E-Paper
Advertisement

Pushpa 2 Hindi Business: ‘పుష్ప 2’ హిందీ బిజినెస్ తెలిస్తే మతిపోతుంది భయ్యా.. రూ 200 కోట్లా..?

Pushpa 2 Hindi Business: ‘పుష్ప 2’ హిందీ బిజినెస్ తెలిస్తే మతిపోతుంది భయ్యా.. రూ 200 కోట్లా..?
Advertisement

Pushpa 2 Hindi Version Advance Business Shocking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ‘పుష్ప 2’ మూవీ కోసం ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రియులు ఎదురుచూస్తున్నారు. ఫస్ట్ పార్ట్‌కి వచ్చిన అనూహ్య రెస్పాన్స్‌తో సెకండ్ పార్ట్‌పై అంచనాలు అమాంతంగా పెరిగిపోయాయి. అందుకు తగ్గట్టుగానే దర్శకుడు సుకుమార్ పుష్ప 2 చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ చిత్రాన్ని ఈ ఏడాది ఆగస్టు 15న రిలీజ్ చేయనున్నారు.

ఈ నేపథ్యంలో ఈ మూవీపై ఉన్న హైప్ కారణంగా అంచనాలకు మించి బిజినెస్ జరుగుతుంది. ఈ మూవీ హిందీ హక్కుల కోసం ప్రస్తుతం రచ్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ సంస్థలు ఈ మూవీ హిందీ రైట్స్‌ను సొంతం చేసుకోవాలని పోటీ పడుతున్నాయట.

Advertisement

అయితే తాజా సమాచారం ప్రకారం.. ఈ మూవీ హిందీ హక్కులను అనిల్ తదాని భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అతడు దాదాపు రూ.200 కోట్లకు అడ్వాన్స్ బేసిస్‌ మీద ఈ హక్కులను కొన్నాడనే వార్త ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన రాలేదు కాని.. ఈ రూమర్ మాత్రం ఓ రేంజ్‌లో చక్కర్లు కొడుతుంది.

Advertisement

Also Read: పుష్ప 2 టీజర్ సెన్సేషనల్ రికార్డు.. ఆనందం వ్యక్తం చేసిన మూవీ టీం!

అయితే ఈ రూమర్స్‌ అంత తేలిగ్గా కొట్టిపారేసేది కాదని కొందరు భావిస్తున్నారు. ఎందుకంటే గతంలో పుష్ప పార్ట్ వన్ రిలీజ్‌కు ముందు హిందీ హక్కులను గోల్డ్ మైన్స్ సంస్థ దక్కించుకుంది. అయితే ఈ సినిమాపై అంతగా నమ్మకం లేకపోవడంతో థియేటర్‌లో రిలీజ్ చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపించలేదు. తెలుగులో రన్ అయ్యాక.. ఒక యూట్యూబ్ ఛానెల్లో ప్రసారం చేయాలని నిర్ణయించుకున్నారు.

కానీ కంటెంట్‌పై నమ్మకంతో మైత్రీ మూవీ మేకర్స్, అల్లు అర్జున్ మాత్రం వారిని ఒప్పించి థియేటర్లలో రిలీజ్ చేయించారు. దీంతో ఈ మూవీకి వచ్చిన రెస్పాన్స్ చూసి కొన్నవాళ్ల నోటంట మాటరాలేదు. ఐకాన్ స్టార్ ఫాలోయింగ్ చూసి నివ్వెరబోయారు. ఇక పార్ట్ వన్‌కు వచ్చిన ఆ ఫలితమే ఇప్పుడు పార్ట్ 2ని ఈ స్థాయిలో నిలిపింది. ఈ విషయం తెలిసి బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×