ఈ స్టైలిష్ ఫోన్ చాలా స్లిమ్ డిజైన్‌తో వస్తుంది. దీని మందం 8.25mm, బరువు 194 గ్రాములు. కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఏడాదిపాటు వారెంటీ ఇస్తుంది.

Tags

Related News

Snapchat AI Search: ఏఐ ప్రపంచంలో కీలక ఒప్పందం.. స్నాప్‌చాట్‌లోకి పర్‌ప్లెక్సిటీ ఏఐ సెర్చ్‌!

Vivo 16GB RAM Phone Discount: వివో 16GB ర్యామ్, ట్రిపుల్ కెమెరా గల పవర్‌ఫుల్ ఫోన్‌పై షాకింగ్ రూ.34,000 డిస్కౌంట్.. ఎలా పొందాలంటే..

Smartwatch At Rs 1799: తక్కువ ధరలో టాప్‌ క్లాస్‌ లుక్‌.. రూ.8వేల స్మార్ట్‌వాచ్‌ జస్ట్ రూ1,799లకే

AI-Heart Condition: డీప్ లెర్నింగ్ కృత్రిమ మేధ.. గుండెలో దాగున్న రంధ్రాన్ని ఇట్టే పట్టేస్తుంది!

2025 Yamaha RX 100: యమహా ఆర్ఎక్స్100 లెజెండ్‌ పవర్‌ఫుల్‌ రీ ఎంట్రీ.. ఇప్పుడు కొత్త స్టైల్‌తో..

AI Professionals-Women: ఏఐ రంగంలో మహిళలకు బ్రైట్ ఫ్యూచర్.. తాజా నివేదికలో కీలక విషయాలు

Samsung’s New 5G: శామ్‌సంగ్‌ నుంచి మరో సర్‌ప్రైజ్.. బడ్జెట్‌లోనే ప్రీమియం ఫీచర్ల ఫోన్‌

Vibe Coding: డెవలపర్ల కొంపముంచుతున్న కృత్రిమ మేధ.. అసలేమిటీ వైబ్‌కోడింగ్?

Big Stories

×