BigTV English

Allu Arjun : ఉపాస‌న సీమంతం వేడుక‌ల్లో అల్లు అర్జున్.. ఫొటో వైర‌ల్

Allu Arjun : ఉపాస‌న సీమంతం వేడుక‌ల్లో అల్లు అర్జున్.. ఫొటో వైర‌ల్

Allu Arjun : మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్ మ‌ధ్య ముందులా లేదు. ఇద్ద‌రి మ‌ధ్య దూరం పెరిగిందంటూ వార్త‌లు వినిపిస్తోన్న సంగ‌తి తెలిసిందే. రామ్ చ‌ర‌ణ్ బ‌ర్త్ డే రోజున బ‌న్నీ విష్ చేయ‌క‌పోవ‌టం వంటి కారణాలతో సోషల్ మీడియాలో మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య ఏదో ఉందంటూ న్యూస్ వ‌చ్చేసింది. అయితే ఈ వార్త‌ల‌పై ఇటు మెగా ఫ్యామిలీ హీరోలు కానీ, అల్లు అర్జున్ కానీ రియాక్ట్ కాలేదు. అయితే ఇద్ద‌రికీ స‌న్నిహితులైన వ్యక్తులు మాత్రం అలాంటిదేమీ లేదని అంటున్నారు. ఈ నేప‌థ్యంలో రామ్ చ‌ర‌ణ్‌స‌తీమ‌ణి ఉపాస‌న త్వ‌ర‌లోనే మెగా వార‌సుడికి జ‌న్మ‌నివ్వ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. దీంతో కుటుంబ స‌భ్యులు సంతోషంలో మునిగి తేలుతున్నారు.


రీసెంట్‌గా ఉపాస‌న సీమంతం వేడుక‌ల‌ను నిర్వ‌హిస్తున్నారు. దుబాయ్ బేబీ ష‌వ‌ర్ కార్య‌క్ర‌మంత త‌ర్వాత మ‌రో రెండు వేడుక‌లు హైద‌రాబాద్‌లో జ‌రిగాయి. ఆదివారం జ‌రిగిన బేబీ ష‌వ‌ర్ కార్య‌క్ర‌మంలో మెగాస్టార్ చిరంజీవి కుటుంబం స‌భ్యులు, ఉపాస‌న కుటుంబ స‌భ్యులు, స‌న్నిహితులు పాల్గొన్నారు. అందులో భాగంగా అల్లు అర్జున్ కూడా ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఐకాన్ స్టార్ బేబీ షవ‌ర్ ఈవెంట్‌కు రావ‌టంతో మెగా ఫ్యామిలీతో అల్లు అర్జున్‌కి మ‌ధ్య విబేదాలున్నాయ‌ని వ‌స్తున్న వార్త‌ల‌కు చెక్ పెట్టిన‌ట్లు అయ్యింది. ఈ కార్య‌క్ర‌మం త‌ర్వాత ఉపాస‌న‌తో ఉన్న ఫొటోను అల్లు అర్జున్ త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేసి రామ్‌చ‌ర‌ణ్‌, ఉపాస‌న దంప‌తుల‌కు అభినంద‌న‌లు తెలిపారు.

సినిమాల విషయానికి వ‌స్తే ప్రస్తుతం అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ పుష్ప 2 ది రూల్ సినిమాలో నటిస్తున్నారు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తం శెట్టి మీడియా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుంది. మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ విలన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.


Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×