Big Stories

Allu Arjun : హాయ్ నాన్న మూవీ పై ఐకానిక్ స్టార్ స్పందన .. వైరల్ అవుతున్న ట్వీట్ ..

Share this post with your friends

 Allu Arjun

Allu Arjun : నేచురల్ స్టార్ నాని,మృణాల్ ఠాకూర్ కాంబోలో వచ్చిన హాయ్ నాన్న మూవీ హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో పాటు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ సొంతం చేసుకుంటుంది. తండ్రి కూతుర్ల సెంటిమెంట్ నేపథ్యంతో సాగే ఈ మూవీ ప్రేక్షకుల మనసులను బాగా టచ్ చేస్తుంది. ఇందులో నాని తండ్రి పాత్రలో అద్భుతంగా నటించి అందరి ప్రశంసలు పొందుతున్నాడు.మృణాల్ ఠాకూర్ నటన ఈ చిత్రంలో ఎంతో అద్భుతంగా ఉంది. బేబీ కియారా.. తన అభినయంతో ప్రేక్షకుల మనసుని పిండేసింది.

మొత్తానికి హాయ్ నాన్న మూవీ ప్రతి ఒక్కరి మనసులోని ఎమోషన్స్‌ని హాయ్ అంటూ పలకరిస్తుంది. అందుకే ప్రస్తుతం ఈ మూవీ మంచి సక్సెస్ అందుకుంటుంది అని అందరూ భావిస్తున్నారు. ఈ మూవీ గురించి ఇప్పటికే పలువురు సెలబ్రిటీస్ సోషల్ మీడియాలో స్పందించారు. కుటుంబ విలువలను చాటి చెప్పే విధంగా, మనసుకు హత్తుకునే కథనంతో సాగే ఈ మూవీని ప్రతి ఒక్కళ్ళు ఇష్టపడుతున్నారు. తాజాగా పుష్ప స్టార్ అల్లు అర్జున్ ఈ మూవీ పై స్పందించాడు. ఈ సినిమా గురించి ఒక సుదీర్ఘమైన పోస్ట్ కూడా పెట్టాడు. ఐకానిక్ స్టార్ పెట్టిన ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.

హాయ్ నాన్న టీంకు అభినందనలు తెలియజేసిన అల్లు అర్జున్.. ఈ మూవీ ఎంతో మధురంగా ఉందని. నిజంగా మనసుకు హత్తుకునే విధంగా ఉంది అని మెచ్చుకున్నారు. అలాగే ఈ మూవీలో సోదరుడు నాని యాక్టింగ్ అదుర్స్ అని కాంప్లిమెంట్ ఇవ్వడం తో అందించిన రైటర్ కి కూడా అభినందనలు తెలియజేశారు. మృణాల్ గురించి మాట్లాడుతూ అల్లు అర్జున్.. ఆమె స్వీట్ నెస్ స్క్రీన్ పై కూడా కనిపిస్తోంది.. అది మీలాగే అందంగా ఉంది అని అన్నాడు.

మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయినా బేబీ కియారా .. నీ క్యూట్ ప్లస్ మా అందరి హృదయాలను టచ్ చేసింది.. షూటింగ్ పూర్తయింది ఇక స్కూల్ కి వెళ్ళు.. అని జోక్ చేశాడు. అలాగే ఈ మూవీ కోసం పనిచేసిన ఇతర ఆర్టిస్టులు ,టెక్నీషియన్స్ ,కెమెరామెన్ ఇలా ప్రతి ఒక్కరికి తన అభినందనలు తెలియజేశాడు బన్నీ. అలాగే డైరెక్టర్ శౌర్యువ్.. మొదటి సినిమా అయినప్పటికీ ఎంతో అద్భుతంగా తెరకెక్కించాడని మెచ్చుకున్నాడు. హాయ్ నాన్న మూవీ కేవలం తండ్రులనే కాకుండా కుటుంబంలోని ప్రతి సభ్యుడు హృదయాన్ని హత్తుకునే విధంగా ఉంది అంటూ బన్నీ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

.

.


Share this post with your friends

ఇవి కూడా చదవండి

Latest News