Malavika Mohanan : మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న సినిమా రాజా సాబ్. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తుంది. చాలా రోజుల తర్వాత ఈ సినిమాలో ఒక ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ను చూపించబోతున్నాడు ప్రభాస్ (Prabhas). దర్శకుడు మారుతి (Maruthi) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మారుతి సినిమాల్లో ఉన్న ప్లస్ పాయింట్ కామెడీ. ఈ రోజుల్లో సినిమా నుంచి మొదలుపెడితే మారుతి దర్శకత్వంలో చివరగా వచ్చిన పక్కా కమర్షియల్ సినిమా వరకు కామెడీ కి పెద్ద స్కోప్ ఉంటుంది. ఇక మారుతి విషయానికొస్తే ఇప్పటివరకు మారుతి కెరియర్ లో ఒక డిజాస్టర్ సినిమా కూడా లేదు. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ సినిమా చేస్తున్నాడు అన్నప్పుడు చాలామంది ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచారు. అయితే ఒక ఇంటర్వ్యూలో మారుతి మాట్లాడుతూ నేను ప్రభాస్ తో సినిమా చేస్తే బుజ్జిగాడు, డార్లింగ్ కైండ్ ఆఫ్ సినిమాను చేస్తాను అని ఇదివరకే అనౌన్స్ చేశాడు. చెప్పిన మాదిరిగానే హర్రర్ కామెడీతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.
ఈ సినిమాలో మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ విషయం చాలామందికి తెలిసింది కానీ ఇప్పటివరకు అధికారిక ప్రకటన మాత్రం ప్రొడక్షన్ హౌస్ నుంచి రాలేదు. వాస్తవానికి ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ ఇంకా స్టార్ట్ చేయలేదు. కల్కి సినిమా పూర్తయిన తర్వాత ఈ సినిమా ప్రమోషన్స్ ను మొదలుపెడతామని అప్పట్లో నిర్మాత విశ్వప్రసాద్ (TG Vishwa Parasad) చెప్పుకొచ్చారు. మొత్తానికి ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ తుది దశకు చేరుకున్నట్లు వార్తలు వినిపించాయి. ఇక రీసెంట్ గా మాళవిక మోహన్ కూడా ఈ సినిమా షూటింగ్ అయిపోయింది. అని రీసెంట్ గా ఒక ఫంక్షన్ లో మీడియాతో ముచ్చటిస్తూ చెప్పుకొచ్చింది. నేను చేస్తున్న ఫస్ట్ తెలుగు సినిమా ఇది. చాలా ఎక్సైటింగ్ గా ఉంది. సినిమా చాలా బాగా వచ్చింది. నా ఫేవరెట్ హీరోస్ లో ప్రభాస్ ఒకరు అంటూ తెలిపింది.
మాళవిక మోహనన్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో డెబ్యూ ఫిలిం చేయకపోయినా, లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన మాస్టర్ సినిమాలో నటించింది. లోకేష్ సినిమా అంటే తెలుగు ప్రేక్షకులు కూడా ఎగబడి చూస్తారు. కాబట్టి ఆ విధంగా మాళవిక మోహనన్ తెలుగు ప్రేక్షకులు కూడా సుపరిచితమే. ఇక మలయాళం లో తెరకెక్కిన క్రిస్టి సినిమాలో నటించింది మాళవిక. ఈ సినిమా డీసెంట్ హిట్ గా నిలిచింది. చాలామంది ఓటీటీ లో ఈ సినిమా చూసి అసలు మీడియా వేదిక పోస్టులు కూడా పెట్టారు. పా రంజిత్ దర్శకత్వం వహించిన తంగలాన్ సినిమాలో కూడా నటించింది మాళవిక. ఇక ప్రస్తుతం సర్దార్ 2 లో నటిస్తోంది. రాజా సాబ్ సినిమా కోసం ప్రభాస్ అభిమానులు తో పాటు ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
Also Read : Vignesh Shivan: ధనుష్ వర్సెస్ నయనతార కాంట్రవర్సీ.. విఘ్నేష్ శివన్‌పై ఎఫెక్ట్