Kamala Harris Trump| అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపించే కొద్ది ప్రత్యర్థులు కమలా హ్యారిస్, డొనాల్డ్ ట్రంప మధ్య మాటల యుద్దం తీవ్రమైంది. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు ట్రంప్ తాజాగా పెన్సిల్ వేనియా రాష్ట్రంలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంంలో ఆయన మాట్లాడుతూ.. కమలా హ్యారిస్ ని అమెరికా ప్రెసిడెంట్ గా ఎన్నుకుంటే ఆమె మూడో ప్రపంచ యుద్ధం పరిస్థితులు రాగలదని.. ఆమెను ఎన్నుకోవడం అమెరికా మొత్తానికి నష్టమని ఆయన హెచ్చరించారు. చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ లాంటి బలమైన నాయకులతో డీల్ చేయలేడంలో ఆమె విఫలమవుతుందని విమర్శించారు.
అమెరికా వార్తా సంస్థ ది హిల్ కథనం ప్రకారం.. ట్రంప్ ప్రచారంలో కమలా హ్యారిస్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. “కమలా హ్యారిస్ ను ప్రెసిడెంట్ గా ఎన్నుకోవడమంటే.. కోట్ల మంది అమెరికా పౌరల ప్రాణాలతో చెలగాటం ఆడటమే అవుతుంది. ఆమె అమెరికాని మూడో ప్రపంచ యుద్ధం వైపుకి తీసుకెళుతుందని గ్యారెంటీగా చెబుతున్నా.. ఎందుకంటే ఆమె ఆ పదవికి అర్హురాలు కాదు. ఆమెను ఎన్నుకుంటే అమెరికా సైనికులు, మన పిల్లలు ఒక పరాయి దేశంలో వెళ్లి యుద్ధాలు చేయాల్సి వస్తుంది.
Also Read: పుతిన్, ఎలన్ మస్క్ మధ్య రెండేళ్లుగా సంప్రదింపులు.. తైవాన్‌పై చైనా కుట్ర?
ఎప్పుడూ లేనంతగా అమెరికా ఇప్పుడు ప్రమాదకర యుద్ధానికి సమీపంగా ఉంది. నేను ఆ పరిస్థితులను నివారించగలను. నేను ఒకవేళ ప్రెసిడెంట్ గా ఉండి ఉంటే.. గత సంవత్సరం ఇజ్రాయెల్ పై హమాస్ చేసేది కాదు. ముందుగానే దాన్ని నివారించేందుకు చర్యలు తీసుకునే వాడిని.” అని చెప్పారు.
మరోవైపు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా భార్య మిచేల్ ఒబామా.. కమలా హ్యారిస్ తరపున మిచిగన్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం చేశారు. ఆమె డొనాల్డ్ ట్రంప్‌ని తీవ్రంగా విమర్శించారు. ట్రంప్ ది రెండు నాలుకల ధోరణి అని అన్నారు. అసలు ట్రంప్, హ్యారిస్ మధ్య ఇంత తీవ్ర పోటీ ఎలా ఉందో తనకు ఆశ్చర్యంగా ఉందని చెప్పారు. మిచిగాన్ లోని కలమజూలో ఆమె మాట్లాడుతూ.. “నాకు రాత్రివేళ నిద్రపట్టడం లేదు. అసలు ఏం జరుగుతోంది. కమలా హ్యారిస్ పనితీరుని అందరూ విమర్శిస్తున్నారు. కానీ ట్రంప్ చేసిన తప్పుల గురించి ఎవరూ మట్లాడడం లేదు. అతనిపై కోర్టులో చాలా కేసులున్నాయి. ఒక కేసులో దోషిగా కోర్టు తీర్పు కూడా ఇచ్చింది. మహిళలపై అత్యాచారం చేశాడు. ఒకవైపు కమలా హ్యారిస్ ఇంటర్‌వ్యూలను అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతుంటే అతను మాత్రం ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతాడు. ఏ ప్రశ్నకు సమాధానం సరిగా చెప్పడు. అలాంటి వాడి చేతికి మళ్లీ అధికారం ఇస్తారా? ఆలోచించి ఓటు వేయండి” అని ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు.
అమెరికా ఎన్నికలు నవంబర్ 5, 2024న జరుగనుండగా.. ఎన్నికల సర్వేలో ట్రంప్, కమలా హ్యారిస్ మధ్య గట్టిపోటీ నెలకొంది. ముఖ్యంగా మిచిగాన్, పెన్సిల్వేనియా రాష్ట్రాలు కీలకంగా మారాయి. దీంతో మిచెల్ ఒబామా మిచిగాన్ లో ట్రంప్ కు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. ఆమె జార్జియాలో కూడా హ్యారిస్ కోసం ప్రచారం చేస్తున్నారని స్థానిక మీడియా తెలిపింది.