BigTV English

Unstoppable with NBK: సీజన్ 4 మొదటి గెస్ట్ గా అల్లు అర్జున్.. నంద్యాల టాపికే హైలైట్.. ?

Unstoppable with NBK: సీజన్ 4 మొదటి గెస్ట్ గా అల్లు అర్జున్.. నంద్యాల టాపికే హైలైట్.. ?

Unstoppable with NBK: నందమూరి  బాలకృష్ణ.. ఈ పేరు వినగానే అందరికి గుర్తొచ్చేది పవర్. ఆయన పేరు చెప్తే ఎక్కడలేని ధైర్యం వస్తుంది అని చెప్పుకొస్తారు అభిమానులు. ఇక బాలయ్య గురించి చెప్పాలంటే  మనిషి కటువుగా కనిపించినా.. మనసు మాత్రం వెన్న. బాలయ్య . అభిమానులను తిడతాడు.. సరిగ్గా మాట్లాడాడు.. మనుషులను హ్యాండిల్ చేయడం రాదు.  అన్ స్టాపబుల్ షో రాకముందు వరకు ఫ్యాన్స్ మాత్రమే కాదు ఇండస్ట్రీ  మొత్తం అనుకున్న మాట ఇదే.


ఆహా ఓటీటీలో అన్ స్టాపబుల్ షో అనౌన్స్ చేసి, నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్నాడు అని చెప్పగానే.. ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు. ఎవరైనా బాలయ్య ముందు నిలబడగలరా.. ? అసలు ఆయనకు యాంకర్ గా మాట్లాడడం తెలుసా.. ? అని విమర్శించారు. షో మొదటి ఎపిసోడ్ .. మోహన్ బాబు తో బాలకృష్ణ నవ్వుతూ సెటైర్లు వేయడం.. నిదానంగా రాజకీయ విషయాలు బయటకు లాగడం, చిన్నపిల్లాడిలా మారి మోహన్ బాబు తో కలిసి గేమ్ ఆడించడం లాంటివి చూసి అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఏంటి.. బాలయ్యలో ఈ యాంగిల్ కూడా ఉందా అని నోళ్లు వెళ్ళబెట్టారు.

అప్పటి నుంచి అన్ స్టాపబుల్ గా బాలయ్య హోస్ట్ గా కొనసాగుతూనే  వస్తున్నాడు. ఇప్పటివరకు ఎంతోమంది సెలబ్రిటీలను తన షోలో నవ్వించాడు.. ఆటలు ఆడించాడు. రెండు సీజన్స్  మంచి విజయాన్ని అందుకున్నాయి.. ఆ తరువాత స్పెషల్ సీజన్ గా తక్కువమంది సెలబ్రిటీలతోనే మూడో సీజన్ ముగిసింది.  పవన్ కళ్యాణ్, ప్రభాస్, మహేష్ బాబు,  అల్లు అర్జున్ , చంద్రబాబు.. ఇలా ఎంతోమంది స్టార్ హీరోలు.. బాలయ్య ఆడించే ఆటలో పాల్గొన్నారు.


ఇక ఇప్పుడు మరెంతో మంది సెలబ్రిటీలు అన్ స్టాపబుల్ లో పాల్గొనడానికి రాబోతున్నారు. అవును.. త్వరలోనే అన్ స్టాపబుల్  సీజన్ 4 మొదలుకానుంది. ఇక అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సీజన్ మొదటి గెస్ట్ గా అల్లు అర్జున్ రాబోతున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే అన్ స్టాపబుల్ షూట్ లో బాలయ్య- బన్నీ పాల్గొన్నారట. అల్లు అర్జున్ .. పుష్ప సమయంలో మొదటి ఈ షోలో పాల్గొన్నాడు. ఆ ఎపిసోడ్ లో బాలయ్య చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. సుకుమార్, రష్మిక , బన్నీలతో బాలయ్య ఒక ఆట ఆడుకున్నాడు. ఇక ఇప్పుడు అదే చిత్ర బృందం  మరోసారి ఈ షోలో సందడి చేయనుంది.

డిసెంబర్ లో పుష్ప 2 రిలీజ్ కు రెడీ అవుతున్న విషయం తెల్సిందే. ఈ ప్రమోషన్స్ లో భాగంగా  అల్లు అర్జున్.. అన్ స్టాపబుల్ సీజన్ 4 లో పాల్గొంటున్నాడు. అయితే పుష్ప సమయంలో బన్నీ.. ఎలాంటి రాజకీయ వివాదాల్లో ఇరుక్కోలేదు కాబట్టి  ఆ ఎపిసోడ్ అంతా సాఫీగా నవ్వులతో సాగిపోయింది. అయితే ఈసారి అంత సాఫీగా సాగిపోలేదని తెలుస్తోంది.  బాలకృష్ణ.. ఈ షో లో అల్లు అర్జున్ రాజకీయ వివాదం గురించి మాట్లాడినట్లు సమాచారం.

ఇక ఈ ఏడాది ఎన్నికల ప్రచారంలో భాగంగా అల్లు అర్జున్.. జనసేన పవన్ కళ్యాణ్ తరుపున కాకుండా.. వైసీపీ నేత కు సపోర్ట్ గా నంద్యాల వెళ్లిన విషయం తెల్సిందే. ఆ పర్యటన బన్నీ జీవితాన్ని అతలాకుతలం చేసింది. ఎన్నో ట్రోల్స్.. మరెన్నో విమర్శలు అందుకున్నాడు. ఈ వివాదం తరువాత బన్నీ.. సోషల్ మీడియాలో ఏం చేసినా.. ఆ పర్యటన గురించే మాట్లాడడం మొదలుపెట్టారు. దీనివలన పుష్ప 2 మీద నెగిటివిటీ  ఎక్కువ అయ్యింది.

నంద్యాల పర్యటన లాంటి సెన్సిటివ్ టాపిక్ ను ఈ షో లో బాలయ్య తీసుకొచ్చాడట. దానికి బన్నీ కూడా సమాధానమిచ్చాడని సమాచారం.  ఈ విషయం తెలియడంతో.. ఎప్పుడెప్పుడు ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతుందా.. ? అని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.  అంటున్నాడా సమాచారం ప్రకారం దసరాకు ప్రోమో ను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. మరి ఇందులో ఎంతవరకు నిజముంది అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×