BigTV English

Allu Arjun : హమ్మయ్యా… భాయ్‌కి ఇప్పుడు తెలిసొచ్చింది… మళ్లీ ఆ ఇష్యూలు జరగకుండా షాకింగ్ నిర్ణయం

Allu Arjun : హమ్మయ్యా… భాయ్‌కి ఇప్పుడు తెలిసొచ్చింది… మళ్లీ ఆ ఇష్యూలు జరగకుండా షాకింగ్ నిర్ణయం

Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) స్టార్ ఇమేజ్ ‘పుష్ప’ (Pushpa 2) మూవీతో ఒక్కసారిగా ప్రపంచం నలుమూలలకు పాకిన సంగతి తెలిసిందే. ఈ మూవీ తర్వాత బన్నీకి కేవలం ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఏర్పడ్డారు. పైగా టాలీవుడ్ లో ఫస్ట్ నేషనల్ అవార్డు అందుకున్న నటుడిగా చరిత్రను సృష్టించారు బన్నీ. కానీ ఈ ఇమేజ్ మొత్తాన్ని ‘పుష్ప 2’ వివాదం కాల రాసింది. దీంతో అల్లు అర్జున్ నెక్స్ట్ నుంచి తను చేయబోయే సినిమాల కోసం ఒక కీలక నిర్ణయం తీసుకున్నాడనే విషయం ప్రస్తుతం ఫిలిమ్ నగర్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.


బన్నీ కోసం స్పెషల్ పర్సన్…

‘పుష్ప 2′(Pushpa 2) మూవీ ప్రమోషన్స్ భారీ స్థాయిలో జరిగాయి. సినిమా ఇండస్ట్రీ సైతం ఆశ్చర్యపోయే లెవెల్ లో కలెక్షన్స్ వచ్చాయి. మిగతా భాషల సంగతి పక్కన పెడితే, ఈ మూవీకి బాలీవుడ్లో బాగానే కలెక్షన్స్ వచ్చాయి. అయితే ఇంతటి సక్సెస్ ని అల్లు అర్జున్  మాత్రం ఎంజాయ్ చేయలేకపోయాడు. ఈ మూవీ రిలీజ్ సందర్భంగా హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సంధ్య థియేటర్ దగ్గర జరిగిన ఘటన ఆయన సంతోషంపై నీళ్లు చల్లింది.


ఓవైపు మూవీ వందల కోట్లు కొల్లగొడుతుంటే, మరోవైపు అల్లు అర్జున్ కోర్టులు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వచ్చింది. అయితే ఈ వివాదం నేపథ్యంలోనే అల్లు అర్జున్ తన కమ్యూనికేషన్ ప్రాసెస్ ని క్లియర్ గా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారట. అందులో భాగంగానే అల్లు అర్జున్ ఒక స్పోక్స్ పర్సన్ ని నియమించుకున్నారని తెలుస్తోంది.

ఇదివరకు అల్లు అర్జున్ తన ప్రాజెక్టుల వివరాల గురించి సోషల్ మీడియాలో అఫీషియల్ గా లేదంటే ఇతర ఇంటర్వ్యూలలో అందరూ స్టార్ హీరోలలాగే మాట్లాడేవారు. కానీ ఇప్పుడు మాత్రం అల్లు అర్జున్ తరఫున మాట్లాడే మరో అధికార ప్రతినిధిని నియమించి, టాలీవుడ్ లో కొత్త ట్రెండును షురూ చేయబోతున్నారని తెలుస్తోంది.

ఇదే కారణమా ?

ఈ స్పోక్స్ పర్సన్ అల్లు అర్జున్ కొత్త సినిమాలకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తారన్నమాట. అంతేకాకుండా సంప్రదింపులకు కూడా ముందుగా ఈ స్పోక్స్ పర్సన్ తోనే చేయాలి. మార్చ్ నుంచి సదరు స్పోక్స్ పర్సన్ డ్యూటీలోకి దిగుతారని అంటున్నారు. గీతా ఆర్ట్స్ నిర్మాత బన్నీ వాసు ‘తండేల్’ మూవీ ప్రమోషన్ల సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించడంతో, వైరల్ అవుతుంది.

‘పుష్ప 2’ సక్సెస్ తర్వాత అల్లు అర్జున్ విషయంలో జరిగిన వివాదాలు, కమ్యూనికేషన్ పై వివాదాల నేపథ్యంలో ఆయన ఇలాంటి నిర్ణయం తీసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. అల్లు అర్జున్ తనను తాను ఒక బ్రాండ్ గా మలుచుకోవడంపై దృష్టి పెడుతున్నాడని, అందుకే తన వైపు కమ్యూనికేషన్ స్పష్టంగా, క్లియర్ గా ఉండాలని కోరుకుంటున్నాడని అంటున్నారు. అందుకేనట ఈ స్పోక్స్ పర్సన్.

కాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో బన్నీ నెక్స్ట్ మూవీ చేయబోతున్నారు. ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు చురుకుగా జరుగుతున్నాయి. 2025 మార్చిలో మూవీ పై అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతుందని తెలుస్తోంది.

Tags

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×