Masthan Sai : న్యూడ్ వీడియోల కేసులో అరెస్ట్ అయిన మస్తాన్ సాయి కేసులో రోజు రోజుకూ ఉచ్చు బిగిస్తుంది. ఇప్పటికే మస్తాన్ సాయికు సంబంధించిన పలు ఆధారాలు లావణ్య బయటపెట్టగా తాజాగా మరో ఆడియో లీక్ అయ్యింది.
మస్తాన్ సాయికు సంబంధించిన ఓ ఆడియో లీక్ అయింది. ఇందులో బాధిత మహిళకు మస్తాన్ సాయికు మధ్య తీవ్ర వివాదం జరిగింది. నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశావంటూ ఆ మహిళ ఏడుస్తూ అరుస్తుంటే.. ఆమెను బూతులు తిడుతూ తీవ్ర అసహనానికి గురయ్యాడు. ఎందరో అమ్మాయిలను మోసం చేశావని, అన్ని విధాలా వాడుకున్నావని తెలిపింది. నా వీడియాలు నీ దగ్గర పెట్టుకొని మోసం చేశావని.. ఇంకా ఎంతమంది జీవితాలతో ఆడుకుంటావని ప్రశ్నిస్తుంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశావని.. వీడియోలు రికార్డ్ చేసి చాలా మందికి పంపించావని.. నా ఇంట్లో వాళ్లను సైతం మోసం చేశావని తెలిపింది. నీ వల్ల నా ఇంట్లో వారిని సైతం మోసం చేశానని.. నమ్మిందుకు ఇంతగా మోసం చేస్తావని అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ గొడవలో మస్తాన్ సాయి బూతులు తిడుతూ ఆ అమ్మాయిని నిందించాడు. ఇక ఈ ఆడియో విన్న వాళ్లంతా ఈ నరరూప రాక్షసుడిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.
ALSO READ : మూడు భాగాలు… మహేష్ మూవీ మెయిన్ స్టోరీ ఇదే