Allu Arjun…ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు డేవిడ్ వార్నర్ (David Warner) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన క్రికెట్ కంటే ఎక్కువగా అల్లు అర్జున్ స్టైల్ ని అనుకరిస్తూ చేసిన వీడియోల ద్వారా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు.. ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికారు. ఐపీఎల్ తో పాటు పలు లీగ్ లలో మాత్రం ఆడతానని ఆయన స్పష్టం చేశారు. ఐపీఎల్ లో సన్రైజర్స్ హైదరాబాద్ కి ఎన్నో ఏళ్లపాటు ఆడారు ..ఈయన నాయకత్వంలోనే ఒకసారి ఐపీఎల్ టైటిల్ ని కూడా ఎస్ఆర్హెచ్ అందుకుంది. ఇక ఫ్యాన్స్ అందరూ ఇతడిని ముద్దుగా వార్నర్ మామ అని పిలుస్తూ ఉంటారు. వార్నర్ కూడా తెలుగువారిని తన ఇంటి సభ్యులుగా భావిస్తారని చెప్పడంలో సందేహం లేదు.
డేవిడ్ వార్నర్ కు బన్నీ అంటే ప్రత్యేక అభిమానం..
తెలుగు ప్రేక్షకులే కాదు తెలుగు సినిమాలంటే కూడా వార్నర్ కి విపరీతమైన ఇష్టం. ముఖ్యంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంటే మాత్రం ఎనలేని అభిమానం. ఆయన సోషల్ మీడియా ఖాతా చూస్తే చాలు.. పుష్ప తో పాటు అల్లు అర్జున్ చిత్రాలకు చెందిన స్పూఫ్ వీడియోలు ఎక్కువగా దర్శనమిస్తాయి. సెంచరీ చేసినా ..హాఫ్ సెంచరీ తో అలరించిన ప్రతిసారి కూడా వార్నర్ తగ్గేదేలే అన్నట్టుగా గడ్డం కిందికి చెయ్యి పోనివ్వడాన్ని మనం ఎన్నోసార్లు చూశాము. ఇక వార్నర్ వంటి వీరాభిమానుల పట్ల అల్లు అర్జున్ కూడా అంతే అభిమానాన్ని చూపిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తూ ఉంటారు.. ఇక వీరిద్దరూ సందర్భాన్ని బట్టి ఒకరినొకరు అభినందించుకుంటూ ఉంటారు.
డేవిడ్ వార్నర్ కు బర్త్ డే విషెస్ చెప్పిన బన్నీ..
ఈ నేపథ్యంలోనే అనగా ఈరోజు అక్టోబర్ 27 డేవిడ్ వార్నర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా వార్నర్ కి అల్లు అర్జున్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అల్లు అర్జున్.. నా సోదరుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు.. అంటూ బర్తడే విషెస్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలియజేశారు.. ప్రస్తుతం ఇది కాస్త చాలా వైరల్ గా మారింది. దీనికి తోడు డేవిడ్ వార్నర్ కూడా థాంక్స్ బ్రదర్ అంటూ రిప్లై ఇచ్చాడు. ఏదేమైనా డేవిడ్ వార్నర్ ను బ్రదర్ అంటూ అల్లు అర్జున్ సంబోధించడంపై ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అల్లు అర్జున్ సినిమాలు..
అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. సుకుమార్ దర్శకత్వంలో రష్మిక మందన్న హీరోయిన్ గా, శ్రద్ధా కపూర్ ఐటమ్ సాంగ్ లో నటిస్తున్న చిత్రం ఇది. డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. భారీ అంచనాల మధ్య విడుదల అవుతున్న ఈ సినిమా కోసం అభిమానులే కాదు సినీ ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్, పోస్టర్స్ అన్నీ కూడా సినిమాపై అంచనాలను భారీగా పెంచేసాయి. ఇక ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఈ సినిమాపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.