Pushpa 2 Peelings Song :ప్రస్తుతం తెలుగు హీరోస్ అంతా కూడా పాన్ ఇండియా హీరోస్ గా మారిపోతున్నారు. ఇలా మారడం వల్ల తెలుగు సినిమా స్థాయి పెరుగుతుంది. తెలుగు సినిమా మార్కెట్ కూడా పెరుగుతుంది. అయితే తెలుగు ప్రేక్షకులు ఒక హీరో నుంచి ఇష్టపడే చాలా అంశాలు దూరమైపోతున్నాయి అని చెప్పాలి. ప్రభాస్ విషయానికి వస్తే ప్రభాస్ కామెడీ టైమింగ్ కు చాలా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ చేసిన అన్ని సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లోనే విడుదలయ్యాయి. కానీ ప్రభాస్ లోని ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ను చాలా మంది ఆడియన్స్ మిస్ అయిపోయారు. ఇక ప్రస్తుతం చాలామంది ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమా పుష్ప 2. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఇదివరకే వీరి కాంబినేషన్లో వచ్చిన పుష్ప సినిమా ఏ స్థాయి హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
అయితే పుష్ప సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయినా కూడా ప్రేక్షకుల్ని, అభిమానుల్ని నిరాశపరిచిన కొన్ని అంశాలు కూడా ఉన్నాయి. బేసిగ్గా అల్లు అర్జున్ అంటే డాన్సులకు పెట్టింది పేరు. అల్లు అర్జున్ ఎంత బాగా డాన్స్ చేస్తాడో చాలామందికి తెలిసిన విషయమే. బన్నీ డాన్స్ చేస్తుంటే అలా చూడాలనిపిస్తుంది. ఇక పుష్ప సినిమా విషయానికి వస్తే ఆ సినిమాలో అల్లు అర్జున్ ఆటిట్యూడ్, వాయిస్ మాడ్యులలేషన్, డైలాగ్ డెలివరీ ఇవన్నీ బానే వర్కౌట్ అయ్యాయి. కానీ ఆ సినిమాలు అల్లు అర్జున్ డాన్స్ బీట్ సాంగ్ ఒకటి కూడా లేదు. ఫాస్ట్ బీట్ సాంగ్ ఉన్నా కూడా అల్లు అర్జున్ (Allu Arjun) డాన్స్ కి పెద్దగా స్కోప్ లేకుండా పోయింది. ఊ అంటావా మామ పాటలు మొత్తం అంతా సమంతా (Samantha)ను మాత్రమే చూడడం మొదలుపెట్టారు. ఇక ప్రస్తుతం పుష్ప 2 లో అటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్లు అనిపిస్తుంది చిత్ర యూనిట్.
Also Read : Malavika Mohanan : రాజా సాబ్ మూవీ కంప్లీట్ డీటెయిల్స్ చెప్పేసింది
ఇదివరకే పుష్ప సినిమా నుంచి మూడు పాటలు విడుదలయ్యాయి. ఈ మూడు పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్ గా రిలీజ్ అయిన శ్రీ లీలా (Sreeleela) ఐటమ్ సాంగ్ కి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇక ప్రస్తుతం ఈ సినిమా నుంచి ఫీలింగ్స్ అనే పాటను విడుదల చేశారు. అల్లు అర్జున్ నుంచి అభిమానులు, ప్రేక్షకులు ఏదైతే కోరుకుంటారో ఆ స్థాయి డాన్స్ ను ఈ పాటలో వేశాడు అల్లు అర్జున్. రష్మిక, అల్లు అర్జున్ గ్రేస్ ఈ పాట లో నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. అల్లు అర్జున్ గ్రేస్ ని పర్ఫెక్ట్ గా మ్యాచ్ చేసింది రష్మిక. దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) కంపోజ్ చేసిన, ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యాన్ని అందించారు. ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసారు.