BigTV English

AA 22xA6 Movie Title : పిచ్చి పరాకాష్ట అంటే ఇదేనేమో… టీ షర్ట్స్, క్యాప్స్ కాదు… ఈ సారి ఏకంగా మూవీ టైటిలే..?

AA 22xA6 Movie Title : పిచ్చి పరాకాష్ట అంటే ఇదేనేమో… టీ షర్ట్స్, క్యాప్స్ కాదు… ఈ సారి ఏకంగా మూవీ టైటిలే..?

AA 22xA6 Movie Title :అల్లు అర్జున్ (Allu Arjun).. పుష్ప(Pushpa )సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా హీరో అయిపోయిన ఈయన.. అప్పటివరకు ఉన్న టాలీవుడ్ రికార్డులను బ్రేక్ చేశారు. ఈ సినిమాతో ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు అందుకోవడమే కాకుండా టాలీవుడ్ హీరోలలో తొలి నేషనల్ అవార్డు అందుకున్న మేల్ నటుడిగా రికార్డు సొంతం చేసుకున్నారు. ఈ సినిమా ఇచ్చిన క్రేజ్ తో మళ్ళీ మూడేళ్ల నిర్విరామ కష్టం తర్వాత ‘పుష్ప 2’ రిలీజ్ చేశారు. ఈ సినిమా ఏకంగా ఇండియన్ బాక్సాఫీస్ ను కలెక్షన్లతో షేక్ చేసింది. ఫుల్ రన్ ముగిసే సరికి రూ.1800 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. ఇకపోతే ‘దంగల్ ‘ సినిమా కలెక్షన్స్ ను బీట్ చేయాలని అనుకుంది. కానీ చివరి వరకు వెళ్లి అందుకోలేకపోయింది. ఇక మరొకవైపు అల్లు అర్జున్ ఈ టార్గెట్ ను ఎలాగైనా సరే బ్రేక్ చేయాలని తెగ ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే.


AA 22xA6 మూవీకి టైటిల్ పరిశీలన..

ఇదిలా ఉండగా మరొకవైపు ఆయన తన హోదాకు తగ్గట్టుగా అన్నీ కూడా ఇప్పుడు పాన్ ఇండియా చిత్రాలు చేస్తున్నారు. అందులో భాగంగానే కోలీవుడ్ డైరెక్టర్ అట్లీతో తన తదుపరి చిత్రాన్ని తన బర్తడే సందర్భంగా ప్రకటించిన విషయం తెలిసిందే. బన్నీ బర్తడే రోజున అనౌన్స్మెంట్ వీడియో రిలీజ్ చేస్తూ.. హాలీవుడ్ రేంజ్ లో సినిమాను తెరకెక్కించబోతున్నట్లు ప్రకటించారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. దీనికి తోడు ఈ సినిమాకు ‘అవతార్’ వంటి చిత్రాలకు పనిచేసిన హాలీవుడ్ దిగ్గజ వీఎఫ్ఎక్స్ కంపెనీలు ఈ సినిమా కోసం పనిచేస్తున్నాయి. అలా వీఎఫ్ఎక్స్ కోసమే రూ.270 కోట్లు కేటాయించగా.. రూ.150 కోట్లు అల్లు అర్జున్ కి రెమ్యూనరేషన్ గా ఇవ్వనున్నట్లు సమాచారం. మొత్తానికైతే భారీ బడ్జెట్లో రాబోతున్న ఈ సినిమాను ప్రస్తుతం AA 22xA6 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు ఈ సినిమాకు ఒక టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.


పిచ్చి పరాకాష్టకు చేరింది అంటున్న నెటిజన్స్..

అసలు విషయంలోకి వెళ్తే.. అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాకు ‘ఐకాన్’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట. గతంలో వేణుశ్రీరామ్(Venu Sri Ram) ఈ టైటిల్ తోనే అల్లు అర్జున్ తో మూవీ చేయాలనుకున్నాడు. కానీ అది కుదరలేదు. ఇప్పుడు అట్లీతో చేయబోయే మూవీకి అల్లు అర్జున్ ఇదే టైటిల్ పెట్టాలని సలహా ఇచ్చారట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశం కనిపిస్తోంది. ఇకపోతే ఈ విషయం తెలిసి పిచ్చి పరాకాష్టకు చేరడం అంటే ఇదేనేమో.. ఇన్ని రోజులు టీ షర్ట్స్, క్యాప్స్ పైన వేసుకొని తిరిగారు. ఇప్పుడు ఏకంగా టైటిల్ ని ఐకాన్ అని పెట్టబోతున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్స్. మరి మొత్తానికైతే ఇదే టైటిల్ ని ఫిక్స్ చేయబోతున్నారా లేక మరో టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు వస్తారా అన్నది తెలియాల్సి ఉంది.

ALSO READ:Vishnupriya – Prithvi : ఏంట్రా ఈ ఘోరం… స్టేజ్‌పైనే పృథ్వీ-విష్ణుకు శోభనం చేయిస్తారా ఏంటి..? 

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×