E-Paper
Advertisement

Allu Arjun : ధోని భార్య ఎఫెక్ట్..! అల్లు అర్జున్ న్యూ రికార్డు.. థ్రెడ్స్ లోనూ తగ్గేదేలే..

Allu Arjun : ధోని భార్య ఎఫెక్ట్..! అల్లు అర్జున్ న్యూ రికార్డు.. థ్రెడ్స్ లోనూ తగ్గేదేలే..
Advertisement
Allu Arjun latest news

Allu Arjun latest news(Celebrity news today): తనదైన స్టైల్ తో యూత్ ఫాలోయింగ్ ను తెచ్చుకున్న హీరో అల్లు అర్జున్. పాన్ ఇండియా మూవీ పుష్పతో వరల్డ్ వైడ్ గా ఫ్యాన్స్ ను సంపాదించాడు. ఐకాన్ స్టార్ గా మారి తన రేంజ్ ను మరింత పెంచుకున్నాడు. సోషల్ మీడియాలో బన్నీ క్రేజే వేరు. కోట్ల మంది ఈ మెగా హీరోను ఫాలో అవుతున్నారు. దీంతో సోషల్‌ మీడియాలో మరో రికార్డు క్రియేట్‌ చేశాడు అల్లు అర్జున్.

ఇటీవల ట్విటర్‌కు పోటీగా థ్రెడ్స్‌ యాప్ వచ్చింది. ఈ యాప్‌లోనూ అల్లు అర్జున్‌ హవా కొనసాగుతోంది. అతి తక్కువ సమయంలోనే వన్ మిలియన్‌ ఫాలోవర్స్‌ను సొంతం చేసుకున్నాడు. ఇండియన్ యాక్టర్స్ లో ఇంత వరకు ఎవరికీ థ్రెడ్స్ లో మిలియన్ ఫాలోవర్స్ లేరు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ నటుడిగా బన్నీ అరుదైన రికార్డు క్రియేట్ చేశాడు. దీంతో మెగా ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్‌ చేస్తున్నారు.

Advertisement

‘ఎక్కడైనా తగ్గేదేలే’, ‘కలెక్షన్‌లతోనే కాదు.. సోషల్ మీడియాలోనూ చరిత్ర సృష్టించగలడు’ అంటూ బన్నీ ఉద్దేశించి కామెంట్స్‌ చేస్తున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్‌ పుష్ప-2లో నటిస్తున్నాడు. ‘పుష్ప : ది రైజ్‌’కు కొనసాగింపుగా పుష్ప : ది రూల్ తెరకెక్కుతోంది. షూటింగ్ వేగంగా సాగుతోంది. సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.

ప్రస్తుతం అల్లు అర్జున్‌ పేరు ట్రెండింగ్‌లోకి రావడానికి మరో కారణం కూడా ఉందని అంటున్నారు. టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేందర్ సింగ్ ధోని వైఫ్ సాక్షి ‘లెట్స్‌ గెట్‌ మ్యారీడ్‌’ అనే మూవీని నిర్మించారు. ఈ సినిమా ప్రమోషన్స్‌ కోసం ఆమె హైదరాబాద్‌ వచ్చారు. తాను అల్లు అర్జున్‌కు వీరాభిమానినని సాక్షి తెలిపారు. బన్నీ నటించిన ప్రతి సినిమాను చూస్తానని చెప్పారు. ఓటీటీ, యూట్యూబ్ ల్లో అల్లు అర్జున్ సినిమాలను చూస్తానని చెప్పుకొచ్చారు. ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి. దీంతో థ్రెడ్స్ లో అల్లు అర్జున్ కు ఫాలోవర్స్ విపరీతంగా పెరిగారని అంటున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×