BigTV English

Pushpa 2 collections : పుష్పగాడి రికార్డులతో బాలీవుడ్ కు చెమటలు.. బాద్షా రికార్డు బ్రేక్..

Pushpa 2 collections : పుష్పగాడి రికార్డులతో బాలీవుడ్ కు చెమటలు.. బాద్షా రికార్డు బ్రేక్..

Pushpa 2 collections : పుష్ప.. పుష్పా.. ఈ పేరు దేశ వ్యాప్తంగా మారు మోగిపోతుంది. రెండు వారాలు అవుతున్నా కూడా సినిమా క్రేజ్ మాత్రం తగ్గలేదు.. సినిమాకు కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఇప్పటికే కొన్ని సినిమాలను పుష్ప 2 బ్రేక్ చేసేసింది.. అల్లు అర్జున్ సుకుమార్ లు తమ మార్క్ ను సినిమాలో చూపించారు. దాంతో సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. సినిమా థియేటర్లలోకి వచ్చిన ఆరు రోజుల్లోనే 1000 కోట్లను వసూల్ చేస్తుంది. ఇప్పుడు ఏకంగా 1600 కోట్లను దాటేసినట్లు తెలుస్తుంది. సెకండ్ వీక్‌లోనూ అల్లు అర్జున్ జోరు ఏమాత్రం తగ్గలేదు. బన్నీకి స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉన్న తెలుగు రాష్ట్రాలలో టికెట్ బుకింగ్స్ డ్రాప్ అవుతున్నా హిందీ జనాలు మాత్రం పుష్ప 2ని నెత్తిన పెట్టుకున్నారు. ఇప్పటి వరకు ఒక్క హిందీలోనే ఈ సినిమా రూ. 700 కోట్లకు గ్రాస్ వసూళ్లు సాధించింది. రెండు వారాల కలెక్షన్స్ ఎన్ని కోట్లు వసూల్ చేసిందో ఒకసారి చూద్దాం..


2020 లో వచ్చిన పుష్ప మూవీ బాక్సాఫీస్ కలెక్షన్స్ ను అందుకుంది. పుష్ప పార్ట్ 1కి సీక్వెల్‌గా తెరకెక్కిన పుష్ప 2 ది రూల్ భారతీయ చిత్ర పరిశ్రమను షేక్ చేస్తోంది.. పాన్ ఇండియా ట్రెండ్‌లో టాలీవుడ్‌ను కొట్టేవాళ్లు లేరని పుష్ప 2 మరోసారి రుజువు చేసింది. విడుదలై రెండు వారాలు కూడా గడవకముందే ఏకంగా రూ. 1500 కోట్లకు పైగా వసూల్ సాధించింది మరో మైలు రాయిని అందుకుంది.. రెమ్యునరేషన్‌తో పాటు ప్రమోషన్ కార్యక్రమాలతో కలిపి పుష్ప 2ని దాదాపు రూ.450 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. ఇందులో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. ఇక మూవీలో ఫాహద్ ఫాజిల్, జగపతి బాబు, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. టీజర్, ట్రైలర్, పాటలతో పాటు జాతరలో లేడీ గెటప్‌లో అల్లు అర్జున్ లుక్ బయటికి రావడంతో పుష్ప 2 రేంజ్ ఓ రేంజులో ఉండేది. భారీ అంచనాలతో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

గతంలో వచ్చిన ఏ సినిమాకు లేని క్రేజ్ తో పాటుగా నాన్ థియేట్రికల్ రైట్స్ హాట్ కేక్‌ల్లా అమ్ముడయ్యాయి. భారతీయ సినీ చరిత్రలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఏకంగా రూ. 1000 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది పుష్ప 2.. 1200 కోట్ల టార్గెట్ తో వచ్చిన ఈ మూవీ మొదటి రోజు నుంచే కాసుల వర్షం కురిపిస్తుంది. తొలి వారంలోనే ఏకంగా రూ.1000 కోట్లను రాబట్టి ట్రేడ్ వర్గాల అంచనాలను నిజం చేసింది. ఇక సెకండ్ వీక్‌లోనూ అల్లు అర్జున్ జోరు ఏమాత్రం తగ్గలేదు. బన్నీకి స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉన్న తెలుగు రాష్ట్రాలలో టికెట్ బుకింగ్స్ డ్రాప్ అవుతున్నా హిందీ జనాలు మాత్రం పుష్ప 2ని నెత్తిన పెట్టుకున్నారు. హిందీ ఇండస్ట్రీ రికార్డులను షేక్ చేసిన బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ టోటల్ నెట్ కలెక్షన్స్‌ను పుష్ప 2 బద్ధలు కొట్టింది. జవాన్ టోటల్ రన్‌లో హిందీ వర్షెన్‌లో రూ.583 కోట్ల నెట్ సాధించగా.. దానిని 13వ రోజు మార్నింగ్ కలెక్షన్స్‌తోనే పుష్ప 2 బ్రేక్ చేసాడు. ఇదే స్పీడులో కలెక్షన్స్ ను రాబట్టితే బాహుబలి 2 రికార్డు కూడా బ్రేక్ చేస్తుందని తెలుస్తుంది.. ఇక ఈ మూవీ తర్వాత త్రివిక్రమ్ కాంబోలో బన్నీ సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు.


Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×