Revanth Reddy Humanity | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల మనిషి అనే మరోసారి రుజువైంది. ఇప్పటికే ప్రజల సమస్యలపై తనను నేరుగా కలుసుకునే విధంగా ప్రజాదర్బార్ ఏర్పాటు చేసి రాష్ట్రమంతా సంచలనం సృష్టించిన రేవంత్ రెడ్డి. జనం మధ్యలో ఒక మహిళ తన సాయం కోరి కేకలు వేస్తే.. వెంటనే వెళ్లి ఆమె సమస్యను పరిష్కరించారు. ఇప్పుడా వీడియో తెగ వైరల్ అవుతోంది.

Revanth Reddy Humanity | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల మనిషి అనే మరోసారి రుజువైంది. ఇప్పటికే ప్రజల సమస్యలపై తనను నేరుగా కలుసుకునే విధంగా ప్రజాదర్బార్ ఏర్పాటు చేసి రాష్ట్రమంతా సంచలనం సృష్టించిన రేవంత్ రెడ్డి. జనం మధ్యలో ఒక మహిళ తన సాయం కోరి పిలిస్తే.. వెంటనే వెళ్లి ఆమె సమస్యను పరిష్కరించారు. ఇప్పుడా వీడియో తెగ వైరల్ అవుతోంది.
ఆదివారం యశోద ఆస్పత్రిలో మాజీ సీఎం కేసీఆర్‌ను పరామర్శించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లారు. ఆ సమయంలో అక్కడ జనం మధ్య నుంచి ఒక మహిళ ”రేవంత్ అన్నా.. మీతో మాట్లాడాలి” అని గట్టిగా పిలిచింది. ఎవరో తనను పిలిచారని గమనించిన సీఎం వెంటనే ఆమెను గుర్తించి.. ఆమెకు వచ్చిన సమస్యను విన్నారు.
ఆ మహిళ పాప ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.. వైద్యానికి అయ్యే ఖర్చుకు ఆర్థిక సాయం చేయాలని ఆమె రేవంత్ రెడ్డిని కోరింది. వెంటనే ఆమె సమస్య పరిష్కరించాలంటూ సిఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. సోషల్ మీడియాలో ఈ వీడియో బాగా వైరల్ అవుతోంది.