E-Paper
Advertisement

Pushpa 2: ఇదెక్కడి మాస్ రా మావ.. సినిమా రిలీజ్‌కు ఇంకా కొద్ది రోజులే.. కానీ ఇప్పుడు షూటింగా..!

Pushpa 2: ఇదెక్కడి మాస్ రా మావ.. సినిమా రిలీజ్‌కు ఇంకా కొద్ది రోజులే.. కానీ ఇప్పుడు షూటింగా..!
Advertisement

Pushpa 2 Interval Scene Action Sequence(Tollywood news in telugu): ప్రస్తుతం సినీ ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న మోస్ట్ అవైడెట్ ఫిల్మ్ ‘పుష్ప 2’. దర్శకుడు సుకుమార్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు. ఫస్ట్ పార్ట్ ప్రపంచ వ్యాప్తంగా అదిరిపోయే రెస్పాన్స్ రాబట్టడంతో సెకండ్ పార్ట్‌ను మరింత గ్రాండ్ లెవెల్లో తెరకెక్కిస్తున్నాడు. క్వాలిటీతో సహా ఇతర విషయాలలో ఎక్కడా తగ్గడం లేదు. సినిమా రిలీజ్ కాస్త లేట్ అయినా పర్వాలేదు కానీ సినీ ప్రేక్షకులకు మంచి థ్రిల్లింగ్ అందించాలని అనుకుంటున్నాడు.

ఇందులో భాగంగానే ‘పుష్ప2’ మూవీ పట్టాలెక్కి రెండు ఏళ్లు దాటుతున్నా ఇంకా రిలీజ్‌కు నోచుకోలేదు. అయితే ఈ చిత్రాన్ని ఈ ఏడాది ఆగస్టు 15న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. ఇందులో భాగంగానే ఇప్పుడిప్పుడే ఈ మూవీకి సంబంధించిన అప్డేట్‌లను మేకర్స్ అందిస్తున్నారు. వరుస అప్డేట్‌లతో సినీ ప్రేక్షకుల్ని, అభిమానుల్ని ఆకట్టుకుంటున్నారు.

Advertisement

ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్‌లు సినిమాపై ఓ రేంజ్‌లో అంచనాలు పెంచేశాయి. ఇక ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్ అయితే బ్లాక్ బస్టర్ రెస్పాన్స్‌తో యూట్యూబ్‌ను షేక్ చేసింది. మిలియన్ల వ్యూస్, లైక్స్‌తో అదరగొట్టేసింది. అయితే రీసెంట్‌గా సెకండ్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ‘సూసేటి అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా సామీ’ అంటూ సాగే ఈ సెకండ్ సాంగ్‌కి రెస్పాన్స్ అదిరిపోయింది.

Also Read: ‘పుష్ప 2’ హిందీ బిజినెస్ తెలిస్తే మతిపోతుంది భయ్యా.. రూ 200 కోట్లా..?

Advertisement

ఈ సాంగ్‌లో బన్నీ, రష్మికల క్లాసిక్ స్టెప్పులు సినీ ప్రేక్షకుల్ని, అభిమానుల్ని బాగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ మూవీ రిలీజ్‌కు మరికొద్ది రోజులే టైం ఉంది. ఈ క్రమంలో తాజాగా ఓ వార్త బయటకొచ్చింది. ఈ మూవీ షూటింగ్ ఇంకా పూర్తి కాలేదని తెలుస్తోంది. ఇందులో భాగంగానే మేకర్స్ ఇప్పుడు ఈ మూవీలోని క్లైమాక్స్ షూటింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రీకరణలో మాస్ యాక్షన్ సీన్లను షూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా భారీ యాక్షన్ సీక్వెన్లతో ఇంటర్వెల్ సీన్లు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయని అంటున్నారు.

అంతేకాకుండా ఐటెం సాంగ్‌ను కూడా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ ఐటెం సాంగ్‌లో ‘యానిమల్’ బ్యూటీ త్రిప్తి డిమ్రి నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇవన్నీ చూసుకుంటే పుష్ప 2 సినిమా ఓ రేంజ్‌లో ఉంటుందని గట్టిగా టాక్ నడుస్తోంది. అయితే ఈ విషయం తెలిసి పలువురు నెటిజన్లు ఆశ్యర్యపోతున్నారు. సినిమా రిలీజ్‌కు ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉంది కదా మరి ఇప్పుడు షూట్ చేయడమేంటని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో ఇదెక్కడి మాస్ రా మావ అంటూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×