BigTV English

Samyuktha: తెలుగు ఆడియన్స్ వైల్డ్ ఫైర్ అంటూ ఎంత చక్కగా మాట్లాడిందో

Samyuktha: తెలుగు ఆడియన్స్ వైల్డ్ ఫైర్ అంటూ ఎంత చక్కగా మాట్లాడిందో

Samyuktha: తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోయిన్ గా చాలామంది ఎంట్రీ ఇస్తూ ఉంటారు. ఎంట్రీ ఇచ్చిన వాళ్లంతా సక్సెస్ అవుతారు అని చెప్పలేం. మొదటి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ పడినా కూడా తర్వాత సినిమాలో బోల్తా కొడుతుంటాయి. అలానే మొదటి సినిమా ఊహించిన సక్సెస్ సాధించక పోయినా కూడా కెరియర్ లో వరుసగా అవకాశాలు వచ్చి స్టార్ హీరోలతో చేసే ఛాన్స్ కూడా దక్కించుకునే హీరోయిన్స్ ఉన్నారు. ఇక శ్రీ లీల విషయానికి వస్తే తన నటించిన పెళ్లి సందడి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది కానీ శ్రీలీలా కు వరుసగా అవకాశాలు వచ్చాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వంటి హీరోలతో కూడా నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఒక పాన్ ఇండియా సినిమాలో ఐటెం సాంగ్ కూడా చేసి మంచి గుర్తింపు సాధించింది.


అలానే భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది సంయుక్త. ఈ సినిమాలో రానా వైఫ్ గా కనిపించిన సంయుక్త తనదైన పర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది. ఆ తర్వాత వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన సార్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయం సాధించింది. సంయుక్త కి కూడా తెలుగులో వరుసగా అవకాశాలు రావడం మొదలయ్యాయి. కళ్యాణ్ రామ్ నటించిన డెవిల్, బింబిసారా వంటి సినిమాల్లో కూడా నటించింది. వశిష్ట దర్శకుడుగా పరిచయమైన బింబిసారా సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కళ్యాణ్ రామ్ కెరియర్ లో మంచి కలెక్షన్స్ వసూలు చేసింది ఆ సినిమా. ఇప్పటికీ బింబిసార 2 సినిమా కోసం ఆడియన్స్ ఎంతో క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు అనడంలో కూడా అతిశయోక్తి లేదు.

Also Read : Sankranthiki Vasthunnam: “గోదారి గట్టు” పాట కోసం రమణ గోగుల రెమ్యునరేషన్ ఎంతంటే..?


కార్తీక్ దండు దర్శకత్వం వహించిన విరూపాక్ష సినిమాలో కూడా సంయుక్తమైన కీలక పాత్రలో కనిపించింది. ఇక ఈ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపును సాధించుకుంది. అయితే చాలామంది హీరోయిన్స్ తెలుగు మాట్లాడుతుంటారు కానీ అంత క్లారిటీగా మాట్లాడలేరు. కానీ సంయుక్త విషయానికి వస్తే తెలుగు చాలా స్పష్టంగా మాట్లాడడం నేర్చుకుంది అని చెప్పాలి. అక్కడక్కడ కొన్ని పొరపాట్లు వచ్చినా కూడా పూర్తిగా తెలుగులోనే మాట్లాడటం అలవాటు చేసుకుంది. రీసెంట్ గా అల్లరి నరేష్ నటించిన బచ్చలపల్లి సినిమా ఈవెంట్ కు హాజరైంది సంయుక్త. ఆ ఈవెంట్లో పూర్తిగా తెలుగులో మాట్లాడుతూ తెలుగు ఆడియన్స్ గురించి వైల్డ్ ఫైర్ అంటూ చెప్పకు వచ్చింది. అలానే కిరణ్ అబ్బవరం నటించిన క సినిమా తనకు బాగా నచ్చిందని, ఫ్యూచర్లో అన్ని బాగుంటే మీతో పని చేయాలి అని కిరణ్ ను ఉద్దేశిస్తూ తెలిపింది.

Also Read : Pushpa 2 collections : పుష్పగాడి రికార్డులతో బాలీవుడ్ కు చెమటలు.. బాద్షా రికార్డు బ్రేక్..

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×