BigTV English

MMTS Trains: చర్లపల్లి నుంచి మరిన్ని MMTS రైళ్లు, ప్రయాణీకులకు సౌత్ సెంట్రల్ రైల్వే గుడ్ న్యూస్

MMTS Trains: చర్లపల్లి నుంచి మరిన్ని MMTS రైళ్లు, ప్రయాణీకులకు సౌత్ సెంట్రల్ రైల్వే గుడ్ న్యూస్

ప్రస్తుతం చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ఒక MMTS రైలు నడుస్తుండగా, త్వరలో మరిన్ని రైళ్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. నాలుగైదు నెలల్లోనే మరిన్ని రైలు సర్వీసులు ప్రారంభించనున్నట్లు తెలిపింది. చర్లపల్లి టెర్మినల్‌ నుంచి నడిపే ఎక్స్ ప్రెస్ రైళ్లకు అనుగుణంగా కాచిగూడ, సికింద్రాబాద్, హైదరాబాద్‌ స్టేషన్లను లింక్ చేస్తూ సబర్బన్‌ సేవలు అందించనున్నారు. ఇందుకోసం త్వరలో మరిన్ని MMTS రైళ్లను చర్లపల్లి నుంచి నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌ జైన్‌ వెల్లడించారు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ పునర్నిర్మాణ పనులు కొనసాగిస్తున్న నేపథ్యంలో 10 జతల రైళ్లను చర్లపల్లి నుంచి నడిపించనున్నట్లు తెలిపారు. ఆ రైళ్లకు అనుగుణంగా MMTS సర్వీసులు ఉంటాయని తెలిపారు.


ప్రయాణీకుల డిమాండ్ కు అనుగుణంగా MMTS రైళ్లు

సికింద్రాబాద్ స్టేషన్ పునరాభివృద్ధి పనులకు తోడుగా కాచిగూడ, హైదరాబాద్‌ స్టేషన్లపై ఒత్తిడి మరింత తగ్గించేలా రైల్వే అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే చర్లపల్లి నుంచి మరిన్ని MMTS రైళ్లను నడపాలని నిర్ణయించారు. చార్మినార్, గోరఖ్‌ పూర్‌ ఎక్స్‌ ప్రెస్‌లను మార్చి నుంచి చర్లపల్లి టెర్మినల్ నుంచి నడిపే అవకాశం ఉంది. మే చివరి వారం వరకు 8 జతల రైళ్లను నడిపేందుకు ప్రణాళికలు రెడీ చేస్తున్నారు. చర్లపల్లి నుంచి ప్రయాణీకులను హైదరాబాద్ లోని పలు ప్రాంతాలకు చేర్చేందుకు మరిన్ని MMTS రైళ్లను నడిపే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రయాణీకుల డిమాండ్‌ కు అనుగుణంగా MMTS రైళ్లు నడుపుతామని అరుణ్‌ కుమార్‌ జైన్‌ వెల్లడించారు.


యాదగిరిగుట్టకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్

ఇక యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకునేందుకు వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. హైదరాబాద్ నుంచి కేవలం రూ. 20 ఖర్చుతో గంటలోగా యాదగిరిగుట్ట చేరుకోవచ్చని తెలిపింది. ఘట్‌ కేసర్‌- యాదగిరిగుట్ట MMTS లైన్ డీపీఆర్ సిద్ధం చేసినట్లు సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం అరుణ్‌ కుమార్‌ వెల్లడించారు. ఈ రైల్వే లైన్‌ కు రూ.650 కోట్లు ఖర్చవుతాయన్నారు. త్వరలోనే పనులు ప్రారంభిస్తామని చెప్పారు.

యాదగిరిగుట్టకు MMTS రైళ్లు నడపాలని ఎప్పటి నుంచో భక్తుల డిమాండ్

యాదగిరిగుట్టకు MMTS ట్రైన్లు నడపాలని భక్తులు చాలా కాలంగా రైల్వే అధికారులను కోరుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో MMTS రెండోదశ పనులు కొనసాగుతున్నాయి. MMTS రైళ్లను యాదగిరిగుట్ట సమీపంలోని రాయగిరి స్టేషన్‌ వరకు పొడగించాలని 8 ఏండ్ల కిందట నిర్ణయించారు. ప్రస్తుతం మౌలాలి నుంచి ఘట్‌ కేసర్‌ వరకు MMTS రైళ్లు అందుబాటులో ఉన్నాయి. అక్కడి నుంచి యాదగిరిగుట్టకు కొత్తగా మూడో లైను వేయాల్సి ఉంది. టెండర్ ప్రక్రియ ఆలస్యం అయిన నేపథ్యంలో ఇప్పటికీ ఈ ప్రాజెక్టు ముందుకు సాగలేదు. తాజాగా.. డీపీఆర్ సిద్ధమవుతోందని సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం తెలిపారు.

అటు సికింద్రాబాద్‌-విశాఖపట్నం మధ్య ప్రస్తుతం 20, 16 కోచ్‌ల సామర్థ్యంతో వందే భారత్‌ రైళ్లు నడుస్తున్నాయని సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం అరుణ్‌ కుమార్‌ తెలిపారు. సికింద్రాబాద్‌- గుంటూరు మార్గంలో డబ్లింగ్‌ పనులు పూర్తయితే మరికొన్ని రైళ్లు నడిపే వెసులుబాటు కలుగుతుందన్నారు. అటు రీజినల్‌ రింగ్‌ రైల్‌ ప్రాజెక్టుకు సంబంధించి ప్రస్తుతం డీపీఆర్‌ సిద్ధం అవుతుందన్నారు. కేంద్రం ఆమోదం తర్వాత ప్రకటన వచ్చే అవకాశం ఉందన్నారు.

Read Also: మహిళ రైల్వే ట్రాక్ దాటుతుంటగా దూసుకొచ్చిన రైలు.. ఒక్కసారిగా షాక్..

Related News

Secunderabad trains: మళ్లీ రద్దీగా మారనున్న సికింద్రాబాద్ స్టేషన్.. ఆ రైళ్లు మళ్లీ వచ్చేస్తున్నాయ్!

Rail Project in TG: తెలంగాణపై కేంద్రం వరాల జల్లు, ఏకంగా రూ. 5 వేల కోట్ల రైల్వే ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్!

Manwal station: హోటల్ అనుకోవద్దు.. ఇదొక రైల్వే స్టేషన్.. దీని వెనుక పెద్ద కథే ఉంది!

Visakhapatnam updates: విశాఖ ప్రజలకు శుభవార్త.. ఆ రూట్ లో వందే భారత్ ట్రైన్.. గంటల జర్నీకి ఇక సెలవు!

Artificial Beach: హైదరాబాద్ కు బీచ్ వచ్చేసింది, ఇక ఎంజాయే ఎంజాయ్!

Top 5 Malls in Hyderabad: హైదరాబాద్ లో టాప్ 5 మాల్స్, ఏడాదంతా డిస్కౌంట్లే డిస్కౌంట్లు!

Big Stories

×